అపర్ణ బి. మరార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపర్ణ బి. మరార్
కేరళ సంగీత నాటక అకాడమీలో ప్రసంగిస్తున్న మరార్
జననం
అపర్ణ బలరామ్

గురువాయూర్, కేరళ, భారతదేశం
వృత్తినర్తకి
Dancesమోహినియాట్టం, కూచిపూడి, భరతనాట్యం

అపర్ణ బి. మరార్ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, ఆర్గనైజర్, ఆర్ట్ ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్, గాయని.[1] ఈమె పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసింది. ఈమె కేరళ సంగీత నాటక అకాడమీ నుండి యువ ప్రతిభా అవార్డు, కాలికట్ విశ్వవిద్యాలయం నుండి కళాతిలకం అవార్డు అంతేకాకుండా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ స్కాలర్‌షిప్‌తో సహా అనేక గౌరవాలను అందుకుంది.

ఈమె ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఎంపానెల్డ్ ఆర్టిస్ట్, అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్ సభ్యురాలు అలాగే కళాభారతి ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ డైరెక్టర్. [2] ఈమె అనేక వర్క్‌షాప్‌లు, సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించింది.[3] [4] మరార్ సామాన్య ప్రజలు, విద్యార్థుల కోసం కళాభిమానం కార్యక్రమాలలో పాల్గొంటుంది.[5] [6]

వృత్తి జీవితం

[మార్చు]

ఈమె మోహినియాట్టం నృత్యం కళామండలం క్షేమావతి [7] దగ్గర నేర్చుకుంది. అలాగే కర్ణాటక సంగీతంలో ఇసైమణి ఆర్. వైద్యనాథ భాగవతార్ వద్ద శిక్షణ పొందింది.[8] కళాభారతి ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ బ్యానర్ క్రింద, మరార్ భారతీయ శాస్త్రీయ కళలలో యువతను ప్రోత్సహించడానికి ఉత్సవాలను నిర్వహిస్తుంది. [9] [10] [11] [12] [13] [14]

అవార్డులు, సన్మానాలు

[మార్చు]
  • 2010 సంవత్సరంలో మోహినియాట్టంలో కేరళ సంగీత నాటక అకాడమీ నుండి యువ ప్రతిభా అవార్డు. [15]
  • 2009 - 2010 సంవత్సరంలో కాలికట్ విశ్వవిద్యాలయంచే కళాతిలకం పురస్కారం. [16]
  • కాలికట్ యూనివర్సిటీ ఇంటర్‌జోన్ ఆర్ట్స్ ఫెస్టివల్ 2009 - 2010లో మోహినియాట్టం, భరతనాట్యంలో మొదటి బహుమతి పొందింది.
  • మోహినియట్టం- 2009లో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా యువ కళాకారులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను అందుకుంది. [17]
  • శాస్త్రీయ నృత్యంలో తిరుపతిలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవం 2010 సంవత్సరంలో విజేతగా నిలిచింది. [18]
  • ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ [19] ఎంప్యానెల్డ్ ఆర్టిస్ట్.
  • దూరదర్శన్, భారతదేశ గ్రేడెడ్ ఆర్టిస్ట్. [17]
  • అమెరికన్ డ్యాన్స్ థెరపీ అసోసియేషన్- 2014 సంవత్సరంలో అసోసియేట్ సభ్యురాలు.
  • 2010 సంవత్సరంలో కాలికట్ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ సభ్యురాలు.
  • ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ సభ్యురాలు - యునెస్కో, 2011

మూలాలు

[మార్చు]
  1. "Aparna Marar singing carnatic music video – Big News Live – Kerala Malayalam News, Cinema News, Tech News". Bignewslive.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  2. "Kalbharathi Cultural Heritage India". Kalabharathi.in. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  3. "When Kuchipudi, Kathak mesmerise audiences". ManoramaOnline. Retrieved 19 November 2014.
  4. "Manorama Online – Kalabharathi Foundation celebrates World Dance Day". Manoramaonline.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  5. G. S. Paul. "Healing through dance". The Hindu. Retrieved 19 November 2014.
  6. "Aparna: Exploring prospects of Dance Therapy". Bignewslive.in. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  7. "Profile – Kalamandalam Kshemavathy – Padma Jayaraj". Narthaki.com. Retrieved 19 November 2014.
  8. "Aparna Marar singing carnatic music video – Big News Live – Kerala Malayalam News, Cinema News, Tech News". Bignewslive.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  9. "National Dance Music Festival commenced". Bignewslive.in. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  10. "When Kuchipudi, Kathak mesmerise audiences". ManoramaOnline. Retrieved 19 November 2014.
  11. "Manorama Online – Kalabharathi Foundation celebrates World Dance Day". Manoramaonline.com. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  12. "Kalabharathi National Young Dance Festival 2013 – Kalabharathi Dance Festival Timings Schedule Venue – Kalabharathi Dance Festival Kerala". Justkerala.in. Retrieved 19 November 2014.
  13. "Kalabharathi Young Dance & Music Fest 2014". Realmatch Online. Archived from the original on 29 November 2014. Retrieved 19 November 2014.
  14. Sidhardhan, Sanjith (1 July 2013). "Does Kerala have a new cultural capital?". Archived from the original on 18 November 2014. Retrieved 18 November 2014.
  15. "Yuva Pratibha awards announced". The Hindu. Retrieved 19 November 2014.
  16. "Sree Krishna College bags overall title". The New Indian Express. Archived from the original on 22 డిసెంబరు 2014. Retrieved 19 November 2014.
  17. 17.0 17.1 "Aparna B Marar Classical Dancer Profile". Thiraseela.com. Retrieved 19 November 2014.
  18. "Thrissur girl wins national prize in classical dance". The Hindu. Retrieved 19 November 2014.
  19. "Indian Council for Cultural Relations : Empanelment of Artistes : Revised Reference List (2012)" (PDF). Iccrindia.net. Archived from the original (PDF) on 29 November 2014. Retrieved 19 November 2014.