అయాచితం నటేశ్వరశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్

అయాచితం నటేశ్వరశర్మ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో కవిత్వ పఠనం చేస్తున్న ఆయాచితం నటేశ్వర శర్మ
జననం(1956-07-17)1956 జూలై 17
మరణం2024 సెప్టెంబరు 10(2024-09-10) (వయసు 68)
మరణ కారణంఅనారోగ్యం
ఇతర పేర్లుకవిరత్న, అవధానిశిరోమణి, మహోపాధ్యాయ
విద్యవ్యాకరణ శిరోమణి
వృత్తివిశ్రాంత ప్రధానాచార్యుడు
ప్రాచ్య విద్యా పరిషత్ ప్రాచ్య కళాశాల, కామారెడ్డి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, అవధాని
గుర్తించదగిన సేవలు
భారతీ ప్రశస్తి, ఆముక్తమాల్యద పరిశీలనము
పురస్కారాలుతెలంగాణ ప్రభుత్వం నుండి దాశరథి సాహితీ పురస్కారం (2023)
తె.వి.వి అవధాన కీర్తి పురస్కారం
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో సాహిత్య పరిశోధనకు బంగారు పతకం
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా 2016, మార్చి 21న హైదరాబాదులోని రవీంద్రభారతిలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో అయాచితం నటేశ్వర శర్మకి మామిడి హరికృష్ణ సత్కారం

డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ (1956 జులై 17 - 2024 సెప్టెంబరు 10) తెలంగాణకు చెందిన సంస్కృతాంధ్రవిద్వత్కవి, శతావధాని.[1] 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్నాడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1956, జులై 17న కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడు. 1966వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.జాతీయసాహిత్యపరిషత్తు, హితసాహితి వంటి సాహిత్యసంస్థలలో కీలక పదవులలో సాహిత్య వికాసానికి కృషి చేశారు.ఎందరో యువకవులకు మార్గదర్శనం చేసి కవులుగా తీర్చిదిద్దారు.సంస్కృతంలో,తెలుగులో అష్టావధానాలు,శతావధానాలు చేశారు.

రచనలు

[మార్చు]
2023లో దాశరథి సాహితీ పురస్కారం అందుకుంటున్న అయాచితం నటేశ్వరశర్మ
  1. వసంత కుమారి
  2. శ్రీ గజానన స్తోత్రమ్‌
  3. శ్రీ షోడశీ
  4. భారతీప్రశస్తి
  5. ఆముక్తమాల్యద పరిశీలనము
  6. ఋతుగీత
  7. శ్రీ శివమహిమ్నస్తోత్రవ్యాఖ్య
  8. సమయ విలాసిని
  9. నవ్యగీతి
  10. బాలరామాయణము
  11. కవితాశతకము
  12. నవ్యనీతి శతకము
  13. శ్రీ రాజేశ్వరశతకము
  14. శ్రీ గణేశశతకము
  15. శ్రీ మాతృకావర్ణమాలికా
  16. శ్రీ రామగుణమణిమాల
  17. ఆంధ్రతేజం
  18. భారతీయ శతకము
  19. ఆరురుచుల ఆమని
  20. పంచశరీయమ్‌
  21. వాణీశతకము
  22. శ్రీకాలభైరవ సుప్రభాతమ్‌
  23. శ్రీలలితాంబికాశతకమ్‌
  24. లాస్యం
  25. తాండవం
  26. శ్రీ భీమేశ్వరశతకము
  27. ప్రభాకరశతకమ్‌
  28. లక్ష్మీధర వ్యాఖ్యానవైభవము
  29. లక్ష్మీవిలాసము
  30. భాగవతకథామృతం
  31. సౌదామనీ విలాసము
  32. రథాలరామారెడ్డిపేట
  33. చైత్రరథం
  34. జీవనయానము
  35. పురుషార్థవివేచనం
  36. నూటపదహారు
  37. సిరినోము
  38. చుక్కలు
  39. శ్రీరామలింగేశ్వర హృదయము
  40. ఆటవెలది
  41. శతపత్రం
  42. కాపర్తి వేంకటేశ్వర సుప్రభాతమ్‌
  43. సంకష్టహర గణేశ నక్షత్రమాలిక
  44. పంచతంత్ర కథామంజరి
  45. శ్రీరేణుకా సుప్రభాత వ్యాఖ్య
  46. శ్రీ గణపురాంజనేయ స్తుతి వ్యాఖ్య
  47. శ్రీ వేంకటేశ్వర విలాసము
  48. శ్రీమద్భాగవత దశమస్కంధానువాదం
  49. రమణీయ శ్లోకం - కమనీయ భావం
  50. శకుంతల[3]

బిరుదులు

[మార్చు]
  1. కవిరత్న[4]
  2. అవధానిశిరోమణి
  3. మహోపాధ్యాయ

పురస్కారాలు

[మార్చు]
  1. 1977 - హైదరాబాద్ కళాసాహితి వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కవితా పురస్కారం
  2. 1979 - వేములవాడ కళాభారతి వారి రాష్ట్రస్థాయి సాహిత్యవిమర్శ పురస్కారం
  3. 1980 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ రజతోత్సవాలలో భాగంగా ఉత్తమ కవితా పురస్కారం
  4. 1983 - భారతీప్రశస్తి కవితా సంపుటికి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం
  5. 1994 - సంస్కృతంలో ఉత్తమ సాహిత్య పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి నుండి స్వర్ణపతకం
  6. 2002 - గరిశకుర్తి సాహితీ పురస్కారం
  7. 2005 - స్పందన సాహితి, రాయగడ (ఒరిస్సా) వారి ఉత్తమ కవితా పురస్కారం
  8. 2005 - నిజామాబాద్ జిల్లా ఉగాది ఉత్సవాలలో అవధాన పురస్కారం
  9. 2009 - రంజని - విశ్వనాథ జాతీయ పద్యకవితా పురస్కారం
  10. 2010 - శోభనాథ్‌సింహ్ కవితా పురస్కారం
  11. 2011 - కిన్నెర కుందుర్తి వచనకవితా పురస్కారం
  12. 2011 - రాష్ట్రకవి ఓగేటి సాహిత్య పురస్కారం
  13. 2012 - ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ఉత్తమకవి పురస్కారం
  14. 2012 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవధాన కీర్తి పురస్కారం
  15. 2014 - తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఆలేరు వారి తేజ పురస్కారం
  16. 2016 - తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015) - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[5][6]
  17. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ఊపురస్కారం 2016 (శకుంతల పుస్తకానికి)[7][8]
  18. 2023 - దాశరథి సాహితీ పురస్కారం (తెలంగాణ ప్రభుత్వం)[9]

మరణం

[మార్చు]

అయాచితం నటేశ్వరశర్మ అనారోగ్యంతో 2024 సెప్టెంబరు 10హైదరాబాదు, బోయినపల్లిలోని తన స్వగృహంలో మరణించాడు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2024-09-11). "తెలంగాణ సాహితీ శిఖరం అయాచితం". www.ntnews.com. Retrieved 2024-09-20.
  2. Namasthe Telangana (23 July 2023). "దాశరథి కలలు సాకారం.. ఆయన స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన : మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.
  3. ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీలో[permanent dead link] ముదిగొండ శివప్రసాద్ సమీక్ష[permanent dead link]
  4. నమస్తే తెలంగాణాలో వార్తాంశం[permanent dead link]
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
  6. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.
  7. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  8. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  9. Namasthe Telangana (19 July 2023). "క‌వి, ర‌చ‌యిత న‌టేశ్వ‌ర శ‌ర్మ‌కు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య పుర‌స్కారం". Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.
  10. "Ayachitam Nateswara sarma: దాశరథి పురస్కారగ్రహీత అయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత". EENADU. Retrieved 2024-09-20.
  11. ABN (2024-09-11). "ప్రఖ్యాత సంస్కృతాంధ్ర పండితుడు అయాచితం నటేశ్వర శర్మ ఇకలేరు". Andhrajyothy Telugu News. Retrieved 2024-09-20.