Jump to content

అనుయా భగవత్

వికీపీడియా నుండి
అనూయా వై భగవత్
జననం
అనూయా వై భగవత్

(1989-09-06) 1989 సెప్టెంబరు 6 (వయసు 35)
ఇతర పేర్లుభగవతి
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–2018

అనుయా వై భగవత్ (జననం 1989 సెప్టెంబరు 6) తమిళ చిత్రాలలో నటించిన భారతీయ నటి. ఆమె శివ మనసుల శక్తి (2009)లో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[1]

కెరీర్

[మార్చు]

క్రాంతి కనడే దర్శకత్వం వహించిన హిందీ బాలల చిత్రం మహేక్‌ (Mahek)లో అనుయా వై భగవత్ రంగ ప్రవేశం చేసింది.[2][3] ఈ చిత్రం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది, అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది, వరల్డ్‌ఫెస్ట్-హూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంతో సహా వివిధ విభాగాల్లో నామినేషన్లు పొందింది.[4] ఆ తరువాత, ఆమె శివ మనసుల శక్తి (2009), ఇది రాజేష్ దర్శకత్వం వహించిన ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం, జీవాతో పాటు ఆమె టైటిల్ పాత్రలో నటించింది. చిత్రం విడుదలకు ముందు, ఆమె ముంబైలో బస చేస్తున్న ఒక హోటల్‌లో జరిగిన ఉగ్రదాడి నుండి తృటిలో తప్పించుకుంది.[5]

ఆమె యురేక దర్శకత్వం వహించిన మధురై సంభవం (2009) అనే చిత్రంలో నటించింది, ఇది తక్కువ బడ్జెట్‌లో మదురై నేపథ్యంలో నిర్మించబడింది.[6] సుందర్ సి సరసన నగరం చిత్రంలో ఒక పాత్రను, విజయ్ ఆంటోని నాన్ (2012)లో చిన్న పాత్రను, నంజుపురం (2011)లో ప్రచార పాటను ఆమె చేసింది.[7] ఎస్. శంకర్ నన్బన్‌లో అతిధి పాత్రలో కనిపించిన తర్వాత, భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేయనని చెప్పింది.[8] ఇది తెలుగులో స్నేహితుడు అనే పేరుతో అనువాద చిత్రంగా విడుదల చేసారు.[9]

ఆమె తర్వాత కొద్దికాలం పాటు బెంగాలీ చిత్రాలలో పనిచేసింది. అక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో గోరా అనే చిత్రంతో ఆమె అరంగేట్రం చేసింది.[10] ఆమె తర్వాత దూరదర్శన్ టీవి సిరీస్, ఏక్ థా రస్టీ (2014)లో మహారాణిగా నటించింది.[11]

2017లో, ఆమె తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్నది, కానీ ఆమె తొలగించబడిన మొదటి కంటెస్టెంట్ అయ్యింది. తాను తమిళం అనర్గళంగా మాట్లాడలేకపోవడం దీనికి ప్రధాన కారణం అని ఆమె తర్వాత పేర్కొంది.[12][13] బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె షో నిర్వహకుడు భారతీయ ప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ తో కాసేపు ఆసక్తిగా మాట్లాడింది. ఆమె హౌస్‌మేట్స్‌పై ఆమెకున్న అవగాహన ఆధారంగా వారికి బిరుదులను అంకితం చేసింది. అయితే, వీటితో చాలా మంది ప్రేక్షకులు ఆమెతో ఏకీభవించినట్లు అనిపించింది.[14]

సినిమా అవకాశాలున్నా ఆమె నటనకు స్వస్తి చెప్పింది. అయితే, ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను అందిస్తూ ఉనికికి చాటుకుంటుంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2007 మహేక్ మహేక్ క్లాస్ టీచర్ హిందీ
2009 శివ మనసుల శక్తి శక్తి తమిళం ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డు - నామినేట్ చేయబడింది
2009 మదురై సంభవం కరోలిన్ థామస్ తమిళం
2010 నగరం భారతి తమిళం
2011 నంజుపురం తమిళం ప్రమోషనల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్
2012 నాన్బన్ శ్వేత సంతానం తమిళం తెలుగు అనువాదం స్నేహితుడు
2012 నాన్ ప్రియా తమిళం
2014 గోరా లోలిత బెంగాలీ
2014 సి.డి. కాండ్ రిపోర్టర్ మాన్సీ రానా హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక / కార్యక్రమం పాత్ర ఛానల్ నోట్స్
2009-2010 కస్తూరి కుండల్ బేసే మైత్రేయి దూరదర్శన్ టెలివిజన్ సిరీస్
2014-2015 ఏక్ థా రస్టీ సీజన్ 3 మహారాణి దూరదర్శన్ టెలివిజన్ సిరీస్
2015-2016 సియా కే రామ్ మృత్యుదేవి స్టార్‌ప్లస్ టెలివిజన్ సిరీస్
2017 బిగ్ బాస్ తమిళ సీజన్ 1 పోటీదారు స్టార్ విజయ్ 7వ రోజు ఎలిమినేట్ అయింది
2018 సావధాన్ ఇండియా భార్య స్టార్ భారత్ టెలివిజన్ సిరీస్

మూలాలు

[మార్చు]
  1. "Siva Manasula Sakthi Movie Review". The Times of India. Archived from the original on 14 July 2018. Retrieved 18 June 2018.
  2. "Recent FTII passouts find a foothold in TV, film industry". The Times of India. Archived from the original on 14 February 2017. Retrieved 28 May 2018.
  3. S, Venkadesan (26 February 2012). "Anuya Y Bhagwat, actress". The Indian Express. Archived from the original on 13 October 2012. Retrieved 25 August 2012.
  4. "Kranti's Mahek nominated for Houston film festival". The Indian Express. 15 April 2008. Archived from the original on 10 October 2012.
  5. "Brush with terror". The Hindu. 5 December 2008. Archived from the original on 14 October 2012. Retrieved 25 August 2012.
  6. "Movie review - Madurai Sambavam". Sify. Archived from the original on 29 August 2015. Retrieved 25 August 2012.
  7. Shankaran, Malini (7 December 2011). "Anuya Y Bhagwat says by to cameos". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 25 August 2012.
  8. Shankaran, Malini (7 December 2011). "Anuya Y Bhagwat says by to cameos". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 25 August 2012.
  9. TNN (2010-12-04). "Tamil 3 Idiots' actors do style test – The Times of India". The Times of India. Retrieved 2010-12-11.
  10. "I so miss the phuchka: Anuya Bhagvath". The Times of India. 9 June 2012. Archived from the original on 9 January 2014. Retrieved 25 August 2012.
  11. "Season III of 'Ek Tha Rusty' series on Doordarshan". The Pioneer (India). Archived from the original on 26 August 2016. Retrieved 29 July 2016.
  12. "I send back love to all the people who hate me, says Anuya". The Times of India. Archived from the original on 31 August 2017. Retrieved 28 May 2018.
  13. Ramanujam, Srinivasa (4 July 2017). "Bigg Boss is sadistic, but people like it: Anuya". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 12 October 2020. Retrieved 28 May 2018.
  14. "Bigg Boss Tamil episode 8: Anuya gets evicted, Kamal Haasan asks contestants to keep it real | Tamil News - The Indian Express". web.archive.org. 2024-03-25. Archived from the original on 2024-03-25. Retrieved 2024-03-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)