Jump to content

అల్లం తేనీరు

వికీపీడియా నుండి

Ginger Tea,అల్లం టీ

తయారీకి కావలిసినపదార్ధాలు :

[మార్చు]

ఒక గ్లాసు అల్లం తేనీరు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

తయారు చేయు విధానం :

[మార్చు]

స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి. మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి. ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి.

ఉపయోగాలు :

[మార్చు]

అల్లం టీ ఉదయం తాగితే రోజంతా హుషారుగా ఉంచుతుంది. అల్లం టీ ని సేవించడం ద్వారా గర్భణీలకు ఎంతో మేలు చేకూరుతుందట. వేవిళ్లకు చెక్ పెట్టడంలో అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా తెల్లవారున సాధారణ టీలో అల్లం బిస్కెట్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు.[1] మోకాళ్ల వాపులు కూడా అల్లం ' టీ ' రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు.[2] అయితే రోజులో నాలుగు సార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.అల్లం టీ తాగినప్పుడు ఆహ్లాదంగా అనిపించుకుండా కడుపులో ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. దానివల్ల నూతనోత్సహం వస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. అల్లం టీ ఉదయం లేవగానే తగండి ఆరొగ్యంగా వుండండి
  2. Bhu, Rajat (2022-06-07). "Ginger uses in Ayurveda – 11 Potential Health Benefits and Recipes". Ayurkula (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
  3. అల్లం టీ యొక్క ప్రయోజనాలు