అత్తలూరి నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్

అత్తలూరి నరసింహారావు
జననం
అత్తలూరి నరసింహారావు

1946
జాతీయతభారతీయుడు
వృత్తిఅధ్యాపకుడు
ఆంధ్ర విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి,
రచయిత,
అనువాదకుడు
గుర్తించదగిన సేవలు
రావిశాఖీయం,
స్వరాజ్యం
జీవిత భాగస్వామిటి.పద్మిని

అత్తలూరి నరసింహారావు[1] నిరసన కవులు అని పిలువబడే ఒక వర్గంలోని కవి. అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ తక్కిన నిరసన కవులు. వీరు విప్లవ రచయితల సంఘం (వి.ర.సం) కు వ్యతిరేకంగా కవిత్వం చెప్పేవారు. అత్తలూరి నరసింహారావు 1946లో జన్మించాడు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు విద్యార్థిగా ఉన్నప్పుడు వ్రాసిన నిద్ర అనే కథకు కరీంనగర్ నుండి వెలువడే విద్యుల్లత అనే పత్రిక నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి వచ్చింది.[2]

కుటుంబం

[మార్చు]

ఇతని భార్య టి.పద్మిని సంగీత విద్యాంసురాలు. ఆమె వీణావాదనంలో విశాఖపట్నం ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో ఎ గ్రేడ్ కళాకారిణి. ఆమె 2019, ఫిబ్రవరి 19న మరణించింది.[3] ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

రచనలు

[మార్చు]
  1. సాహిత్యరంగంలో ప్రతిభామూర్తులు
  2. నేనెందుకు వ్రాస్తున్నాను?
  3. చలంగారి ఉత్తరాలు (1947-1977)
  4. రావిశాఖీయం
  5. త్రిపుర ఓ జ్ఞాపకం (సంపాదకత్వం - భమిడిపాటి జగన్నాథరావు, కె.కె.రామయ్యలతో కలిసి)
  6. నాకూ ఉంది ఒక కల (అనువాదం - తుమ్మల పద్మినితో కలిసి)
  7. స్వరాజ్యం (స్వేచ్ఛానువాదం - మూలం: అరవింద్ కేజ్రీవాల్)

కథలు

[మార్చు]
  1. అతను ఆమె అందరము
  2. ఇంకానా...
  3. దారి
  4. నిద్ర
  5. రాళ్లు
  6. వీడ్కోలు

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Velcheru Narayana Rao (2003). Hibiscus on the Lake: Twentieth-century Telugu Poetry from India. Univ of Wisconsin Press. pp. 260–261. ISBN 978-02-991-7704-1.
  2. వెల్దండి శ్రీధర్ (8 October 2017). "తెలుగు సాహిత్యంలో 'విద్యుల్లత '". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 10 ఫిబ్రవరి 2020. Retrieved 10 February 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఆకాశవీణ.. పద్మిని
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.