అనసూయ-చుక్కమ్మ
స్వరూపం
అనసూయ - చుక్కమ్మ, ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకటచలం రచించిన ఒక నవలా సంపుటి.[1]
నవలికలు
[మార్చు]ఇందులో రెండు నవలికలు ఉన్నాయి:
1. అనసూయ: పురుష ప్రేమ స్త్రీ అనురాగమంత అమాయకమయినది కాదు. భర్తను పోగొట్టుకున్న అనసూయని, ప్రకాశరావు తన వాంఛలను తీర్చుకోవటానికి ఉపయోగించుకున్నాడు కానీ, తన దగ్గర ఉంచుకుని ఆదరించ లేక పోయాడు. అప్పుడు అనసూయ ఏమి చేసింది? స్త్రీ హృదయంలో ఉప్పొంగే సముద్రమంత ప్రేమని దోసిట పట్టి చూపించే నవలిక అనసూయ.
2.చుక్కమ్మ :చుక్కమ్మ భర్త సీనయ్య ఖైదులో ఉంటాడు. ఆ దశలో చుక్కమ్మకు సర్వ భద్రంతో సంబంధం ఏర్పడుతుంది. ఆ తరువాత ఒకనాడు భర్త తిరిగి వస్తాడు. జరుగుబాటు లేక నైజాము పోదామనుకుంటారు. అప్పుడు చుక్కమ్మ ఏం చేసింది? నిస్సహయురాలయిన యువతి అంతరంగ చిత్రణే చుక్కమ్మ.
చుక్కమ్మలో కథలు
[మార్చు]- అదృష్టం
- ఆమె త్యాగం
- చుక్కమ్మ (నార్వే నవల నుండి)
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2021-05-01.