అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజ స్వామి
జగన్మోహన్ ప్యాలస్ ఆర్ట్ గేలరీ అండ్ ఆడిటోరియం లోని త్యాగరాజ పెయింటింగ్
జననం
కాకర్ల త్యాగబ్రహ్మం

(1767-05-04)1767 మే 4
తంజావూరు
మరణం1847 జనవరి 6(1847-01-06) (వయసు 79)
తంజావుర్ మరాఠా రాజ్యం, తంజావూరు
ఇతర పేర్లుత్యగరాజు, త్యాగయ్య, త్యాగబ్రహ్మ
వృత్తివాగ్గేయకారుడు

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా ఒక కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.

ఈ కీర్తనను ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన

[మార్చు]
పల్లవి

అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా ? ఆదిమూలమా ! రామ ! ॥అడిగి॥

అనుపల్లవి

సడలని పాప తిమిరకోటి సూర్య ! సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ !ని ॥న్నడిగి॥

చరణము 1

అశ్రయించి వరమడిగిన సీత

యడవికిఁ బోనాయె;

ఆశరహరణ ! రక్కసి ఇష్టమడగ

నపుడే ముక్కువోయె; ఓ రామ !ని ॥న్నడిగి॥

చరణము 4

నీకేఁ దయబుట్టి బ్రోతువో ! బ్రోవవో !

నీ గుట్టు బయలాయె;

సాకేతధామ ! శ్రీత్యాగరాజనుత !

స్వామి! యేటి మాయ ? ఓరామ !ని ॥న్నడిగి॥

సంగీత సంప్రదాయంలో

[మార్చు]
Tyagaraja 1961 stamp of India
1961లో త్యాగరాజ పోస్టల్ స్టాంప్

అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా అనే కీర్తన కర్ణాటక సంగీత సంప్రదాయంలో బహుళ ప్రాచుర్యం పొందింది. సంగీత కచేరీలలో, గాయకులు విడుదల చేసే రికార్డులు, సీడీలు వంటి వాటిలో ఈ కీర్తనను కూడా పలువురు ప్రఖ్యాత విద్వాంసులు ఆలపించి వినిపించారు. ఈ కీర్తనను డి.కె.పట్టమ్మల్ సాంప్రదాయబద్ధంగా గానం చేశారు.[2]

పూర్తి పాఠం

[మార్చు]

మూలాలు

[మార్చు]