అష్టభాషా దండకం
అష్టభాషా దండకము శ్రీవెంకటేశ్వరునిపై ఎనిమిది భాషలలో చెప్పిన దండకం. దీనిని సా.శ. 1537లో తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు రాసాడు.
విశేషాలు
[మార్చు]ఇది శ్రీ వేంకటేశ్వరుని పై చెప్పిన దండకము, మొత్తము ఎనిమిది భాషలలో చెప్పబడింది. ఆ భాషలు
అనునవి అష్ట భాషలుగా పేర్కొనబడినవి.
అప్పకవి ప్రకారం
[మార్చు]అప్పకవి సా.శ. 1656లో తన గ్రంథమున అష్టభాషలను ఈ క్రింది విధంగా నిర్వచించాడు.
సంస్కృతము, పాకృతంబును, శౌరసేని
జగైపై మాగథియును బైశాచికయును
జూళీకయు నవభ్రంశంబు సొరిది నంధ్ర
భాషయును నివి చను నష్ట భాష లనగ
అతని ప్రకారం సంస్కృతము, ప్రాకృతము, శౌరసేని, మాగథి, పైశాచి, చూళీక, అపభ్రంశము, ఆంధ్రభాష అనునవి అష్ట భాషలు
అప్పకవి తెలుగును అష్ట భాషలలో చేర్చాడు. కానీ తాళ్లపాక చిన తిమ్మాచార్యుడు తెలుగును చేర్చలేదు. సార్వదేశీ తెనుగు భాష కాదు. అది ప్రాకృత భాషా భేదమే. అప్పకవి సమకాలికురాలు - రంగాజమ్మ మున్నారు దాస విలాసమను గ్రంథమున 1.చూళిక, 2. అపభ్రంశము, 3. ప్రాకృతము, 4. పైశాచి, 5. శౌరశేని, 6. మాగధి, 7. దేశ, 8. సంస్కృతము అని అష్ట భాషలలో సమస్యా పూరణము జరిగినట్లు స్పష్టపరచింది.
సంస్కృతంధ్రములు - షడ్విధ ప్రాకృతములు ( ప్రాకృతము, శూరసేని, మాగధీ, పైశాచి, చూళీక, అపభ్రంశము) లను అష్ట భాషలు అంటారు.[1]
ఈ అష్ట భాషా ప్రశక్తి తెలుగున 14వ శతబ్దిన ప్రారంభమైనది. అంతకు ముందు లేదు [2]
కేవలం భాషా విషయమునే ఇతి వృత్తముగా తీసుకొని దండకము రచించిన వారిలో ప్రథముడు చిన తిరుమలాచార్యుడే. 19వ శతాబ్దిలో దీణి ననుసరించి గుండ్లూరి నరసింహ కవి భాషీయ దండకం రచించాడు. ఇందు తెలుగు దేశమున నాయా వర్ణమూల్ వారి వ్యవహారిక భాష చక్కగ ఉదాహరణలతో చూపబడినవి.