Jump to content

అమరేశం రాజేశ్వర శర్మ

వికీపీడియా నుండి
అమరేశం రాజేశ్వర శర్మ
జననం5 సెప్టెంబరు 1930
విద్యతెలుగులో ఎం.ఏ.
తెలుగులో డాక్టరేట్ డిగ్రీ
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తితెలుగు ఉపన్యాసకులు
క్రియాశీల సంవత్సరాలు1958 నుండి ప్రస్తుతం
ఉద్యోగంఉస్మానియా విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, విమర్శకుడు, శాస్త్రవేత్త.
తల్లిదండ్రులు
  • రాజలింగ సభాపతి (తండ్రి)
  • సరస్వతి (తల్లి)

అమరేశం రాజేశ్వర శర్మ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా, తెలుగు అధిపతిగా సేవలందించిన సంస్కృతాంధ్ర పండితులు, రచయిత, కవి, పరిశోధకుడు.[1]

జీవిత సత్యాలు

[మార్చు]

రాజేశ్వరశర్మ సెప్టెంబర్‌ 5, 1930న కామారెడ్డి సమీపంలోని చిన్న మల్లారెడ్డిలో జన్మించారు.[2] వీరి తల్లిదండ్రులు శ్రీమతి సరస్వతి మరియు రాజలింగ సభాపతి. వీరు కామారెడ్ది, సీతారాంబాగ్‌ ఉభయ వేదాంతవర్ధని కళాశాల, విజయనగర మహారాజ సంస్కృత కళాశాల, కొవ్వూరు ఆంధ్ర గీర్వాణపీఠాల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పిదప ఉపాధ్యాయులుగా, వివేకవర్ధని కళాశాల ఉపన్యాసకులుగా, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌గా, అటు తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, తెలుగుశాఖ అధ్యక్షులుగా (1988-1989) సేవలందించారు. సంస్కృతాంధ్ర పండితులు, పరిశోధకులు అయిన ఆచార్య అమరేశం 'నన్నెచోడుని కవిత్వము' పేర కుమార సంభవంపై సాధికారిక పరిశోధనా గ్రంథం వెలువరించారు. తరువాత 'వేదం వేంకట రాయశాస్త్రి రూపక సమాలోచనం', 'అహోబిల పండితీయాంధ్ర వివరణము', 'వైకృత చంద్రికా వివరణము', 'ఆంధ్ర వాకరణ వికాసము' మొదలగునవి వీరి ప్రామాణిక విమర్శా గ్రంథాలు. అమరేశం రాసిన గేయ ప్రబంధం 'సాయి సచ్చరిత్ర ముక్తావళి'. ఇవేకాక వివిధ సంచికలు, సంకలనాలకు సంపాదకత్వం వహించారు. వాటిలో 'పోతన భాగవత పంచ శతి నీరాజనము', 'పోతన పంచశతి స్మారిక' వంటివి ప్రముఖంగా పేర్కోదగినవి. 2014లో ఆచార్య అమరేశం తన ఆత్మకథను 'ఆత్మనివేదనం' పేరుతో రచించారు.

ఆచార్య అమరేశం పలు సంస్థలను స్థాపించడమేకాక వాటిని నిమద్ధతతో నడిపించారు. వాటిలో కామారెడ్డిలో స్థాపించి నడిపిన ప్రాచ్య విద్యా పరిషత్తు ఒకటి. ఈ సంస్థ ద్వారానే వీరి అన్ని రచనలు ప్రచురించబడ్డాయి. చరిత్ర రచన చేయడం కష్టమైన పని; అందులోనూ చరిత్రను నాటికలుగా, పిల్లలకు అర్థం అయ్యేట్టు చెప్పడం మరీ కష్టం. ఈ కష్టమైన పనిని అత్యంత సులభంగా చేసి చూపించారు తన రేడియో నాటికల సంపుటి 'చరిత్ర పుటలు'లో. ఇది నాలుగు నాటికల సంపుటి. ఇవన్నీ ఆకాశవాణి ద్వారా పిల్లల కోసం ప్రసారమయ్యాయి. ఆకాశవాణి నిజామాబాద్‌ వారి కోరకపై స్థానిక చరిత్రను నాటికలుగా రాసేందుకు పూనుకున్న ఆచార్య అమరేశం బోదన చరిత్రను 'పౌదన-|', 'పౌదన-||' పేరుతో రెండు నాటికలుగా కూర్చారు. మూడవ నాటిక నిజామాబాదుకు సంబంధించిన అనేక శాసనాలు, చరిత్రకు సంబంధించిన నాటిక 'ఇందూరు'. నాలుగవది కాకతీయులకు సంబంధించిన 'కౌలాస దుర్గము' నాటిక. పండిత పరశోధకులైన ఆచార్య అమరేశం ముద్ర ఆయన నాటికల్లోనూ కనిపిస్తుంది. ఇవి పిల్లల కోసం రాసినప్పటికీ ఎంత సులభంగా కనిపిస్తాయో, అంతే ప్రౌఢంగా ఉండడం వీటి లోని విశేషం. నిజామాబాదుకు పూర్వం అశ్మక దేశం అనిపేరు. ఈ ప్రాంతానికి సంబంధించిన గొప్ప చరిత్రను ఇక్కడి పిల్లలకు వారసత్వ సంపదగా అందించే దిశగా ఆధునిక తెలంగాణలో జరిగిన గొప్ప ప్రయత్నాల్లో వీరి నాటికల సంపుటి ఒకటి. ఇందులో ఆయన క్రీస్తు పూర్వం నుండి బహుమనీ సుల్తానుల పాలన వరకు పిల్లల కోసం చక్కగా, తక్కువ నిడివిలో కొండ అద్దమందు అన్నట్లు వివరిస్తారు.

వీరి రచనా పాటవాన్ని గుర్తించిన ప్రముఖులు ప్రసిద్ధిచెందిన 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము మొదలైన వాటిలో వీరిచేత వ్యాసాలు రచియించారు.

రచనలు

[మార్చు]
  • ఆంధ్ర లక్షణ దీపిక [3]
  • నన్నెచోడుని కవిత్వము[4] (1958)
  • ఆత్మనివేదనం (ఆత్మకథ) (2014)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. https://www.osmania.ac.in/telugu/heads.php
  2. బాలల చరిత్రకారులు 'ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ' (25, సెప్టెంబరు 2022). "నవతెలంగాణ". నవతెలంగాణ. Retrieved 4 July 2024. {{cite news}}: Check date values in: |date= (help)
  3. https://acharyaamaresamrajeswarasarma.blogspot.com/2016/02/blog-post.html
  4. https://archive.org/details/in.ernet.dli.2015.392012/page/n7/mode/2up