Jump to content

అశ్మీ

వికీపీడియా నుండి
అశ్మీ
దర్శకత్వంశేష్‌ కార్తికేయ
రచనశేష్‌ కార్తికేయ
నిర్మాతస్నేహా రాకేశ్
తారాగణంరుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్
ఛాయాగ్రహణంశేష్‌ కార్తికేయ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంశాండీ అద్దంకి
నిర్మాణ
సంస్థ
సాచీ క్రియేష‌న్స్
విడుదల తేదీ
3 సెప్టెంబరు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

అశ్మీ 2021లో తెలుగులో విడుదలైన థ్లిలర్‌ సినిమా.[1] సాచీ క్రియేష‌న్స్ బ్యానర్ పై స్నేహా రాకేశ్ నిర్మించిన ఈ సినిమాకు శేష్‌ కార్తికేయ దర్శకత్వం వహించాడు. రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదలైంది.[2]

కాలేజీ స్టూడెంట్ అయి అష్మీ (రుషిక రాజ్) కిడ్నాప్ కు గురై ఓ గదిలో కొన్ని సంవత్సరాలుగా నిర్బంధించబడి ఉంటుంది. ఆమెకు కనీస అవసరాలైన ఇవ్వకుండా తినడానికి సరైన ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికీ గురవుతుంది. అశ్మీ ఎట్టకేలకు అక్కడి నుండి బయటపడుతుంది. ఆమె బయటపడ్డాక తనను చిత్రహింసలకు గురిచేసింది రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్) అని నమ్మి అతడిని చంపేస్తుంది. ఆ తర్వాత తనను చిత్రహింసలకు గురిచేసింది రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్) కాదని, శివ (రాజ నరేంద్ర) అని తెలుసుకుంటుంది. అయితే అసలు అష్మీకి, శివకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ ? ఎందుకోసం శివ అష్మీనీ బంధించి చిత్రహింసలకు గురిచేశాడు ? చివరకు అష్మీ శివపై ప్రతీకారం తీర్చుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • రుషికా రాజ్ [4]
  • రాజా నరేంద్ర [5]
  • కేశవ్ దీపక్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సాచీ క్రియేష‌న్స్
  • నిర్మాత: స్నేహా రాకేశ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేష్‌ కార్తికేయ
  • సంగీతం: శాండీ అద్దంకి
  • సినిమాటోగ్రఫీ: శేష్‌ కార్తికేయ
  • ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (5 July 2021). "నయా థ్రిల్లర్‌ అశ్మీ". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
  2. Eenadu. "Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే! - upcoming movies in september first week 2021". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
  3. NTV (3 September 2021). "రివ్యూ: అశ్మీ". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
  4. Nava Telangana (2 September 2021). "ప్రతి మహిళ గర్వపడే సినిమా". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
  5. Andrajyothy (7 September 2021). "పవన్‌... ప్రభాస్‌ స్ఫూరితో!". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=అశ్మీ&oldid=4334201" నుండి వెలికితీశారు