Jump to content

అభిరుచి

వికీపీడియా నుండి
అభిరుచితో సముద్రపు శంకాలను సేకరించి పేర్చిన దృశ్యం

అభిరుచి అనేది ఆనందం కోసం చేసే ఒక సాధారణ చర్య. సాధారణంగా ఒకరి విశ్రాంతి సమయంలో, వృత్తిపరంగా. జీతం కోసం కాకుండా తన ఆనందం కోసం చేసే చర్య. అభిరుచులలో వస్తువులను సేకరించడం, సృజనాత్మక, కళాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం , క్రీడలు ఆడటం లేదా ఇతర వినోదాలను అనుసరించడం వంటివి కొన్ని ఉదాహరణలు. అభిరుచులలో పాల్గొనడం ఆ రంగంలో గణనీయమైన నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించడాన్ని ప్రోత్సహిస్తుంది.

అభిరుచులు సమాజంలో పోకడలను అనుసరిస్తాయి. ఉదాహరణకు పంతొమ్మిదవ, ఇరవయ్యవ శతాబ్దాలలో స్టాంప్ సేకరణ ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఆ కాలంలో పోస్టల్ వ్యవస్థలు కమ్యూనికేషన్ యొక్క ప్రధాన సాధనంగా ఉన్నాయి. అయితే సాంకేతిక పురోగతిని అనుసరించి ఈ రోజుల్లో వీడియో గేమ్స్ మరింత ప్రాచుర్యం పొందాయి. పంతొమ్మిదవ శతాబ్దం యొక్క అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి, సాంకేతికత కార్మికులకు తమ అభిరుచిలో పాల్గొనడానికి విశ్రాంతి సమయాన్ని అందించింది. ఈ కారణంగా, అభిరుచుల కోసం పెట్టుబడులు పెట్టే వ్యక్తుల ప్రయత్నాలు కాలంతో పాటు పెరిగాయి.

మనిషి జీవితం అంతా యాంత్రికం అయిపోయింది. ఎవరికి వారు తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ పనుల తర్వాత దొరికే ఖాళీ సమయాల్లో మనమంతా మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం. ఈ ఖాళీ సమయంలో చేసే పనినే అభిరుచి అని అంటారు.

ఉదాహరణలు: పాటలు వినడం, సినిమాలు చూడటం, బొమ్మలు గీయటం, ఇంటర్నెట్ చూడటం, యోగా చేయడం, నీటిలో ఈదటం, నడవటం వంటివి.

ఇవి అందరికీ మామూలుగా ఉండే అభిరుచులుగా చూడచ్చు. ఇంకా కొంతమందికి కొన్ని వినూత్నమైన అభిరుచులు ఉంటాయి. ఉదాహరణలు: తపాలా బిళ్ళల సేకరణ, వివిధ దేశాల నాణేల సేకరణ, ఎత్తైన కొండలు ఎక్కడం వంటివి.

ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని అభిరుచులు ఉండటం చాలా అవసరం. దీనివల్ల మన రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొదవచ్చు. అలా సరదాగా గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా అలసిపోకుండా ఉండవచ్చు.[1]

మూలాలు

[మార్చు]
  1. Stebbins, Robert (2015). Serious Leisure: A Perspective for Our Time. New Brunswick: Transaction Publishers.
"https://te.wikipedia.org/w/index.php?title=అభిరుచి&oldid=3541355" నుండి వెలికితీశారు