Jump to content

అన్నా డాడ్

వికీపీడియా నుండి
అన్నా డాడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అన్నా మేరీ డాడ్
పుట్టిన తేదీ (1980-10-24) 1980 అక్టోబరు 24 (వయసు 44)
ఫాక్స్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 86)2002 ఫిబ్రవరి 20 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2006 అక్టోబరు 28 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2008/09వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ మటి20
మ్యాచ్‌లు 31 136 5
చేసిన పరుగులు 155 886 17
బ్యాటింగు సగటు 17.22 14.06
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 20* 46 8*
వేసిన బంతులు 1,243 5,975 114
వికెట్లు 28 133 6
బౌలింగు సగటు 26.96 23.75 16.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/13 5/7 2/13
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 42/– 4/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 17

అన్నా మేరీ డాడ్ (జననం 1980, అక్టోబరు 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది. 2002 - 2006 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 31 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[1]

జననం

[మార్చు]

డాడ్ 1980, అక్టోబరు 24న న్యూజీలాండ్‌లోని మనావటు-వాంగనుయ్ ప్రాంతంలోని ఫాక్స్టన్‌లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

2001 నవంబరు, డిసెంబరులో భారత పర్యటన కోసం న్యూజీలాండ్ జట్టులో తొలిసారిగా ఎంపికైంది.[3] అయితే ఆ పర్యటన రద్దు చేయబడింది.[4] 2002 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై తన వన్డే అరంగేట్రం చేసింది.[5] సంవత్సరం తర్వాత న్యూజీలాండ్ యూరోప్‌లో పర్యటించినప్పుడు, నెదర్లాండ్స్‌పై ఐదు ఓవర్లలో 3/13తో ముగించి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించింది.[6] దక్షిణాఫ్రికాలో జరిగిన 2005 ప్రపంచ కప్‌లో, డాడ్ తన జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటీలో ఆడి, శ్రీలంకపై 2/15తో అత్యుత్తమంగా మూడు వికెట్లు తీసింది.[7] 2006 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 31 వన్డేల్లో 28 వికెట్లు తీసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Anna Dodd". CricketArchive. Retrieved 17 November 2021.
  2. New Zealand / Players / Anna Dodd, ESPNcricinfo. Retrieved 23 August 2016.
  3. Lynn McConnell, "Four new caps for world champions' tour to India", ESPNcricinfo, 2 October 2001. Retrieved 23 August 2016.
  4. Lynn McConnell, "Corbin and Penn take Wellington's top awards", ESPNcricinfo, 16 April 2002. Retrieved 23 August 2016.
  5. 5.0 5.1 Women's ODI matches played by Anna Dodd, CricketArchive. Retrieved 23 August 2016.
  6. నెదర్లాండ్స్ Women v New Zealand Women, New Zealand Women in Ireland and నెదర్లాండ్స్ 2002 (2nd ODI), CricketArchive. Retrieved 23 August 2016.
  7. Women's World Cup, 2004/05 - New Zealand Women / Records / Batting and bowling averages, ESPNcricinfo. Retrieved 23 August 2016.

బాహ్య లింకులు

[మార్చు]