Jump to content

అమెరికాలో హిందూమతం

వికీపీడియా నుండి
అమెరికాలో హిందూమతం
ఫ్లషింగ్ లోని వినాయక దేవాలయం, పశ్చిమార్థ గోళంలో అత్యంత పురాతన హిందూ దేవాలయం
మొత్తం జనాభా
33,38,214 (2020)
అమెరికా జనాభాలో 1% [1](2016 Public Religion Research Institute data)
1% of the U.S. Population (2015 Pew Research Center data)[2]
భాషలు
మత పరమైనవి
మాట్లాడే భాషలు
Related ethnic groups

అమెరికాలో హిందూమతం మైనారిటీ మతం. క్రైస్తవం, జుడాయిజం, ఇస్లాం తర్వాత నాల్గవ స్థానంలో ఉంది. జనాభాలో 1% మంది హిందువులు. [3] అమెరికన్ హిందువులలో అత్యధికులు దక్షిణాసియా నుండి వలస వచ్చినవారు (ప్రధానంగా భారతదేశం. కొందరు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ నుండి, భూటాన్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుండి కొద్దిమంది). ఆగ్నేయాసియా (ప్రధానంగా సింగపూర్, మలేషియా, మయన్మార్, ఇండోనేషియా (ముఖ్యంగా బాలి, జావా ), కెనడా, కరేబియన్ (ప్రధానంగా ట్రినిడాడ్ టొబాగో, గయానా, సూరినామ్, జమైకా ), ఓషియానియా (ప్రధానంగా ఫిజీ, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ) ఆఫ్రికా (ప్రధానంగా మారిషస్, దక్షిణాఫ్రికా, కెన్యా, టాంజానియా, ఉగాండా, నైజీరియా, రీయూనియన్, సీషెల్స్ ), యూరప్ (ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ), మధ్యప్రాచ్యం గల్ఫ్ దేశాలు, ఇతర దేశాల నుండి వచ్చిన వారు, వారి వారసులు కూడా ఉన్నారు. అదనంగా, అమెరికా లోనే హిందూ మతంలోకి మారిన వారు కూడా ఉన్నారు. వియత్నాం నుండి దాదాపు 900 మంది చామ్ జాతి ప్రజలు (ప్రపంచంలో మిగిలి ఉన్న కొద్ది మంది భారతీయేతర హిందువులలో ఒక జాతి) కూడా అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో 55% మంది హిందువులు. [4]

19వ శతాబ్దంలో అమెరికాలో హిందువుల నివాసాలు చెదురుమదురుగా ఉండేవి. 1965 ఇమ్మిగ్రేషన్, జాతీయతా చట్టం ఆమోదించబడే వరకు అమెరికాలో హిందువుల ఉనికి చాలా పరిమితంగానే ఉండేది. [5]

అమెరికాలోని మత వర్గాలన్నిటిలోనూ హిందూ-అమెరికన్ల లోనే అత్యధిక స్థాయి విద్యార్హతలు ఉన్నాయి. విద్యావంతులకు, అధిక నైపుణ్యం కలిగిన వలసదారులకూ అనుకూలంగా ఉండే బలమైన US ఇమ్మిగ్రేషన్ విధానాలే దీనికి కారణం. [6] ధ్యానం, కర్మ, ఆయుర్వేదం, పునర్జన్మ, యోగా వంటి హిందూమతం యొక్క అనేక భావనలు ప్రధాన స్రవంతి అమెరికన్ వాడుక భాషలోకి ప్రవేశించాయి. [7] ప్యూ ఫోరమ్ ఆన్ రిలిజియన్ అండ్ పబ్లిక్ లైఫ్ సర్వే 2009 ప్రకారం, 24% అమెరికన్లు పునర్జన్మను విశ్వసిస్తారు. ఇది హిందూమతం యొక్క ప్రధాన భావన. [8] [9] ఇంకా, శాకాహారం, అహింస యొక్క హిందూ విలువలు ప్రజాదరణ పొందుతున్నాయి. 2021 సెప్టెంబరులో, న్యూజెర్సీ రాష్ట్రం వరల్డ్ హిందూ కౌన్సిల్‌తో కలిసి అక్టోబరును హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది. ఓం అనేది అమెరికా అంతటా విస్తృతంగా జపించబడే మంత్రం. ముఖ్యంగా మిలీనియల్స్, యోగాను అభ్యసించేవారు, కొత్త యుగ తత్వశాస్త్రానికి సభ్యత్వం పొందిన వారిలో ఇది ఎక్కువగా ఉంది.

జనాభా వివరాలు

[మార్చు]

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ యొక్క 2004 రిలిజియస్ ఫ్రీడం రిపోర్ట్ [10] ప్రకారం, మొత్తం జనాభాలో 0.50% (దాదాపు 15 లక్షల మంది) హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. USAలోని హిందూ జనాభా ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్దది ; US జనాభాలో 5.8% ఉన్న ఆసియా అమెరికన్లలో 10% మంది హిందూ విశ్వాసాన్ని అనుసరిస్తారు. [11]

అమెరికాలో 87% మంది హిందువులు వలసదారులు, 9% మంది వలసదారుల పిల్లలు. 10% మంది హిందువులు మతం మారినవారు. [3] 1990వ దశకంలో, భూటాన్లో, ఆ దేశ జనాభాలో ఐదవ వంతు మంది హిందూ జనాభాలో ఎక్కువ భాగాన్ని బహిష్కరించింది. [12] 90,000 మందికి పైగా హిందూ- భూటాన్ శరణార్థులు అమెరికాలో పునరావాసం పొందారు. [13]

చాలా మంది ఆఫ్ఘన్ హిందువులు కూడా తమ కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు -ప్రధానంగా సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం, ఆ తరువాత తాలిబాన్ పెరుగుదల తర్వాత. వారిలో చాలా మంది తమ మాతృభూమిలో ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా అమెరికాకు వలస వచ్చారు. వారిలో చాలా వరకు అమెరికాలోని ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తారు. [14] [15]

అసోసియేషన్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్ ఆఫ్ అమెరికన్ రిలిజియస్ బాడీస్ వారు 2017 మార్చిలో ప్రచురించిన న్యూస్ లెటర్ ప్రకారం, దేశంలోని 3143 కౌంటీలలో 92 కౌంటీలలో హిందువులు అతిపెద్ద మైనారిటీ మతంగా ఉన్నారు. [16] 2021 సెప్టెంబరులో, న్యూజెర్సీ రాష్ట్రం అక్టోబర్‌ను హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది.

ప్రధానంగా భారతదేశం, నేపాల్ నుండి వలస వచ్చిన వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, అమెరికాలో గణనీయమైన సంఖ్యలో హిందూ మతంలోకి మారినవారు కూడా ఉన్నారు. ప్యూ పరిశోధన అంచనాల ప్రకారం, అమెరికాలోని హిందువులలో 9% మంది ఆసియాయేతర జాతికి చెందినవారు. వీరిలో 4% తెల్లవారు, 2% నల్లజాతీయులు, 1% లాటినోలు 2% మిశ్రమ వ్యక్తులు. [17] హిందూ మతంలోకి మారిన వారిలో హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, నటుడు రస్సెల్ బ్రాండ్ మొదలైనవారు ఉన్నారు. [18] [19]

సమకాలీన స్థితి, ప్రజా అభిప్రాయం

[మార్చు]
ఉటాలోని ఉటా కౌంటీలోని శ్రీ శ్రీ రాధా కృష్ణ దేవాలయంలో 2013 మార్చిలో జరిగిన హోలీ పండుగ .

అన్ని మతపరమైన కమ్యూనిటీలలోకెల్లా అమెరికన్ హిందువుల్లో అత్యధిక విద్యార్హతలు, అత్యధిక గృహ ఆదాయం ఉంది. అతి తక్కువ విడాకుల రేటు వీళ్ళలోనే ఉంది. [20] విద్యావంతులు, అధిక నైపుణ్యం కలిగిన వలసదారులకు మాత్రమే అనుకూలంగా ఉండే బలమైన US ఇమ్మిగ్రేషన్ విధానాలు దీనికి కారణం..

2008 ప్యూ రీసెర్చ్ ప్రకారం, తాము హిందువులుగా పెరిగామని చెప్పిన అమెరికా వయోజనులందరిలో, 80 శాతం మంది హిందూమతానికే కట్టుబడి ఉన్నారు. ఇది అమెరికాలో ఏ మతానికైనా అత్యధికం. [21]

హిందువుల పట్ల ప్రజాభిప్రాయాలు

[మార్చు]

హిందువుల్లో కూడా స్వలింగ సంపర్కానికి సాపేక్షంగా అధిక ఆమోదం ఉంది. అమెరికాలోని 71% మంది హిందువులు స్వలింగ సంపర్కాన్ని అంగీకరించాలని భావిస్తున్నారు. ఇది సాధారణ ప్రజల్లో ఉన్న 62% కంటే ఎక్కువ. [17] దాదాపు 68% మంది హిందువులు స్వలింగ వివాహాలకు మద్దతు పలికారు. అయితే సాధారణ ప్రజల్లో ఇది 53%. [17] అమెరికాలోని హిందువులు అబార్షన్‌కు కూడా అధిక మద్దతునిచ్చారు. దాదాపు 68% మంది హిందువులు అబార్షన్‌ను సమర్థించారు. దాదాపు 69% హిందువులు పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ కోసం కఠినమైన చట్టాలు, నియంత్రణలూ ఉండాలని సమర్థిస్తారు. [17]\

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, కేవలం 15% అమెరికన్లు మాత్రమే వేదాలను హిందూ మత గ్రంథంగా గుర్తించారు. యోగాకు హిందూమతంలో మూలాలు ఉన్నాయని దాదాపు సగం మంది అమెరికన్లకు తెలుసు. [22] [23] అదే సర్వేలో "ఫీలింగ్ థర్మామీటర్"లో మతపరమైన సమూహాలను ఎంత ఆప్యాయంగా చూస్తున్నారని అడిగినప్పుడు; హిందువులు యూదులు, క్యాథలిక్‌లు, ఎవాంజెలికల్ క్రిస్టియన్‌ల కంటే తక్కువగా ఉన్నారు; కానీ నాస్తికులు, ముస్లింల కంటే ఎక్కువ. 0–100 స్కేల్‌లో, హిందువుల థర్మామీటర్ రీడింగ్ 55 ఉండగా, యూదులకు 63, ముస్లింలు 49 వద్ద ఉన్నారని సర్వే పేర్కొంది [22] [23]

మతతత్వం

[మార్చు]

2014 ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం, అమెరికన్ హిందూ జనాభాలో 88% మంది దేవుణ్ణి విశ్వసిస్తారు (మొత్తం వయోజనుల్లో ఇది 89%). అయితే, కేవలం 26% మంది మాత్రమే తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైనదని విశ్వసించారు. హిందూ జనాభాలో దాదాపు 51% మంది ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తున్నట్లు నివేదించారు. [17]

హిందువులలో 88% మంది దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పటికీ ఇతరుల్లో ఇది ఎక్కువ - 99% ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్లు, 96% క్యాథలిక్‌లు, 99% యెహోవాసాక్షులు. [17]

చరిత్ర

[మార్చు]
అమెరికాలో ఆనందిబాయి జోషి

1883 జూన్‌లో 19 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్‌కు చేరుకున్న ఆనందీబాయి జోషి, అమెరికన్ గడ్డపై అడుగు పెట్టిన మొట్టమొదటి హిందూ మహిళ. ఆమె 1886 మార్చి 11 న ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి MD పట్టభద్రురాలైంది. అమెరికా నుండి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన దక్షిణాసియా మూలానికి చెందిన మొదటి మహిళ ఆమె. జోషి 1886 చివరలో, భారతదేశానికి తిరిగి వచ్చిన కొన్ని నెలలకే మరణించింది. [24]

1893లో చికాగోలోని మతాల పార్లమెంట్ వేదికపై స్వామి వివేకానంద.

1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం అమెరికాలో హిందూమతం గురించిన మొదటి ప్రధాన సంఘటనల్లో ఒకటి. అతను అమెరికాలో రెండు సంవత్సరాలు గడిపాడు. డెట్రాయిట్, బోస్టన్, న్యూయార్క్‌తో సహా అనేక నగరాల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. 1902 లో స్వామి రామతీర్థ యుఎస్‌కి వెళ్లి సుమారు రెండు సంవత్సరాలు వేదాంత తత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. [25] 1920లో బోస్టన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలిజియస్ లిబరల్స్‌లో పరమహంస యోగానంద భారతదేశ ప్రతినిధిగా ఉన్నాడు.[26]

1965కి ముందు , అమెరికాకి హిందూ వలసలు చాలా తక్కువగా చెదురుమదురుగా ఉండేవి, 1965కి ముందు యాభై వేల కంటే తక్కువ మంది భారతీయులు వలస వచ్చారు. ఈ వలసదారులలో ఎక్కువ మంది పంజాబీ సిక్కులు అయినప్పటికీ, చాలా మంది అమెరికన్లు, అలాగే కొన్ని అధికారిక ఇమ్మిగ్రేషన్ పత్రాలలో వారిని "హిందూ" అని తప్పుగా పేర్కొనడం గమనించదగ్గ విషయం. [27] 1907 సెప్టెంబరు 5 న వాషింగ్టన్‌లోని బెల్లింగ్‌హామ్‌లో జరిగిన బెల్లింగ్‌హామ్ అల్లర్లు, భారతీయ హిందువుల పట్ల అమెరికాలో ఉన్న అసహనాన్ని ప్రతిబింబించాయి. 1923 నాటి అమెరికా v. భగత్ సింగ్ థిండ్, కేసులో 1790 ఫెడరల్ చట్టం ప్రకారం థిండ్, ఇతర దక్షిణాసియన్లు "స్వేచ్ఛా శ్వేతజాతీయులు" కాదని, కేవలం శ్వేతజాతీయులు మాత్రమే సహజసిద్ధమైన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చనీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. [28] 1924 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం మధ్యప్రాచ్య వాసులు, భారతీయులు వంటి ఆసియన్ల వలసలను నిషేధించింది. ఇది హిందువులు అమెరికాకు వలస వెళ్ళకుండా నిరోధించింది. [29] ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ, 1965లో ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ సర్వీసెస్ (INS) చట్టం ఆమోదం పొందే వరకు కొంతమంది నిపుణులతో సహా కొంతమంది అమెరికాలో ఉండి పనులు చేసుకున్నారు. ఆ చట్టం అమెరికాలో పని చేయడానికి, కుటుంబాలను నెలబెట్టుకోవాలనుకునే హిందూ వలసదారులకు తలుపులు తెరిచింది. [30] ఇందులో హిందూ బోధకులు కూడా ఉన్నారు. హిందూమతం గురించి పెద్దగా తెలియని వ్యక్తులలో వారు అవగాహనను కలిగించారు. [31]

1960లలో, హిందూ గురువులు US సంస్కృతిలో హిందూమతం పట్ల స్పందనను గమనించారు. ఇది స్వామి ప్రభుపాద స్థాపించిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ వంటి అనేక హిందూ ఉద్యమాల ఏర్పాటుకు దారితీసింది. [32] అమెరికాలో హిందూ మతం వ్యాప్తిలో రామ్ దాస్, జార్జ్ హారిసన్, అలెన్ గిన్స్‌బర్గ్ వంటి వ్యక్తులు ప్రభావం చూపారు. రామ్ దాస్, రిచర్డ్ ఆల్పెర్ట్ అని పిలువబడే హార్వర్డ్ ప్రొఫెసరు. హార్వర్డ్ నుండి తొలగించబడిన తర్వాత అతను చాలా మీడియా కవరేజీ పొందాడు. అతను భారతదేశానికి వెళ్లి నీమ్ కరోలి బాబా వద్ద చదువుకుని. హిందూ గురువుగా తిరిగి వచ్చాడు. తన పేరును రామ్ దాస్ అని మార్చుకున్నాడు. రామ్ దాస్ విద్యార్థి అయిన జెఫ్రీ కాగెల్, అరవైలలో తన జీవితాన్ని హిందూమతానికి అంకితం చేశాడు. పవిత్ర మంత్రాలు, ఆధ్యాత్మిక శ్లోకాలను పఠిస్తూ అనేక CDలను తయారు చేసి, అతను చాలా విజయవంతమయ్యాడు. అతన్ని యోగా రాక్ స్టార్‌గా పరిగణిస్తారు. జార్జ్ హారిసన్ ది బీటిల్స్‌లో సభ్యుడు. దాని ప్రజాదరణ శిఖరాగ్ర దశలో ఉన్నపుడు అది ప్రపంచంలోని ఇతర బ్యాండ్‌ల కంటే ఎక్కువ మీడియా కవరేజీని పొందింది. [33] అతను స్వామి ప్రభుపాద భక్తుడు అయ్యాడు. జార్జ్ హారిసన్ సాహిత్యంలో "హరి కృష్ణ " అనే పదాలతో పాటలను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. ఆనాటి యువ తరంతో అమెరికాలో హిందూ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పాటుపడ్డాడు. అలెన్ గిన్స్‌బర్గ్ అరవైలలో హిందూమతంతో మమేకమయ్యాడు. అతను 1967లో ది హ్యూమన్ బీ- ఇన్‌లో గంటల తరబడి "ఓం " మంత్రాన్ని జపించాడు. ఇతర ప్రభావవంతమైన భారతీయ హిందువుల్లో మాతా అమృతానందమయి, చిన్మోయ్, మహర్షి మహేష్ యోగి ఉన్నారు. [34]

2000 సెప్టెంబరులో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సందర్శనను పురస్కరించుకుని జరిపిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని సముద్రాల వెంకటాచలపతి సంస్కృతంలో చేసిన ప్రార్థనతో ప్రారంభించారు. ఓహియో కాంగ్రెస్ సభ్యుడు షెరాడ్ బ్రౌన్, ఒహియోలోని పర్మాలోని శివ విష్ణు హిందూ దేవాలయం లోని పూజారిని ఆహ్వానించవలసిందిగా US కాంగ్రెస్ హౌస్ చాప్లిన్‌ని అభ్యర్థించి, చారిత్రాత్మక సమావేశానికి బీజం వేసాడు. [35] మరొక హిందూ ప్రార్థనను అమెరికా సెనేట్‌లో 2007 జూలై 12 న నెవాడాకు చెందిన హిందూ మత గురువు రాజన్ జెడ్ చదివారు. [36] "క్రిస్టియన్ దేశభక్తుల" మని చెప్పుకునే ఒక జంట, వారి కుమార్తె అతని ప్రార్థనకు అంతరాయం కలిగించారు. అప్పట్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్థుల వ్యాఖ్యలను విమర్శించనందుకు ఈ విమర్శలకు కారణమైంది. [37] 2009 అక్టోబరులో, అధ్యక్షుడు బరాక్ ఒబామా చీకటిపై వెలుగు విజయానికి సూచికగా వైట్ హౌస్ వద్ద ఒక అలంకారప్రాయమైన దీపావళి దీపాన్ని వెలిగించాడు.

హిందూ దేవాలయాలు

[మార్చు]
న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయ సముదాయం. భారతదేశం వెలుపల ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.

శాన్ ఫ్రాన్సిస్కో [38] [39] [40] లోని ఓల్డ్ టెంపుల్‌తో 1905లో ప్రారంభించి అమెరికాలో దేవాలయాలను నిర్మించడానికి వేదాంత సొసైటీ బాధ్యత వహించింది. అయితే అవి అధికారిక దేవాలయాలుగా పరిగణించబడలేదు.  అమెరికాలోని మొట్టమొదటి సాంప్రదాయ మందిరం కాలిఫోర్నియాలోని కాంకర్డ్‌లోని శివ మురుగన్ ఆలయం. దీనిని 1957లో నిర్మించారు. [41] పళనిసామి ఆలయం అని దీన్ని పిలుస్తారు. ప్రజలచే ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. పిట్స్‌బర్గ్‌లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అమెరికా లోని పురాతన ఆలయాల్లో ఒకటి. 1976 నవంబరు 17 న ఈ ఆలయ ప్రతిస్థాపన జరిగింది. [42] న్యూయార్క్ నగరంలోని ఫ్లషింగ్‌లో ఉత్తర అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీ యాజమాన్యంలో మహా వల్లభ గణపతి దేవస్థానాన్ని 1977 జూలై 4 న ప్రతిష్ఠించారు. ఇటీవల ఈ ఆలయాన్ని గణనీయంగా విస్తరించారు. [43]

నేడు అమెరికా అంతటా 450 పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. [44] వాటిలో ఎక్కువ భాగం తూర్పు తీరంలో న్యూయార్క్ ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడే 135 దేవాలయాలు ఉన్నాయి [45] తదుపరి అతిపెద్ద సంఖ్యలో, టెక్సాస్‌లో 28 దేవాలయాలున్నాయి. [46] మసాచుసెట్స్‌లో 27 దేవాలయాలు ఉన్నాయి. [47]

ఇతర ప్రముఖ దేవాలయాలలో మాలిబు హిందూ దేవాలయం, 1981లో నిర్మించబడింది. ఇది దక్షిణ కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయం సొసైటీ యాజమాన్యంలో ఉంది. ఈ ఆలయం కాలిఫోర్నియాలోని మాలిబు సమీపంలో ఉంది. ఇవి కాకుండా, స్వామినారాయణ దేవాలయాలు దేశంలోని అనేక నగరాల్లో ఉన్నాయి.

అలాస్కా లోని యాంకరేజ్‌లో ఉన్న శ్రీ వినాయక ఆలయం ప్రపంచంలోకెల్లా అత్యంత ఉత్తరాన ఉన్న హిందూ దేవాలయం. [48]

టెక్సాస్‌లోని పురాతన హిందూ దేవాలయం ఆస్టిన్‌లోని రాధా మాధవ్ ధామ్‌లోని శ్రీ రాశేశ్వరి రాధా రాణి ఆలయం. [49] జగద్గురు కృపాలూజీ మహరాజ్ స్థాపించిన ఈ ఆలయం పశ్చిమార్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయాలలో ఒకటి, [50] ఉత్తర అమెరికాలో అతిపెద్దది. [51] [52] [53]

సౌత్ ఫ్లోరిడా లోని టాంపాలో, శ్రీ విష్ణు దేవాలయాన్ని 2001 నవంబరులో ప్రతిష్ఠించారు. [54] ఫ్లోరిడా లోనే 1996 లో నిర్మించిన హిందూ దేవాలయం ఉంది.

మిచిగాన్‌లోని పాంటియాక్‌లోని పరాశక్తి ఆలయం [55] పశ్చిమాన ఉన్న "శక్తి"దేవతా పీఠం.

న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలోని అక్షరధామ్ అమెరికాలోని అతిపెద్ద రాతి హిందూ దేవాలయాలలో ఒకటి. [56]

రాజకీయ జీవితం

[మార్చు]
తులసి గబ్బార్డ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ

2011 మేలో హిందూ మిలిటరీ చాప్లిన్సీ ప్రారంభించబడింది; ఆర్మీ కెప్టెన్ ప్రతిమా ధర్మ్ US మిలిటరీ చాప్లిన్‌గా పనిచేసిన మొదటి హిందువు. [57]

తులసి గబ్బార్డ్ 2012 లో US కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి హిందువు; ఆమె హవాయి చెందిన సమోవాన్, యూరోపియన్ ల సంతతికి చెందినది. తండ్రి రోమన్ కాథలిక్, తల్లి హిందూ. [58] తర్వాత, 2016లో మరో ఇద్దరు హిందువులు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు: రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, రో ఖన్నా (రోహిత్ ఖన్నా). [59] ఇప్పుడు నలుగురు సభ్యులతో అమెరికన్ హిందువులు కాంగ్రెస్‌లో మూడవ అతిపెద్ద మత సమూహంగా ఉన్నారు. [60] మతపరమైన అనుబంధాలను తెలియజేయడానికి నిరాకరిస్తున్న చట్టసభ సభ్యులలో భారతీయ-అమెరికన్ అయిన ప్రమీలా జయపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికయింది; ఆమె తల్లి హిందువు కాబట్టి, జయపాల్ కూడా హిందువు అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సూచించింది. [61]

అమెరికన్ హిందువులను అమెరికన్ రాజకీయాలలో ముఖ్యమైన ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు. [62] బిల్ క్లింటన్ కాలం నుండి, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వరకూ అధ్యక్షులు దీన్ని చాలా ప్రోత్సహించారు. [63] [64]

అమెరికా భూభాగాల్లో హిందూమతం

[మార్చు]

గ్వామ్

[మార్చు]

గ్వామ్ జనాభాలో 0.1% మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [65]

US వర్జిన్ దీవులు

[మార్చు]

2000 జనాభా లెక్కల ప్రకారం, అమెరికా వర్జిన్ ఐలాండ్స్ (జనాభాలో 0.4%)లో 400 పైచిలుకు మంది హిందువులు ఉన్నారు. [66] 2011 జనాభా లెక్కల ప్రకారం, US వర్జిన్ దీవులలో 528 మంది హిందువులు ఉన్నారు. ఇది జనాభాలో 1.9%. ఎక్కువ మంది టోర్టోలా ద్వీపం (454) లోను ఆ తరువాత వర్జిన్ గోర్డా ద్వీపం (69) లోనూ నివసిస్తున్నారు. [67] టోర్టోలా, వర్జిన్ గోర్డాలు బ్రిటీష్ వర్జిన్ దీవులలో భాగం. ఈ గణాంకాలు వీటిని సూచిస్తాయి కాబట్టి అవి ఇక్కడ వర్తించవు. వీరిలో ఎక్కువ మంది గుజరాతీలతో పాటు సింధీ హిందువులు. [66]

ప్యూర్టో రికో

[మార్చు]

2006 నాటికి, రిలిజియస్ ఇంటెలిజెన్స్ ప్రకారం, ప్యూర్టో రికోలో 3,482 మంది హిందువులు (జనాభాలో 0.09%) ఉన్నారు. [68]

వివక్ష

[మార్చు]

ఆలయ అపవిత్రత

[మార్చు]

2019 జనవరిలో, కెంటకీలోని స్వామినారాయణ ఆలయం ధ్వంసమైంది. దేవతపై నల్లరంగు పూసి గోడలపై ‘యేసు ఒక్కడే దేవుడు ’ అని కూడా స్ప్రే చేశారు. గోడలపై క్రిస్టియన్ క్రాస్ పెయింట్ చేసారు. [69]  2015 ఫిబ్రవరిలో కెంట్, సీటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హిందూ దేవాలయాలలో విధ్వంసం సృష్టించారు. 2015 ఏప్రిల్‌లో ఉత్తర టెక్సాస్ లోని ఒక హిందూ దేవాలయం గోడలపై జాతి హత్యాకాండ సమర్థక చిత్రాలను స్ప్రే పెయింట్ చేశారు. [70] [71] పిట్స్‌బర్గ్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి 15,000 డాలర్ల విలువైన నగలు అపహరించారు. 

కాలిఫోర్నియా పాఠ్యపుస్తకంలో హిందూ చరిత్రపై నిరసన

[మార్చు]

US రాష్ట్రంలోని కాలిఫోర్నియాలో చరిత్ర పాఠ్యపుస్తకాల్లో హిందూ మతాన్ని చిత్రీకరించిన విధానంపై వివాదం 2005లో మొదలైంది. టెక్సాస్‌కు చెందిన వేదిక్ ఫౌండేషన్, అమెరికన్ హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లు కాలిఫోర్నియా కరికులమ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఆరవ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాలలో భారతీయ చరిత్ర, హిందూ మతం కవరేజీలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని వాదించారు. [72] వివాదాస్పద అంశాలలో పాఠ్యపుస్తకంలో కుల వ్యవస్థ, ఇండో-ఆర్యన్ వలస సిద్ధాంతం, భారతీయ సమాజంలో మహిళల స్థితి చిత్రణ ఉన్నాయి. [73]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Cox, Daniel; Jones, Ribert P. (9 June 2017). America's Changing Religious Identity. Public Religion Research Institute. {{cite book}}: |work= ignored (help)
  2. "America's Changing Religious Landscape". Pew Research Center. May 12, 2015. Retrieved May 15, 2015.
  3. 3.0 3.1 "Hindu population up in US, becomes fourth-largest faith". India Today. May 13, 2015. Retrieved 24 December 2019.
  4. "Eastern Cham in the United States". Joshua Project.net. Retrieved 24 December 2019.
  5. Batalova, Jeanne Batalova Mary Hanna and Jeanne (2020-10-15). "Indian Immigrants in the United States". migrationpolicy.org (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
  6. Hilburn, Matthew (July 30, 2012). "Hindu-Americans Rank Top in Education, Income". Voice of America. Archived from the original on February 20, 2013. Retrieved December 1, 2012.
  7. Rajghatta, Chidanand (August 18, 2009). "Americans turn to Hindu beliefs". The Times of India. Retrieved December 1, 2012.
  8. Ryan, Thomas (October 21, 2015). "25 percent of US Christians believe in reincarnation. What's wrong with this picture?". America. Retrieved December 1, 2012.
  9. Miller, Lisa (August 15, 2009). "We Are All Hindus Now". Newsweek. Retrieved July 11, 2018.
  10. "International Religious Freedom Report". United States Department of State. 2004.
  11. "Asian Americans: A Mosaic of Faiths". The Pew Forum on Religion & Public Life. Pew Research Center. July 19, 2012. Archived from the original on 2013-07-16. Retrieved October 13, 2012.
  12. "Bhutan: International Religious Freedom Report". United States Department of State. 2007.
  13. "90,000th Bhutanese refugee flying to US from Nepal for resettlement". The Himalayan Times. 20 September 2016. Retrieved 24 December 2019.
  14. "First Afghan Hindu and Sikh Temple in Maryland a Cultural Bridge | Voice of America - English". www.voanews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15.
  15. "2016 American Community Survey 1-Year Estimates: Afghan". data.census.gov. Archived from the original on 2020-02-14. Retrieved 2021-04-15.
  16. "Largest Non-Christian Faith Tradition by County" (PDF). Religion Census Newsletter. Association of Statisticians of American Religious Bodies. March 2017. Retrieved 24 December 2019.[permanent dead link]
  17. 17.0 17.1 17.2 17.3 17.4 17.5 "Religion in America: U.S. Religious Data, Demographics and Statistics". Pew Research Center. Retrieved 24 December 2019.
  18. "I'm a Hindu: Julia Roberts - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-12-26.
  19. Tatchell, Lucy (2010-10-23). "Katy Perry and Russell Brand are married in private Hindu ceremony". The Daily Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Retrieved 2019-12-26.
  20. Rajagopal 2005, p. 2.
  21. "Hindus - Religion in America: U.S. Religious Data, Demographics and Statistics". Pew Research Center's Religion & Public Life Project (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-26.
  22. 22.0 22.1 "Only 15% Americans identify Vedas as Hindu religious text". City Air News. July 24, 2019. Archived from the original on 24 జూలై 2019. Retrieved 24 December 2019.
  23. 23.0 23.1 Alper, Becka A. (July 23, 2019). "6 facts about what Americans know about religion". Pew Research Center. Retrieved 24 December 2019.
  24. "Historical Photos Depict Women Medical Pioneers". Public Radio International. July 12, 2013. Retrieved October 29, 2013.
  25. Arora, Raj Kumar (1978). Swami Ram Tirath, his life and works. New Delhi, India: Rajesh Publications. p. 56.
  26. Hevesi, Dennis (2010-12-03). "Sri Daya Mata, Guiding Light for U.S. Hindus, Dies at 96 (Published 2010)". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-03-07.{{cite news}}: CS1 maint: url-status (link)
  27. Chan, Sucheng (1991). Asian Americans: An Interpretive History. Boston, Mass.: Twayne. p. 75. ISBN 978-0-80578-426-8.
  28. Coulson, Doug (2015). "British Imperialism, the Indian Independence Movement, and the Racial Eligibility Provisions of the Naturalization Act: United States v. Thind Revisited". Georgetown Journal of Law & Modern Critical Race Perspectives. 7: 1–42. SSRN 2610266.
  29. Mann, Gurinder Singh; Numrich, Paul David; Williams, Raymond Brady (2001). Buddhists, Hindus and Sikhs in America: A Short History. Oxford, UK: Oxford University Press. pp. 44–45. ISBN 978-0-19512-442-2.
  30. Lee, Erika (2015-10-01). "Legacies of the 1965 Immigration Act". South Asian American Digital Archive (SAADA) (in ఇంగ్లీష్). Retrieved 2021-03-07.
  31. Bagoria, Mukesh (2009). "Tracing the Historical Migration of Indians to the United States". Proceedings of the Indian History Congress. 70: 894–904. ISSN 2249-1937. JSTOR 44147737.
  32. "Srila Prabhupada Lila". www.srilaprabhupadalila.org. Retrieved 2021-03-07.
  33. Williams, John P. (2019-09-11). "Journey to America: South Asian Diaspora Migration to the United States (1965–2015)". Indigenous, Aboriginal, Fugitive and Ethnic Groups Around the Globe (in ఇంగ్లీష్). doi:10.5772/intechopen.88118. ISBN 978-1-78985-431-2.
  34. "Proud to be 1st Hindu-American to run for president: Tulsi Gabbard". The Economic Times. Retrieved 2021-03-07.
  35. "For the first time, a Hindu priest will pray before US Congress". Rediff.com. September 14, 2000. Retrieved 24 December 2019.
  36. "California Senate opened with Hindu prayer for first time". Asian Tribune. August 29, 2007. Archived from the original on 2007-09-01. Retrieved July 24, 2008.
  37. Boorstein, Michelle (July 27, 2007). "Hindu Groups Ask '08 Hopefuls to Criticize Protest". The Washington Post. Retrieved 24 December 2019.
  38. "Week a fitting time to celebrate East Indians' success in SF". November 3, 2018.
  39. "Visit to Vedanta Society and the Old Temple of 1905 | Society for Asian Art".
  40. "Old Temple | Vedanta Society of Northern California".
  41. "Hinduism in America". The Pluralism Project. Archived from the original on March 21, 2016. Retrieved October 12, 2015.
  42. "టెంపుల్ హిస్టరీ". svtemple.org. Archived from the original on 2022-01-13. Retrieved 2022-01-20.
  43. "Ganesh Temple History". NY Ganesh Temple.org. October 28, 2015. Retrieved 24 December 2019.
  44. Iyer, Hari. "Global Hindu Temples directory ~ America". All Hindu Temples. Retrieved March 5, 2015.
  45. Iyer, Hari. "Global Hindu Temples directory ~ New York". All Hindu Temples. Retrieved March 5, 2015.
  46. Iyer, Hari. "Global Hindu Temples directory ~ Texas". All Hindu Temples. Retrieved March 5, 2015.
  47. Iyer, Hari. "Global Hindu Temples directory ~ Massachusetts". All Hindu Temples. Retrieved March 5, 2015.
  48. "Sri Ganesth Temple of Alaska Timings and Address". templesinindiainfo. April 10, 2018. Retrieved 14 February 2020.
  49. India Today International.
  50. "Vedic Foundation Inaugurated at Barsana Dham, Austin" (PDF). Hindu University of America Newsletter. 12 (2): 2. July 2003. Archived from the original (PDF) on August 18, 2011. Retrieved 24 December 2019.
  51. Ciment, James, ed. (2001). Encyclopedia of American Immigration. Armonk, NY: M. E. Sharpe. ISBN 978-0-76568-028-0.
  52. Hylton, Hilary; Rossie, Cam (2004). Insiders' Guide to Austin (4th ed.). Guilford, CT: Globe Pequot Press. ISBN 978-0-76272-997-5.
  53. Mugno, Marjie; Rafferty, R. R., eds. (1998). Texas Monthly Guidebook. Houston, Texas: Gulf Pub. Co.
  54. "South Florida Hindu Temple - Welcome to the Temple Experience !!!". www.sfht.org. Retrieved 2021-03-07.
  55. "Shakthi Worship". Parashakthi Temple. Archived from the original on 24 డిసెంబరు 2019. Retrieved 24 December 2019.
  56. Kuruvilla, Carol (August 26, 2014). "PHOTOS: Stunning Hindu temple in New Jersey is one of the largest in America". New York Daily News. Archived from the original on November 9, 2014.
  57. Chaudhary, Ravi (June 6, 2011). "Launching The First Hindu Military Chaplaincy". Huffington Post. Retrieved 24 December 2019.
  58. Basu, Tanya (March 5, 2015). "Hindus Are Thriving in America, but There's Only One in Congress". The Atlantic. Retrieved 24 December 2019.
  59. George, Varghese K. (January 5, 2017). "More Hindus and Buddhists in U.S. Congress: Pew study". The Hindu. Retrieved 24 December 2019.
  60. Foundation, Hindu American. "Hindu American Foundation Announces Launch Of "I Am Hindu American" Campaign". www.prnewswire.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-18.
  61. "Hindus and Jews gain ground in new US Congress". The Times of India. 5 January 2017. Retrieved 24 December 2019.
  62. Salman, Safiya Ghori-Ahmad, Fatima. "Why Indian Americans Matter in U.S. Politics". Foreign Policy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-07.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  63. Oct 21, PTI /; 2020; Ist, 12:57. "American Hindus deeply divided over Trump, Biden - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  64. "Trump Is Peeling Some Indian-Americans Away From the Democrats". BloombergQuint (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15.
  65. Crabtree, Vexen. "Guam (Territory of Guam)". The Human Truth Foundation. Retrieved 24 December 2019.
  66. 66.0 66.1 "Faith Matters: Hinduism in the U.S.V.I." The St. Croix Source. July 11, 2011. Retrieved 24 December 2019.
  67. "Demographics census in VGB" (PDF). data census.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  68. Tharoor, Kanishk. "Small places, new countries". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-03-07.
  69. "Hindu temple vandalized with hate speech in US, hateful words written on walls". Times Now News. January 31, 2019. Retrieved 24 December 2019.
  70. "Hindu temple vandalised in U.S." The Hindu. January 31, 2019. Retrieved 24 December 2019.
  71. Chatterjee, Pallabi (31 January 2019). "US: Hindu temple vandalized in Kentucky, deity sprayed black paint". Yahoo! News India. Retrieved 24 December 2019.
  72. "Textbook Reform Initiative: Problem statement". Vedic Foundation. Retrieved September 16, 2014.
  73. Vashisht, Kanupriya (January 11, 2006). "The Hindutva deluge in California". Hindustan Times. Archived from the original on January 13, 2006.