Jump to content

అష్టావక్ర గీత

వికీపీడియా నుండి

అష్టావక్ర గీత వేదాంతానికి సంబంధించిన గ్రంథం. ఇది అద్వైత వేదాంతాన్ని వివరిస్తుంది. ఇది అష్టావక్ర మహర్షికీ, జనకుడికీ మధ్య జరిగిన సంవాదంగా వ్రాయబడింది.

అష్టావక్ర మహర్షి - జనకుడి సంవాదం

రచన కాలం

[మార్చు]

భారతీయ సాంఘిక శాస్త్రజ్ఞుడైన రాధాకమల్ ముఖర్జీ ప్రకారం ఈ గ్రంథ రచన భగవద్గీత రచన (సా.పూ॥ 500-400 మధ్య) వెంటనే జరిగింది. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతాచార్యుడిగా పనిచేస్తున్న జె.ఎల్. బ్రాకింగ్టన్ ప్రకారం ఈ గ్రంథం అంత పురాతనం కాదనీ, సా.శ.॥ 8 లో ఆది శంకరుడి అనుచరుడి ద్వారా రచించబడిందనీ లేదా 14వ శతాబ్దంలో శంకరుడి బోధనలు తిరిగి ప్రచారంలోకి వచ్చినపుడో జరిగి ఉండవచ్చని తెలుస్తుంది.[1][2] శ్రీ స్వామి శాంతానంద పూరి ప్రకారం ఈ గ్రంథం గౌడపాద శాయించిన అజాతవాద తత్త్వానికి (సృష్టి జరగలేదని) బీజాలు వేసి ఉండవచ్చనీ, అందువలన ఈ పుస్తక రచన గౌడపాదకి ముందు కాలం, శంకరుడికన్నా ముందు కాలంలో జరిగి ఉండవచ్చు.[3]

అష్టావక్రుడి గుర్తింపు

[మార్చు]

ఇక్కడ సంవాదంలో ఉన్న అష్టావక్రుడు, మహాభారతంలోని అష్టావక్ర మహర్షి ఒక్కరే అయి ఉండవచ్చు. అయితే ఈ విషయానికి ఋజువు గ్రంథంలో లేదు. రాధాకమల్ ముఖర్జీ ఈ గ్రంథంలోని జనకుడు రామాయణంలోని సీత తండ్రి అనీ, యజ్ఞవల్క్య మహర్షికి శిష్యుడనీ గుర్తించారు. ఇందుకు బృహదారణ్యకోపనిషత్తును ప్రమాణగ్రంథంగా తీసుకున్నారు. బృహదారణ్యకోపనిషత్తులో జనకుడు యజ్ఞవల్క్య మహర్షి నుండి పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్నట్టు తెలుస్తుంది.[4] భగవద్గీత (మూడవ అధ్యాయం 20 నుండి 25 శ్లోకాలు) లో జనకుడు ఆత్మజ్ఞానం పొందిన రాజుగా గుర్తించబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. బైరామ్, థామస్ (1990). ది హార్ట్ ఆఫ్ అవేర్నెస్ : ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది అష్టావక్ర గీత." శంభాల పబ్లికేషన్స్. పుట xxiii.
  2. బ్రాకింగ్టన్ జె.ఎల్. (1990). "ది హార్ట్ ఆఫ్ అవేర్నెస్ : ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది అష్టావక్ర గీత" కు ముందు మాట. అనువాదం-థామస్ బైరాన్. శంభాల పబ్లికేషన్స్. పుట xi.
  3. పూరి, శ్రీ స్వామి శాంతానంద (2001). ది క్వాంటం లీప్ ఇంటూ ది ఆబ్సల్యూట్ (ఎసెన్స్ ఆఫ్ అష్టావక్ర గీత)] (PDF). బెంగుళూరు: పార్వతమ్మ సి.పి. సుబ్బరాజు శెట్టి చారిటెబుల్ ట్రస్ట్.
  4. "బృహదారణ్యక ఉపనిషత్తు నాలుగవ అధ్యాయం". Archived from the original on 2017-10-19. Retrieved 2015-07-09.