అబ్దుల్ రెహమాన్ (తమిళనాడు రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్ రెహమాన్ (జననం 28 మే 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వెల్లూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం & విద్యాభ్యాసం

[మార్చు]

అబ్దుల్ రెహమాన్ 28 మే 1959న తమిళనాడులోని తిరువారూర్‌లోని ముత్తుపేట్‌లో జన్మించాడు. ఆయన అబ్దుల్ రెహమాన్ చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ నుండి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి, తిరుచురాపల్లిలోని జమాల్ మొహమ్మద్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి కు స్థానం
01 2001 2009 సభ్యుడు, ఉన్నత స్థాయి రాజకీయ వ్యవహారాల కమిటీ, (IUML), తమిళనాడు
02 2009 2014 15వ లోక్‌సభ సభ్యుడు
03 2009 2014 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
04 2009 2014 లైబ్రరీ కమిటీ సభ్యుడు
05 2012 2014 తమిళనాడు వక్ఫ్ బోర్డు సభ్యుడు
06 2015 వర్తమానం ప్రిన్సిపల్ వైస్ ప్రెసిడెంట్, IUML-తమిళనాడు
07 2021 వర్తమానం చైర్మన్, తమిళనాడు వక్ఫ్ బోర్డు

మూలాలు

[మార్చు]
  1. "Candidate introduced to DMK alliance workers". The Hindu. 12 April 2009. Archived from the original on 16 April 2009. Retrieved 14 October 2011.