Jump to content

అవంతిక మిశ్రా

వికీపీడియా నుండి
అవంతిక మిశ్రా
జననంమే 30, 1992
జాతీయతభారతీయురాలు
విద్యఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిట్యాట్, కేంద్రీయ విద్యాలయ హెబ్బల్
విద్యాసంస్థబి.యం.ఎస్. ఇంజనీరింగ్ కళాశాల
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు
తల్లిదండ్రులుఎం.కె. మిశ్రా, సవిత మిశ్రా

అవంతిక మిశ్రా తెలుగు సినిమా నటి. 2014లో వచ్చిన మాయ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అవంతిక 1992, మే 30న ఎం.కె. మిశ్రా, సవిత మిశ్రా దంపతులకు న్యూఢిల్లీలో జన్మించింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిట్యూట్, కేంద్రీయ విద్యాలయ హెబ్బల్ లో చదివిన అవంతిక... బి.యం.ఎస్. ఇంజనీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివింది.

సినిమారంగం

[మార్చు]

సినిమాలపై ఆసక్తి ఉన్న అవంతిక చదువు పూర్తికాగానే మోడలింగ్ లోకి ప్రవేశించి పూమా, ఫెమినా వంటి ఇతర కంపెనీలకు ఆరునెలలపాటు మోడలింగ్ చేసింది. దర్శకుడు నీలకంఠ అవంతికను చూసిన 10 నిముషాల్లో మాయ సినిమాకు ఎంపిక చేసాడు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 మాయ మేఘన తెలుగు
2016 మీకు మీరే మాకు మేమే[3][4] ప్రియ తెలుగు
2017 వైశాఖం భానుమతి తెలుగు
2017 నేంజమెల్లమ్ కాదల్[5] లియోన తమిళం
2019 మీకు మాత్రమే చెప్తా[6] తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "Maaya (2014) | Maaya Movie | Maaya Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.
  2. "Modelling gave me confidence to be in movies: Avantika Mishra | The Indian Express". indianexpress.com. Retrieved 30 October 2019.
  3. ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  4. ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 June 2016. Retrieved 3 February 2020.
  5. "Took time to fall in love with cinema: Avantika | Business Standard News". Business-standard.com. 17 January 2017. Retrieved 30 October 2019.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]