Jump to content

అమేలియా కెర్

వికీపీడియా నుండి
అమేలియా కెర్
2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సమయంలో న్యూజిలాండ్ తరపున ఆడుతున్న కెర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమేలియా షార్లెట్ కెర్
పుట్టిన తేదీ (2000-10-13) 2000 అక్టోబరు 13 (వయసు 24)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మారుపేరుమెలీ, మెలోస్, మెలక్స్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుజెస్ కెర్ (సోదరి)
రాబీ కెర్ (తండ్రి)
బ్రూస్ ముర్రే (తాత)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 135)2016 నవంబరు 9 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2023 జూలై 2 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.48
తొలి T20I (క్యాప్ 49)2016 నవంబరు 21 - పాకిస్తాన్ తో
చివరి T20I2023 జూలై 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014/15–presentవెల్లింగ్‌టన్ బ్లేజ్
2018సదరన్ వైపర్స్
2019వెలాసిటీ
2019/20–2020/21బ్రిస్‌బేన్ హీట్
2022–presentలండన్ స్పిరిట్
2022/23–presentబ్రిస్‌బేన్ హీట్
2023–presentముంబై ఇండియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 56 52
చేసిన పరుగులు 1,338 423
బ్యాటింగు సగటు 39.35 18.39
100లు/50లు 2/6 0/0
అత్యధిక స్కోరు 232* 49*
వేసిన బంతులు 2,847 1,145
వికెట్లు 77 50
బౌలింగు సగటు 27.51 22.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/17 3/16
క్యాచ్‌లు/స్టంపింగులు 32/– 27/–
మూలం: ESPNCricinfo, 2023 ఫిబ్రవరి 11

అమేలియా షార్లెట్ కెర్ (జననం 2000, అక్టోబరు 13) న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి. ప్రస్తుతం వెల్లింగ్టన్, న్యూజీలాండ్ తరపున ఆడుతున్నది.[1][2] 2018, జూన్ 13న, కెర్ ఒక మహిళల వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఐర్లాండ్‌పై 232 నాటౌట్ స్కోర్ చేయడంతో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కులైన క్రికెటర్ (పురుషుడు లేదా స్త్రీ)గా నిలిచింది.[3] ఈ డబుల్ సెంచరీ వన్దేల మొత్తంలో మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు, న్యూజీలాండ్ ఆటగాళ్ళలో రెండవ అత్యధికం, మహిళల వన్డేలో అత్యధికం.[4][5][6][7] తర్వాత అదే మ్యాచ్‌లో, 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది.[8][9]

క్రికెట్ రంగం

[మార్చు]

2018 ఆగస్టులో, గత నెలల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల తర్వాత, న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా ఆమెకు సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[10][11] 2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[12][13] టోర్నమెంట్‌కు ముందు, జట్టులో చూడవలసిన క్రీడాకారిణిగా పేరుపొందింది.[14]

2019 మార్చిలో, వార్షిక న్యూజీలాండ్ క్రికెట్ అవార్డులలో ఏఎన్జెడ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.[15] 2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగిన 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఆమె పేరు పొందింది.[16] 2022 ఫిబ్రవరిలో, న్యూజీలాండ్‌లో జరిగిన 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఆమె ఎంపికైంది.[17]

2022 ఏప్రిల్ లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ఆమెను లండన్ స్పిరిట్ కొనుగోలు చేసింది.[18] 2022 జూన్ లో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో కెర్ ఎంపికయ్యాడు.[19]

2023లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో, కెర్‌ను ముంబై ఇండియన్స్ 1 కోటి ధరతో కొనుగోలు చేసింది.[20]

మూలాలు

[మార్చు]
  1. "'I want to be one step ahead of the batters' – Amelia Kerr". International Cricket Council. Retrieved 10 July 2018.
  2. "20 women cricketers for the 2020s". The Cricket Monthly. Retrieved 24 November 2020.
  3. "Celebrating up and coming cricketers this International Youth Day". International Cricket Council. Retrieved 12 August 2020.
  4. Staff writer (13 June 2018). "17-year-old Amelia Kerr blasts 232* to record highest individual score in మహిళా ODIs". The Times of India. Retrieved 13 June 2018.
  5. "Amelia Kerr sends more records tumbling in Dublin". ESPN Cricinfo. Retrieved 13 June 2018.
  6. "Highest Individual Innings in Women's ODI matches". Wisden Records. Retrieved 21 Feb 2021.
  7. "Highest Individual Innings in ODI matches". Wisden Records. Archived from the original on 31 May 2013. Retrieved 21 Feb 2021.
  8. "Teenage Kerr stars with record 232* and five wickets as New Zealand win big". International Cricket Council. Retrieved 13 June 2018.
  9. "Record-breaking Amelia Kerr has 'the world ahead of her'". International Cricket Council. Retrieved 14 June 2018.
  10. "Rachel Priest left out of New Zealand women contracts". ESPN Cricinfo. Retrieved 2 August 2018.
  11. "Four new players included in White Ferns contract list". International Cricket Council. Retrieved 2 August 2018.
  12. "New Zealand women pick spin-heavy squads for Australia T20Is, World T20". ESPN Cricinfo. Retrieved 18 September 2018.
  13. "White Ferns turn to spin in big summer ahead". New Zealand Cricket. Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  14. "Key Players: New Zealand". International Cricket Council. Retrieved 4 November 2018.
  15. "Williamson named NZ Player of the Year at ANZ Awards". ESPN Cricinfo. Retrieved 21 March 2019.
  16. "Lea Tahuhu returns to New Zealand squad for T20 World Cup". International Cricket Council. Retrieved 29 January 2020.
  17. "Leigh Kasperek left out of New Zealand's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 February 2022.
  18. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  19. "Eden Carson, Izzy Gaze earn maiden New Zealand call-ups for Commonwealth Games". ESPN Cricinfo. Retrieved 20 May 2022.
  20. Tripathi, Anuj (ed.). "Amelia Kerr wins big, but White Ferns go largely unsold at first Women's Indian Premier League auction". Newzhub. Retrieved 22 February 2023.

బాహ్య లింకులు

[మార్చు]

Media related to అమేలియా కెర్ at Wikimedia Commons