Jump to content

అనుజ్ ధర్

వికీపీడియా నుండి
అనుజ్ ధర్
అనుజ్ ధర్
జనవరి 2018, భోపాల్ లో జరిగిన జాతీయ సెమినార్‌లో అనుజ్ ధర్
జననం
న్యూ ఢిల్లీ
జాతీయతఇండియన్
విద్యఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తిరచయత, జర్నలిస్ట్

అనుజ్ ధర్ ఒక భారతీయ రచయిత. ప్రముఖ పాత్రికేయుడు. సుభాష్ చంద్ర బోస్ మరణం పై పలు పుస్తకాలను ప్రచురించారు. నిజానికి బోస్ మరణం ఇప్పటికీ వీడిపోని మిస్టరీ. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు.[1][2][3] కానీ ఆయన పార్థీవ దేహం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ విమానం కూలిపోయిన తర్వాత కూడా బోస్ చాలా సంవత్సరాలు జీవించడం గురించి కుట్ర సిద్ధాంతాలను అనుజ్ ధర్ ప్రతిపాదించాడు.[4][5][6][7][8][9][10] ధర్ 'మిషన్ నేతాజీ' అనే లాభాపేక్షలేని సంస్థ వ్యవస్థాపకుడు. ధర్మకర్త కూడా. ఈ సంస్థ ముఖ్యఉద్ధేశం బోస్‌కు సంబంధించిన విషయాలను ప్రచారం చేయడం.[11]

పరిశోధనలు, వివాదాలు

[మార్చు]

1985 వరకు బోస్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గుమ్నామీ బాబా, భగవాన్జీ సన్యాసిగా జీవించాడని ధర్ పేర్కొన్నాడు.[12][13] ముఖర్జీ కమిషన్ ఈ క్లెయిమ్‌ ని రద్దు చేసింది. కారణం DNA పరీక్షలో ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడం.[14]

విమాణ ప్రమాదం తర్వాత బోస్ రష్యా (అప్పుడు, సోవియట్ యూనియన్) కు పారిపోయాడని ధర్ నమ్ముకం. అలాగే నేతాజీని లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. దీనిపై విచారించిన ముఖర్జీ కమిషన్ కు KGB ఆర్కైవ్‌లలో సంబంధిత విషయాలు ఏమీ లభ్యమవలేదు.[15]

2005లో, తైవాన్ ప్రభుత్వం ధర్‌కు పాత మత్సుయమా విమానాశ్రయం (ఇప్పుడు తైపీ దేశీయ విమానాశ్రయం) వద్ద 14 ఆగస్టు నుండి 25 అక్టోబర్ 1945 వరకు విమాన ప్రమాదం జరిగిన దాఖలాలు ఏమీ లేవని ఇమెయిల్‌ చేసారు, ముఖర్జీ కమిషన్ తుది వాదనలో ఈ రికార్డులు ప్రధాన పాత్ర పోషించాయి,[16][17] విమాన ప్రమాదంలో బోస్ మరణించడం అసంభవం అని తేల్చింది. చరిత్రకారుడు సుగత బోస్ ఈ విమానాశ్రయం 1946 వరకు జపనీయుల ఆక్రమణలో ఉందని, 1949లో తైవానీస్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందన్నారు.

బోస్ సోదరుడు శరత్ చంద్రబోస్, 'ది నేషన్‌' వార్తాపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, బోస్ చైనాలో 1949 అక్టోబర్‌లో ఉన్నాడని 'నో సీక్రెట్స్' అనే పుస్తకంలో ధర్ పేర్కొన్నాడు.[18]

2008లో ధర్ రాసిన పుస్తకం, దక్షిణ ఆసియాపై CIA యొక్క కన్ను, భారతదేశం, దాని పొరుగు దేశాలపై డిక్లసిఫైడ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రికార్డులను సంకలనం చేసింది.[19]

1945లో ప్రారంభమైన మిస్టరీ ఇప్పటికీ వీడని సుభాష్ చంద్రబోసు మృతి గురించి పరిశోధనలో ఎన్నో ఏళ్లుగా పలువురు పరిశోధకులతో అనుజ్ ధర్ అనుబంధం కొనసాగించారు. తైవాన్ ప్రభుత్వం కూడా విమాన ప్రమాదాన్ని విశ్వసించడం లేదని అన్నారు.

నెహ్రూ వలె నేతాజీ కూడా కాంగ్రెస్‌లో చాలా ఏళ్లపాటు పని చేశారు. ఆ పార్టీకి అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు. అయితే శాంతియుత పోరాటంతో స్వాతంత్య్రం వచ్చేట్లు లేదని భావించిన ఆయన గాంధీ, నెహ్రూలతో విభేదించి కాంగ్రెస్‌ పార్టీ వీడారు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని ఏర్పాటు చేసి దేశ స్వేచ్ఛ కోసం బ్రిటిష్‌ పాలకులపై పోరాడారు. అటువంటి ఆప్త మిత్రునిపై, ముఖ్య సహచర నేతపై అనంతర కాలంలో నెహ్రూ చాలా ఏళ్లపాటు నిఘా పెట్టించడం శోచనీయం అంటారు అనుజ్ ధర్.[1]

విమర్శ

[మార్చు]

నేతాజీ జీవిత చరిత్ర రచయత లియోనార్డ్ ఎ. గోర్డాన్ తన పుస్తకం బ్రదర్స్ ఎగైనెస్ట్ ది రాజ్ లో ధర్‌పై తీవ్ర వాఖ్యచేపారు. సమకాలీన భారత రాజకీయ ప్రయోజనాల కోసం సుభాష్ చంద్రబోస్ మరణ వార్తను ధర్ దుర్వినియోగం చేస్తున్నాడని గోర్డాన్ ఆరోపించారు.[20]

ప్రచురణలు

[మార్చు]
సంవత్సరం పుస్తకం ప్రచురణకర్త ISBN మూలం
2005 బ్యాక్ ఫ్రమ్ డెడ్: ఇన్‌సైడ్ ది సుభాస్ బోస్ మిస్టరీ మానస్ పబ్లికేషన్స్ ISBN 81-7049-237-8 [21]
2008 సిఐఎ'స్ ఐ ఆన్ సౌత్ ఏషియా మానస్ పబ్లికేషన్స్ ISBN 978-81-7049-346-4 [22]
2012 ఇండియా'స్ బిగ్గెస్ట్ కవర్-అప్ విటాస్టా పబ్లిషింగ్ ISBN 978-93-80828-69-5 [21]
2013 నో సీక్రెట్స్ విటాస్టా పబ్లిషింగ్ ISBN 978-93-82711-05-6
2019 "యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డెడ్" విటాస్టా పబ్లిషింగ్ ISBN 978-9386473356
2019 కనుండ్రమ్ (చంద్రచూర్ ఘోస్ తో కలసి) విటాస్టా పబ్లిషింగ్ ISBN 978-9386473578
2021 గవర్నమెంట్ డజన్ట్ వాంట్ యు టు నో దిస్ (చంద్రచూర్ ఘోస్ తో కలసి) విటాస్టా పబ్లిషింగ్ ISBN 8194964059

మూలాలు

[మార్చు]
  1. Hugh Purcell. "Subhas Chandra Bose: The Afterlife of India's Fascist Leader". History Today, Volume: 60 Issue: 11 2010. Retrieved 7 November 2013.
  2. "A Saint with no name". The Daily Star. The Daily Star. 16 January 2015. Retrieved 31 January 2015.
  3. Kirpal, Raman (12 July 2012). "Why Subhas Chandra Bose's death is India's 'biggest cover-up'". First Post India.
  4. Bandyopādhyāẏa, Śekhara (2004), From Plassey to Partition: A History of Modern India, Orient Blackswan, ISBN 978-81-250-2596-2, retrieved 21 September 2013
  5. Bayly, Christopher; Harper, Timothy (2007), Forgotten Wars: Freedom and Revolution in Southeast Asia, Harvard University Press, ISBN 978-0-674-02153-2, retrieved 21 September 2013
  6. Bose, Sugata (2011), His Majesty's Opponent: Subhas Chandra Bose and India's Struggle against Empire, Harvard University Press, ISBN 978-0-674-04754-9, retrieved 22 September 2013
  7. Metcalf, Barbara D.; Metcalf, Thomas R. (2012), A Concise History of Modern India, Cambridge University Press, ISBN 978-1-107-02649-0, retrieved 21 September 2013
  8. Wolpert, Stanley (2009), Shameful Flight: The Last Years of the British Empire in India, Oxford University Press, ISBN 978-0-19-539394-1, retrieved 21 September 2013
  9. Gordon, Leonard A. (2006). "Legend and Legacy: Subhas Chandra Bose". India International Centre Quarterly. 33 (1): 103–112. ISSN 0376-9771. JSTOR 23005940.
  10. Lebra, Joyce (2008). The Indian National Army and Japan (in ఇంగ్లీష్). Institute of Southeast Asian Studies. ISBN 9789812308061.
  11. Hugh Purcell, "The Afterlife of India's Fascist Leader: The Intriguing Death of an Indian Holy Man in 1985 Suggested That He Was None Other Than Subhas Chandra Bose, the Revolutionary and Nationalist Who, It Is Officially Claimed, Died in an Air Crash in 1945. the Truth, However, Is Harder to Find," History Today, November 2010, http://www.questia.com/read/1G1-242453005/the-afterlife-of-india-s-fascist-leader-the-intriguing Archived 2019-04-04 at the Wayback Machine [bare URL]మూస:Dl
  12. "Netaji did not die in aircrash, says web site". Rediff.com. 18 March 2006. Retrieved 7 November 2013.
  13. "Netaji did not die in aircrash: web site". www.rediff.com. Retrieved 2019-03-17.
  14. Bose, Sugata (2013-01-21). His Majesty's Opponent: Subhas Chandra Bose and India's Struggle against Empire (in ఇంగ్లీష్). Penguin Books Limited. ISBN 9788184759327.
  15. "Mukherjee Commission returns sans Netaji documents". Rediff. Retrieved 2019-03-17.
  16. "No crash at Taipei that killed Netaji: Taiwan govt". Outlook India. Kolkata. 3 February 2005. Archived from the original on 10 November 2013. Retrieved 7 November 2013.
  17. "Netaji's dead but didn't die in crash, says report; long live the mystery". Indian Express.
  18. "New book seeks to solve Netaji mystery with brother's China claim". Indian Express. Kolkata. 19 October 2013. Retrieved 7 November 2013.
  19. Dhawan, Himanshi (1 May 2009). "Reveal names of moles in Indira cabinet: CIC to govt". The Times of India. Archived from the original on 5 November 2012. Retrieved 7 November 2013.
  20. Leaonard A. Gordon (2014). Brothers Against the Raj: A Biography of Indian Nationalists Sarat and Subhas Chandra Bose. Blaft Publications. pp. 392–394. ISBN 978-8129136633.
  21. 21.0 21.1 "'India's biggest cover-up', book on Netaji mystery launched". The Economic Times. Kolkata. 17 November 2012. Archived from the original on 19 ఏప్రిల్ 2015. Retrieved 7 November 2013.
  22. Dhawan, Himanshi (1 May 2009). "Reveal names of moles in Indira cabinet: CIC to govt". The Times of India. Archived from the original on 5 November 2012. Retrieved 7 November 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=అనుజ్_ధర్&oldid=4358531" నుండి వెలికితీశారు