అల్లూరి గౌరీలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లూరి గౌరీలక్ష్మి
జననం
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుపెన్మత్స గౌరీలక్ష్మి
విద్యబి.ఎస్.సి, ఎం.ఎ. (పొలిటికల్ సైన్స్), బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం,
అంబేద్కర్ విశ్వవిద్యాలయం
వృత్తిజనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్)
క్రియాశీల సంవత్సరాలు1986-2019
ఉద్యోగంఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత్రి, కవయిత్రి
గుర్తించదగిన సేవలు
మనోచిత్రం, నిలువుటద్దం, భావవల్లరి, అంతర్గానం
జీవిత భాగస్వామిపెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజు
పిల్లలుకాంతిరేఖ, పెన్మెత్స ఫణిచంద్రవర్మ
తల్లిదండ్రులుఅల్లూరి లక్ష్మీపతిరాజు, అల్లూరి నరసమ్మ
బంధువులుశ్రావణి (కోడలు), నడింపల్లి రఘుకిరణ్ (అల్లుడు)
పురస్కారాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉగాది పురస్కారం (2018), తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2017)
వెబ్‌సైటుhttp://gourilakshmi.com/

అల్లూరి గౌరీలక్ష్మి తెలుగు కథా రచయిత్రి, నవలా రచయిత్రి, కవయిత్రి. పది పుస్తకాలకు పైగా ప్రచురించింది. కీర్తి పురస్కారగ్రహీత.

జీవిత విశేషాలు

[మార్చు]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అల్లూరి గౌరీలక్ష్మి పూర్వపు తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా) అంతర్వేదిపాలెం గ్రామంలో అల్లూరి లక్ష్మీపతిరాజు, నరసమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం రాజమండ్రిలోనూ హైస్కూలు విద్య మలికిపురం, మద్రాసు, గాజువాక, మోగల్లు, కోపల్లెలలో జరిగాయి. తరువాత మలికిపురంలోని డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎస్సీ చదివింది. తరువాత అంబేద్కర్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి రాజకీయ శాస్త్రంలో ఎం.ఎ. పట్టా, పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీలను సంపాదించింది.[1]

ఉద్యోగం

[మార్చు]

ఈమె 1984లో ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల సంస్థలో చేరి రెండున్నర సంవత్సరాలు పనిచేసింది. తరువాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలో చేరి 33 సంవత్సరాలు ఆ సంస్థకు సేవలను అందించింది. 2019లో ఆ సంస్థ నుండి పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజరుగా పదవీ విరమణ చేసింది.

కుటుంబం

[మార్చు]

ఈమెకు పెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజుతో వివాహం జరిగింది. ఈ దంపతులకు కాంతిరేఖ, పెన్మెత్స ఫణిచంద్రవర్మ అనే పిల్లలున్నారు.

సాహిత్యరంగం

[మార్చు]
పుస్తక ముఖచిత్రంపై అల్లూరి గౌరీలక్ష్మి

ఈమెకు చిన్నతనం నుండే పుస్తకపఠనంపై ఆసక్తి ఉండేది. తన గ్రామంలో ఉన్న గ్రంథాలయం నుండి నవలలు, కథల పుస్తకాలు తెచ్చుకుని చదివి సాహిత్యం పట్ల మక్కువ పెంచుకుంది. ఈమె తొలి రచన మగాడు అనే కథ 1983 లో విజయ అనే మాసపత్రికలో ప్రచురితమయ్యింది.[2] తరువాత ఈమె 1992 నుండి విరివిగా కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, రాజకీయ వ్యంగ్య రచనలు చేస్తూ ఉంది. ఈమె రచనలు కొన్ని పుస్తకరూపంలో వెలువడ్డాయి.

రచనలు

[మార్చు]

ఈమె కథలు, కవితలు, కాలమ్స్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, విపుల, ఆంధ్రప్రభ, స్వాతి, పల్లకి, సృజన, పత్రిక, మయూరి, ఉదయం, సుప్రభాతం, విజయ, తేజ, భూమిక, సంచిక, నెచ్చెలి, వాకిలి, మాలిక, జాగృతి, సాక్షి, సాహిత్య ప్రస్థానం, విహంగ వంటి అనేక దిన, వార, మాస, పక్ష పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

పుస్తకరూపంలో వెలువడిన ఈమె రచనల జాబితా:

  • మనోచిత్రం (కథల సంపుటి)
  • వసంత కోకిల (కథల సంపుటి)
  • నిలువుటద్దం (కవితాసంపుటి)
  • భావవల్లరి (కాలమ్స్)
  • అంతర్గానం (నవల)
  • కొత్తచూపు (కథల సంపుటి)
  • నీరెండదీపాలు (కవితాసంపుటి)
  • అనుకోని అతిథి (నవల)
  • ఎదలోపలి ఎద (నవల)
  • అమ్మకో అబద్ధం (కథల సంపుటి)

పురస్కారాలు

[మార్చు]

ఈమె రచనలకు వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో అనేక బహుమతులు లభించాయి. మూడు దశాబ్దాలకు పైగా ఈమె సాహిత్య రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా అనేక సంస్థలు ఈమెను సత్కరించాయి.

వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

మూలాలు

[మార్చు]
  1. బెందాళం కృష్ణారావు (6 April 2018). "ఎదలో అంతర్గానం ఆమె సాహిత్యపు కొత్త చూపు". ప్రజాశక్తి దినపత్రిక.
  2. వాకా మంజులారెడ్డి (26 June 2022). "అక్షర పూదోటలో విహారం". సాక్షి. Retrieved 14 September 2022.[permanent dead link]
  3. విజయవాడ సిటీలైఫ్ (25 April 2018). "తరుణి: సాహిత్యలక్ష్మి". ఆంధ్రజ్యోతి దినపత్రిక.
  4. సంపాదకుడు (1 June 2015). "జగమంత కుటుంబం మాతృదేవోభవ పురస్కారాల ప్రదానం". సృజన రంజని. 11 (6). Retrieved 14 September 2022.
  5. న్యూస్ టుడే (13 October 2018). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". ఈనాడు. Archived from the original on 15 అక్టోబరు 2018. Retrieved 14 September 2022.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతరలింకులు

[మార్చు]