అలీపూర్ జైలు
స్వరూపం
ప్రదేశం | అలీపూర్, కోల్‌కతా |
---|---|
రకం | ఓపెన్ |
భద్రతా తరగతి | గరిష్టం |
సామర్థ్యం | 2000 |
ప్ర్రారంభం | 1864[1] |
పూర్వపు నామం | ఓల్డ్ అలీపూర్ జైలు |
అలీపూర్ జైలు ఇది కోల్‌కతాలోని అలీపూర్‌లోని సెంట్రల్ జైలు. దీన్ని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ (Presidency Correctional Home) అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్రిటిష్ పాలనలో సుభాస్ చంద్ర బోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఎందరినో ఉంచారు. ఇక్కడ ప్రెస్ కూడా ఉంది. ఇది 2019 ఫిబ్రవరి 20న మూసివేయబడింది.[2] ప్రస్తుతం జైలు ప్రదేశాన్ని అక్కడ ఖైదు చేసి ఉరితీసిన అమరవీరుల పేరిట స్వాతంత్ర్య మ్యూజియం (Independence museum) గా అభివృద్ధి చేస్తున్నారు.[3] ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్‌లు చేసారు.
జైలు జీవితం గడిపిన ప్రముఖులు
[మార్చు]- శ్రీ అరబిందో - అలీపూర్ బాంబు కేసు తర్వాత 1908 మే నుంచి 1909 మే వరకు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఆయన సుప్రభాత్ జర్నల్‌లో బెంగాలీలో వరుస కథనాలను రాశాడు, తర్వాత టేల్స్ ఆఫ్ ప్రిజన్ లైఫ్‌గా ప్రచురించబడింది.[4]
- డూడూ మియాన్, 1857–1861
- సుభాష్ చంద్రబోస్, 1908-1909
- కె.కామరాజ్, 1930
- రామకృష్ణ బిశ్వాస్
- బిధాన్ చంద్ర రాయ్, 1930
- పారుల్ ముఖర్జీ, 1930లలో
- చారు మజుందార్
- ప్రమోద్ రంజన్ చౌదరి, 1926
- జాక్ ప్రీగర్, 1981
- పి. కక్కన్
- చారు చంద్రబోస్
మూలాలు
[మార్చు]- ↑ Presidency Correctional Home
- ↑ "End of an era as Alipore Central jail closes down". Business Standard. Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 4 డిసెంబరు 2010.
- ↑ "Alipore jail to house museum on Independence movement". Times of India. Archived from the original on 9 అక్టోబరు 2021. Retrieved 9 అక్టోబరు 2021.
- ↑ "The Prison-Cell Of Alipore". Sri Aurobindo Society. Archived from the original on 30 నవంబరు 2010. Retrieved 4 డిసెంబరు 2010.