అభిషేక్ బచ్చన్
అభిషేక్ బచ్చన్ (జననం 1976 ఫిబ్రవరి 5) ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ ల కుమారుడు. అభిషేక్ రెఫ్యూజీ(2000) సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు సాధించలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తన దైన ముద్ర వేశాడు.
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005), ధూమ్2 (2006), గురు (2007), దోస్తానా (2008), బోల్ బచ్చన్ (2012), హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3 (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించాడు. యువ (2004), సర్కార్ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నాడు. ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నాడు. 2007లో నటి ఐశ్వర్యా రాయ్ ని వివాహం చేసుకున్నాడు. 2011 నవంబరు 16న వారికి కుమార్తె ఆరాధ్య జన్మించింది.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]1976 ఫిబ్రవరి 5న ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ లకు ఆయన జన్మించాడు. ఆయనకు సోదరి శ్వేతా బచ్చన్ నందా ఉంది. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ రచయిత. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ, హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కాయస్థ వంశానికి చెందినవాడు.[1] తల్లి బెంగాలీ వనిత కాగా, [2] ఆయన నానమ్మ పంజాబీ.[3]
టైమ్ పత్రిక అభిషేక్, ఐశ్వర్యలను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.[4][5] అభిషేక్ చిన్నతనంలో తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే డిస్లెక్సియావ్యాధితో బాధిపడేవారట. [6] ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్ లోనూ, న్యూఢిల్లీలోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ ప్రాథమిక మాధ్యమిక విద్యలభ్యసించాడు. స్విట్జర్లాండ్ లోని ఐగ్లోన్ కళాశాలలోనూ, బోస్టన్ విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నాడు.
కెరీర్
[మార్చు]మొదటి సినిమా, మొదటి సక్సెస్ కై పోరాటం(2000–2003)
[మార్చు]2000లో జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాతోనే కరీనా కపూర్ కూడా బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేక పోయినా అభిషేక్, కరీనాల నటనకు మాత్రం ప్రేక్షకుల నుండీ, విమర్శకుల నుండీ ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని ఆయన నటన మెచ్చుకుంటూ చాలా మంది విమర్శకులు అభిషేక్ ఆయన వంశ ప్రతిష్ఠ నిలబెడతారని అన్నారు.[7]
రెఫ్యూజీ సినిమా తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ 2003లో సూరజ్ ఆర్. బర్జత్యా తీసిన మై ప్రేమ్ దీవానీ హూ సినిమాలోని నటనకు మాత్రం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు నామినేషన్ అందుకున్నారు అభిషేక్. ఆ తరువాత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు ఆయన.
విజయాలు (2004–2008)
[మార్చు]2004లో ఆయన పోలీసు పాత్రలో నటించిన ధూమ్ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. కానీ అదే సంవత్సరం ఆయన నటించిన ఫిర్ మిలేంగే, నాచ్ సినిమాలు మాత్రం సరిగా ఆడలేదు.
2005లో నటి రాణీ ముఖర్జీతో కలసి ఆయన నటించిన బంటీ ఔర్ బబ్లీ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సంవత్సరంలోనే రెండో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఫిలింఫేరు ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకున్నాడు. ఈ సినిమాలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలసి నటించాడు.
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "SP looks up to Big B with an eye on Kayastha votes" Archived 2012-11-06 at the Wayback Machine.
- ↑ "Jaya Bhaduri Bachchan" Archived 2011-09-30 at the Wayback Machine.
- ↑ India, Frontier (13 January 2011).
- ↑ "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages" Archived 2015-11-10 at the Wayback Machine.
- ↑ "India" Archived 2013-08-28 at the Wayback Machine.
- ↑ "Abhishek Bachchan in Taare Zameen Par".
- ↑ Adarsh, Taran (15 December 2000).