Jump to content

అమీన్‌గావ్

అక్షాంశ రేఖాంశాలు: 26°07′N 91°24′E / 26.11°N 91.40°E / 26.11; 91.40
వికీపీడియా నుండి
అమీన్‌గావ్
పట్టణం
అమీన్‌గావ్ is located in Assam
అమీన్‌గావ్
అమీన్‌గావ్
భారతదేశంలోని అస్సాంలోని ప్రదేశం ఉనికి
అమీన్‌గావ్ is located in India
అమీన్‌గావ్
అమీన్‌గావ్
అమీన్‌గావ్ (India)
Coordinates: 26°07′N 91°24′E / 26.11°N 91.40°E / 26.11; 91.40
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
భాష
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
781031
Vehicle registrationఏఎస్ 02

అమీన్‌గావ్, అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఉత్తర గువహాటిలో ఉంది. గువహాటి మెట్రోపాలిటన్ నగర విస్తరణ వల్ల అమింగావ్ ప్రాంతం అనేక పెద్ద ప్రాజెక్టులకు నిలయంగా మారింది.

భౌగోళికం

[మార్చు]

అమీన్‌గావ్ పట్టణం 26°11′0″N 91°40′0″E / 26.18333°N 91.66667°E / 26.18333; 91.66667 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 31 మీటర్ల (102 అడుగుల) ఎత్తులో ఉంది.[1]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, అమీన్‌గావ్ పట్టణ జనాభా 8,855 మంది ఉండగా, ఇందులో 4,561 మంది పురుషులు, 4,294 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 995 ఉండగా, ఇది మొత్తం జనాభాలో 11.24% గా ఉంది. పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి 941 ఉండగా, రాష్ట్ర సగటు 958 కంటే తక్కువగా ఉంది. బాలబాలికల నిష్పత్తి 839 ఉండగా, అస్సాం రాష్ట్ర సగటు 962 తో పోలిస్తే తక్కువగా ఉంది. పట్టణ అక్షరాస్యత 80.33% కాగా, రాష్ట్ర సగటు 72.19% కంటే కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 86.27% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 74.11%గా ఉంది.

అమీన్‌గావ్ పట్టణంలో మొత్తం 2,037 గృహాలకు ఉన్నాయి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నగర పరిపాలన సాగుతోంది. ఇది త్రాగునీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ స్థానిక సంస్థలకు అధికారం ఉంది.[2]

మతాలు

[మార్చు]

అమీన్‌గావ్ పట్టణ జనాభాలో 95.83% హిందువులు, 3.83% ముస్లింలు, 0.20% క్రైస్తవులు, 0.07% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.06% ఇతరులు ఉన్నారు.[2]

రవాణా

[మార్చు]

అమీన్‌గావ్ పట్టణం మీదుగా 31వ జాతీయ రహదారి వెళుతుంది. అమింగావ్ పట్టణానికి గువహాటి రైల్వే స్టేషను, కమాఖ్యా జంక్షన్ రైల్వే స్టేషను సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు. దీనికి సమీప విమానాశ్రయం గువహాటిలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. http://www.fallingrain.com/world/IN/3/Amingaon.html Map and weather of Amingaon
  2. 2.0 2.1 "Amin Gaon Census Town City Population Census 2011-2020 | Assam". www.census2011.co.in. Retrieved 2020-12-23.

ఇతర లంకెలు

[మార్చు]