Jump to content

అనముడి

అక్షాంశ రేఖాంశాలు: 10°10′09″N 77°03′38″E / 10.16923°N 77.06066°E / 10.16923; 77.06066
వికీపీడియా నుండి
అనముడి
నైకోలి మాల శిఖరం నుండి అనముడి శిఖరం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు2,695 మీ. (8,842 అ.)[1]
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్2,479 మీ. (8,133 అ.)
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్2,115 కి.మీ. (1,314 మై.) Edit this on Wikidata
జాబితాఅల్ట్రా
List of Indian states and territories by highest point
నిర్దేశాంకాలు10°10′09″N 77°03′38″E / 10.16923°N 77.06066°E / 10.16923; 77.06066
Naming
తెలుగు అనువాదంఏనుగు తల[2]
పేరు ఉన్న భాషమలయాళం
భౌగోళికం
అనముడి is located in Kerala
అనముడి
అనముడి
కేరళ పటంలో అనముడి శిఖరం
స్థానంఎర్నాకుళం జిల్లా, ఇడుక్కి జిల్లా, కేరళ[3]
పర్వత శ్రేణిఅనమల కొండలు, పడమటి కనుమలు
Geology
Orogenyపాన్ ఆఫ్రికన్ ఓరోజెనీ (మొజాంబిక్)
Age of rockనియోప్రోటోజోయిక్ (80.4-50.9 కోట్ల సం. క్రితం)
Mountain typeఫాల్ట్ బ్లాక్
Type of rockమున్నార్ గ్రానైట్
అధిరోహణం
సులువుగా ఎక్కే మార్గంఆరోహణ

అనముడి ("ఏనుగు తల") కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఉన్న పర్వతం. సముద్ర మట్టం నుండి 2,695 మీటర్లు (8,842 అ.) ఎత్తు, 2,479 మీటర్లు (8,133 అ.) టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ ఉన్న ఈ పర్వతం పశ్చిమ కనుమలలో, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం.

భౌగోళికం

[మార్చు]

అనముడి సముద్ర మట్టం నుండి 2,695 మీటర్లు (8,842 అ.) ఎత్తున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. దీని ప్రామినెన్స్ 2,479 మీటర్లు (8,133 అ.). దీనికి సంబంధించిన కీ శాడిల్ 2,000 కిలోమీటర్లు (1,200 మై.) ) దూరాన హర్యానాలో 28°35′20″N 76°27′59″E / 28.58889°N 76.46639°E / 28.58889; 76.46639 వద్ద ఉంది. దక్షిణ భారతదేశంలోని మూడు అల్ట్రా ప్రామినెంట్ శిఖరాలలో ఒకటి. [4] ఇది భారతదేశంలోనే అత్యధిక టోపోగ్రాఫిక్ ఐసోలేషన్ ఉన్న శిఖరం. హిమాలయాలకు దక్షిణాన ఉన్న ఎత్తైన ప్రదేశం.[5] దీనిని ఎవరెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు.[6] శిఖరం మరీ నిటారుగా ఏమీ ఉండదు. ఇది ఒక ఫాల్ట్-బ్లాక్ పర్వతం. ఉత్తర, దక్షిణ వాలులు వాలుగా ఉంటాయి. తూర్పు పడమర వాలులు బాగా నిటారుగా, కష్టమైన రాతితో ఉంటాయి.[7] ఇది ఎరవికులం నేషనల్ పార్క్ దక్షిణ ప్రాంతంలో కేరళలోని పెరియార్ నదీ పరీవాహక ప్రాంతంలోని కార్డమమ్ కొండలు, అనైమలై కొండలు, పళని కొండల కూడలి వద్ద, మున్నార్ నుండి 13 కిమీ (8 మై) దూరంలో ఉంది.[8]

వాతావరణం

[మార్చు]

కొప్పెన్-గీగర్ వాతావరణ వర్గీకరణ వ్యవస్థ ప్రకారం ఇది ఉపఉష్ణమండల హైలాండ్ (Cwb) కి చెందినది. ఇది Cwc ET సరిహద్దు వద్ద ఉంటుంది. పశ్చిమ కనుమలలోని చాలా పచ్చికభూముల లాగానే ఇక్కడి లోయలలో షోలాలు కనిపిస్తాయి.[9]

శీతోష్ణస్థితి డేటా - మున్నార్
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 16.2
(61.2)
18.0
(64.4)
20.0
(68.0)
20.1
(68.2)
18.2
(64.8)
19.5
(67.1)
17.7
(63.9)
19.9
(67.8)
19.8
(67.6)
19.2
(66.6)
18.7
(65.7)
17.8
(64.0)
20.1
(68.2)
సగటు అధిక °C (°F) 7.2
(45.0)
12.5
(54.5)
12.4
(54.3)
14.7
(58.5)
12.8
(55.0)
13.5
(56.3)
12.8
(55.0)
13.2
(55.8)
12.7
(54.9)
12.2
(54.0)
12.0
(53.6)
10.5
(50.9)
12.2
(54.0)
రోజువారీ సగటు °C (°F) 5.6
(42.1)
9.0
(48.2)
10.8
(51.4)
10.8
(51.4)
10.6
(51.1)
10.8
(51.4)
9.8
(49.6)
9.3
(48.7)
9.7
(49.5)
9.2
(48.6)
8.9
(48.0)
8.2
(46.8)
9.4
(48.9)
సగటు అల్ప °C (°F) 0
(32)
4.5
(40.1)
6.2
(43.2)
7.0
(44.6)
6.5
(43.7)
5.2
(41.4)
6.8
(44.2)
5.5
(41.9)
4.8
(40.6)
4.2
(39.6)
2.8
(37.0)
2.0
(35.6)
4.6
(40.3)
అత్యల్ప రికార్డు °C (°F) −17.2
(1.0)
−5.5
(22.1)
−5.4
(22.3)
−3.0
(26.6)
0.6
(33.1)
−1.0
(30.2)
−4.2
(24.4)
−1.9
(28.6)
−6.8
(19.8)
−5.9
(21.4)
−7.9
(17.8)
−9.5
(14.9)
−17.2
(1.0)
సగటు అవపాతం mm (inches) 120
(4.7)
150
(5.9)
197
(7.8)
229
(9.0)
389
(15.3)
420
(16.5)
889
(35.0)
710
(28.0)
310
(12.2)
299
(11.8)
264
(10.4)
164
(6.5)
4,141
(163.1)
సగటు వర్షపాతపు రోజులు 7 7 3 6 10 11 21 15 13 20 10 5 128
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 242 230 248 240 217 99 120 124 150 155 180 210 2,215
Source 1: Climate-Data.org, altitude: 2695m[9]
Source 2: Weather2Travel for sunshine and rainy days[10]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

అనముడి దాని చుట్టుపక్కల ఉన్న ఎరవికులం నేషనల్ పార్క్ నీలగిరి తహర్‌ లకు నిలయం. ఆసియా ఏనుగులు, గౌర్, బెంగాల్ పులులు, నీలగిరి మార్టెన్ ఇక్కడ కనిపించే కొన్ని జాతుల జంతువులు.[4][11] ఈ ప్రాంతం అనేక ఉభయచరాలకు ఆవాసంగా ఉంది, ఇందులో రార్చెస్టెస్ రెస్ప్లెండెన్స్ కూడా ఉన్నాయి.[12][13] అనముడి శిఖరం కురునా డెన్సిఫోలియా, గౌల్తేరియా సువాసన (శీతాకాలపు ఆకుపచ్చ), అనాఫాలిస్, ఇంపాటియన్స్, ఎరియోకాలోన్‌ వృక్షసంపదకు నెలవు.[14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Anamudi". Kerala Tourism. Retrieved 2014-11-26.
  2. R. P. Chandola (1994). Environment and Life. Bhartiya Prakashan Sansthan. p. 207.
  3. Web Map Service (Map). Survey of India. Archived from the original on 1 May 2019. Retrieved 11 December 2017.
  4. 4.0 4.1 Hunter, William Wilson; James Sutherland Cotton; Richard Burn; William Stevenson Meyer; Great Britain India Office (1909). The Imperial Gazetteer of India. Vol. 11. Clarendon Press. Archived from the original on 16 December 2008.
  5. "World Peaks with 300 km of Isolation". Peakbagger. Retrieved 12 November 2017.
  6. "Up the Everest of the South". The New Indian Express. 25 July 2017. Retrieved 25 January 2018.
  7. Hoiberg, Dale; Ramchandani, Indu (2000). Dale Hoiberg (ed.). Students' Britannica India, Volumes 1-5. Popular Prakashan. p. 63. ISBN 0-85229-760-2.
  8. Maya K. Studies on the nature and chemistry of sediments and water of Periyar and Chalakudy Rivers, Kerala (PDF) (Report). Archived from the original (PDF) on 5 July 2017. Retrieved 1 March 2005.
  9. 9.0 9.1 "Climate: Munnar: Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. Retrieved 2013-08-28.
  10. "Munnar Climate and Weather Averages, Kerala". Weather2Travel. Retrieved 28 August 2013.
  11. "Anamudi peak". Archived from the original on 3 May 2019. Retrieved 26 October 2015.
  12. "Significance of Eravikulam National Park". Eravikulam National Park. Archived from the original on 3 October 2014. Retrieved 26 November 2014.
  13. "New species of frog found in Eravikulam National Park". The Hindu. 5 May 2010. Retrieved 12 July 2019.
  14. "Eravikulam National Park Management Plan". Eravikulam National Park. Archived from the original on 4 April 2010. Retrieved 14 December 2009.
"https://te.wikipedia.org/w/index.php?title=అనముడి&oldid=4392236" నుండి వెలికితీశారు