అల్లి
అల్లి | |
---|---|
Scientific classification | |
Unrecognized taxon (fix): | Melastomataceae |
Genus: | Memecylon |
Species: | M. umbellatum
|
Binomial name | |
Memecylon umbellatum |
మెమెసిలోన్ అంబెల్లటం ను సాధారణంగా ఐరన్‌వుడ్ , అంజని (మరాఠీ) లేదా అల్లి కరంద(తెలుగు) అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశం, అండమాన్ దీవులు, దక్కన్ తీర ప్రాంతంలో కనిపించే ఒక చిన్న చెట్టు.[1] ఇది శ్రీలంకలో కూడా కనిపిస్తుంది, ఇక్కడ దీనిని బ్లూ మిస్ట్ , కోర-కహా ( సింహళ భాష ) , కుర్రికాయ ( తమిళ భాష ) అని పిలుస్తారు. ఆకులలో పసుపు రంగు, ఒక గ్లూకోసైడ్ ఉంటుంది, ఇది బౌద్ధ సన్యాసుల వస్త్రాలకు రంగు వేయడానికి, రెల్లు చాపలకు (దుంబర మాట్స్) రంగు వేయడానికి ఉపయోగిస్తారు. ఔషధ పరంగా అతిసార వ్యాధి నుండి రక్షించేందుకు ఈ ఆకులకు రోగనిరోధకశక్తి ఉందని చెబుతారు.[2] చారిత్రాత్మకంగా, ఈ ప్లాంట్ వూట్జ్ స్టీల్ ఉత్పత్తిలో ఇంధనంగా కాల్చబడింది . గృహ నిర్మాణానికి, పడవల తయారీలో కూడా ఈ చెట్టు కలప వాడుతారు. ఈ కలప ఇనుములా గట్టిగ ఉంటుందని ఐరన్ వుడ్ అని వ్యవహరించబడింది.
తెలుగు రాష్ట్రాలలో
[మార్చు]ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో, చిట్టడవుల్లో అల్లిచెట్లు తరచూ కనిపిస్తాయి. వర్షాకాలంలో, జూన్,జూలై, ఆగష్టు మాసాల్లో అల్లిపళ్ళు సమృద్హిగా లభ్యమవుతాయికాస్తాయి. పండ్లు కుంకుడుగింజ అంత ప్రమాణం గుండ్రంగా, నల్లగా ఉంటాయి.శ్రీశైలంవద్ద, కృష్ణ ఇరుదరుల చెంచులు ఈ పళ్లను సేకరించి సమీపంలోని గ్రామాల్లో, టౌన్ లలో అమ్ముతుంటారు. పండ్ల సేకరణ చాలా కష్టమైనపని. మనుషులు చొరలేని చిక్కని ముళ్లపొదలు, చెట్లనడుమ అక్కడక్కడా ఈ చెట్లు, షుమారైన మాన్లు ఉంటాయి.
కొమ్మకొమ్మకు, అంటుకొని చిన్న ఉసిరిక పిందెల్లాగా పచ్చి కాయలు, క్రమంగా పండి పసుపు, చివరకు పళ్ళు నల్లద్రాక్ష రంగుకు మారతాయి. పండు ఆకారం కుంకుడు గింజ అంత ఉంటుంది. ఈ అల్లిచెట్టు పచ్చి కట్టెలు కూడా పొయ్యిలో పెడితే బాగా మండుతాయి. ఈ పళ్ళను పక్షులు, అడవి కుందేళ్లు, జింకలు వంటివి ఇష్టంగా తింటాయి.
చెంచులు ఈ పళ్ళను ఇష్టంగా తింటారు, సేకరించి గ్రామాల్లో అమ్ముతారు. పళ్ళు తీయగా, రుచిగా ఉంటాయి. తిన్నతర్వాత నోరంతా నీలంగా ఉండి, కాసేపటికి మామూలవుతుంది.
చిత్ర మాలిక
[మార్చు]== మూలాలు ==. 1.అప్పారావు ముప్పాళ్ళ తెలుగు Quoraలో రాసిన వ్యాసం,2. గణితయోగ స్వచ్చంద సంస్థ సేకరించిన వివరాలు.3. ఫోటోలు; కాళిదాసు వంశీధర్
- ↑ "Medicinal plants of India with anti-diabetic potential". Journal of Ethnopharmacology. 81 (1). Ireland: 2002 Elsevier Science Ireland Ltd.: 81–100 June 2002. doi:10.1016/S0378-8741(02)00059-4. PMID 12020931.
{{cite journal}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ S. R. Kottegoda, Flowers of Sri Lanka, 1994; Colombo: Royal Asiatic Society of Sri Lanka. ISBN 9559086014