అమ్మోనియం ఎజైడ్
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఇతర పేర్లు
Ammonium trinitride
| |||
ధర్మములు | |||
NH4N3, NH3.HN3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 60.059 g/mol | ||
స్వరూపం | White crystalline solid | ||
వాసన | Odorless | ||
సాంద్రత | 1.3459 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 160 °C (320 °F; 433 K) | ||
బాష్పీభవన స్థానం | 400 °C (752 °F; 673 K) (decomposes) | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
rhombic | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | Very toxic, explosive | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Sodium azide Potassium azide | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
అమ్మోనియం ఎజైడ్/ఎజాయిడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.ఇందులోని సంఘటన పదార్థాలు నైట్రోజన్, హైడ్రోజన్ మూలక పరమాణువు లు. అమ్మోనియల్ సమూహంతో నైట్రోజన్ సంయోగం వలన అమ్మోనియం ఎజైడ్ ఏర్పడినది.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం NH4N3.ఇది అమ్మోనియా, హైడ్రోజోయిక్ ఆమ్లముల యొక్క లవణం.రంగులేని స్పటిక అణుసౌష్టవమున్న ఈ రసాయన స్పటిక లవణం శక్తివంతంగా ప్రేలు స్వాభావం (విస్పోటక గుణం) కల్గిఉన్నది.[1] అమ్మోనియం ఎజైడ్ శరీరధర్మ సంబంధి చర్యాశీలత కల్గినది,, దీనిని పీల్చినపుడు/శ్వాసించినపుడు తలనొప్పి వస్తుంది,, హృదయ కంపన తీవ్రత పెరుగును
ఆవిష్కరణ
[మార్చు]థెడోర్ కుర్టియస్ (Theodor Curtius) అను శాస్త్రవేత్త 1890 లో మొదటగాను ఉత్పత్తి చేసాడు.
భౌతిక లక్షణాలు
[మార్చు]భౌతిక స్థితి
[మార్చు]అమ్మోనియం ఎజైడ్ ఒక తెల్లని స్పటికాకృతికల్గిన ఘనపదార్థం.అమ్మోనియం ఎజైడ్ వాసన లేని రసాయన పదార్థం.అమ్మోనియం ఎజైడ్ రసాయన సంయోగ పదార్థం యొక్క అణుభారం 60.059 గ్రాములు/మోల్.[2] రసాయన ఫార్ములా NH4N3, లేదాNH3.HN3
సాంద్రత
[మార్చు]అమ్మోనియం ఎజైడ్ రసాయన పదార్థం యొక్కసాంద్రత,25 °C వద్ద 1.3459గ్రాములు/సెం.మీ3.[1]
ద్రవీభవన ఉష్ణోగ్రత
[మార్చు]అమ్మోనియం ఎజైడ్ రసాయన సమ్మేళన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 160 °C (320 °F; 433 K).[1]
బాష్పీభవన ఉష్ణోగ్రత
[మార్చు]అమ్మోనియం ఎజైడ్ రసాయన సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం 400 °C (752 °F; 673K), ఈ ఉష్ణోగ్రత వద్ద వద్ద అమ్మోనియం ఎజైడ్ రసాయన వియోగం చెందును.
ద్రావణీయత
[మార్చు]నీటిలో అమ్మోనియం ఎజైడ్ కరుగదు.
ఉత్పత్తి
[మార్చు]సజలజల ద్రావణ స్థితిలో హైడ్రాజీన్ను అమ్మోనియం ఏజైడ్ గా పరివర్తింపవచ్చును.[3]
- 2N2H4↔NH4N3+4H+
నిర్మాణం
[మార్చు]అమ్మోనియం ఎజైడ్ ఒక అయోనిక్ పదార్థం. అతి అత్యల్ప ప్రమాణంలో నీటిలో కరుగును.అమ్మోనియం ఎజైడ్ లో 93% (భారం) వరకు నైట్రోజన్ అమ్మోనియం కేటయాన్, అజైడ్ అనయాన్ రూపంలో ఉండును. అమ్మోనియం ఎజైడ్ యొక్క నిర్మాణ పరమైన ఐసొమర్ టెట్రాజేన్ (tetrazene)
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Ammonium azide". chemicals.etacude.com. Retrieved 2016-04-06.
- ↑ "Ammonium azide". chemspider.com. Retrieved 2016-04-06.
- ↑ "ammonium azide". books.google.co.in. Retrieved 2016-04-06.