అనిల్ ఝా వాట్స్
అనిల్ ఝా వాట్స్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | రీతురాజ్ గోవింద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కిరారి | ||
పదవీ కాలం 2008 – 2015 | |||
తరువాత | రీతురాజ్ గోవింద్ | ||
నియోజకవర్గం | కిరారి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అనిల్ ఝా వాట్స్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కిరారి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అనిల్ ఝా వాట్స్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కిరారి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పుష్పరాజ్ పై 9,524 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రాజన్ ప్రకాష్ పై 48,526 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
అనిల్ ఝా వాట్స్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కిరారి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రితురాజ్ గోవింద్ చేతిలో 45,172 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4] ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి రితురాజ్ గోవింద్ చేతిలో 5,654 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
అనిల్ ఝా వాట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి[5] 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బజరంగ్ శుక్లాపై 21,871 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Kirari Election Result: Ex-BJP, Current AAP Candidate Anil Jha Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Former BJP MLA Anil Jha joins AAP after Kailash Gehlot's exit in Delhi" (in Indian English). The Hindu. 17 November 2024. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Kirari". Election Commission of India. 8 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Kirari Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.