Jump to content

అన్నంరెడ్డి అదీప్ రాజ్

వికీపీడియా నుండి
అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు బండారు సత్యనారాయణ మూర్తి
నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 21 ఫిబ్రవరి 1983
రామాపురం గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు అన్నంరెడ్డి సత్యనారాయణ
జీవిత భాగస్వామి శిరీష
సంతానం సత్యధన్విరాజ్‌
పూర్వ విద్యార్థి ఎంబీఏ
మతం హిందూ మతము

అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుపున పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ 21 ఫిబ్రవరి 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, రామాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంబీఏ వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాంపురం పంచాయతీ సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన విశాఖపట్నం జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2015లో పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధిగా 20 అక్టోబర్ 2019న నియమితుడయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (20 October 2019). "వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధులుగా విశాఖ జిల్లా నుంచి ముగ్గురు". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.