అడవి దివిటీలు
అడవి దీవిటీలు (1990 తెలుగు సినిమా) | |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
---|---|
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర |
భాష | తెలుగు |
అడవి దివిటీలు 1990 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించబడింది.[1]
కథ
[మార్చు]రాజకీయ సామాజిక సమస్యలను లోతుగా పరిశీలిస్తూ వాటి చుట్టూ అల్లిన ఇతివృత్తాలను వెండితెరపై చూపగలిగే వాస్తవ గధా చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. దోపిడీ వ్యవస్థపై అసంతృప్తితో ఆవేశంతో తిరగబడే యువతీ యువకుల మనోభావాలను స్నేహచిత్ర పిక్చర్స్ "ఆదవి దివిటీలు" పేరుతో కథా చిత్రంగా రూపొందించారు.
ఒక నక్సలైట్ నాయకుడు తన అనుచరులతో కలసి అడవులలో లోయలలో సంచరిస్తూ ఉంటాడు. గిరిజనుల భూములను ఇతరులు కబ్జా చేయడం అడ్డుకుంటాడు. ఆ కృషిలో గుర్నాధం అనే ఎం.ఎల్.ఏకు బద్ద శత్రువవుతాడు. హోం మంత్రి కుమారుడు దినేశ్ ఆ ప్రాంతంలో నివసించే కొండారెడ్డి కుమార్తె పద్మను చెరుస్తాడు. నలుగురికి భయపడి ఆమెను పెళ్ళాడుతాడు. కానీ ఉంపుడు గత్తెగా చూస్తానంటాడు. ఆమె అతన్ని ఎదుర్కొంటుంది. నక్సల్ నాయకుడు ఆమెకు అన్నగా అండగా నిలుస్తాడు. దినేశ్ ను అన్నలు కాల్చి చంపేస్తారు. గుర్నాథం హోం మంత్రి అండ చూసుకొని ఎన్నో అక్రమాలు సాగిస్తాడు. ఫలితంగా హత్య చేయబడుతాడు. విక్రం అనే ఎస్.పి. తన బలగంతో వచ్చి పడతాడు గిరిజనులపైకి. గూడెం తగలబెట్టిస్తాడు. కాని ఆ నక్సలైట్లలో తన కొడుకు కూడా ఉన్నాడని గుర్తిస్తాడు. అయినా కర్తవ్యం అతన్ని బద్ధుడ్ని చేస్తుంది. అతని కొడుకు కూడా ఉద్యమానికి ప్రాముఖ్యతనిస్తాడు. అతను పట్టుబడి చిత్రహింసలననుభవిస్తాడు. పద్మ ఈ అరాచకాలకు భయపడి గిరిజనులను రక్షించాలని భావించి అన్నల రహస్య స్థావరాలు పోలీసులకు చెప్పేస్తుంది. రెండు లక్షల రూపాయలతో తిరిగి వస్తుంది. తన పల్లె బాగుచేద్దామని. కాని ఆమెకు పరాభవమే ఎదురవుతుంది. చివరికి బల్లెం పోటుకు గురై మరణిస్తుంది. పోలీసులతో జరిగే పోరాటంలో చాలా మంది "అన్న"లు పోలీసులు ప్రాణాలు కోల్పోతారు. హోం మంత్రిని విక్రం స్వయంగా మంటలలోకి విసిరివెస్తాడు.
నటవర్గం
[మార్చు]- ఆర్. నారాయణమూర్తి
- దేవదాస్ కనకాల
- రాళ్ళపల్లి
- పి.ఎల్. నారాయణ
- రావూజీ
- పురాణం సూర్య
- రవిశంకర్
- రాజు
- రామలింగస్వామి
- శాంతిలత
- జానకి
- అత్తిలి లక్ష్మీ
- పూల నాగేశ్వరరావు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి
- నిర్మాణ సంస్థ: స్నేహ చిత్ర
- ప్రొడక్షన్ మేనేజర్స్: రాఘవ, ఆంజనేయులు
- నృత్యం: రాజు
- మేకప్: కొల్లిరాము
- దుస్తులు: సుబ్బారావు
- ఆపరేటివ్ కెమేరామేన్: ఎం.ఎస్.రమేష్
- అసిస్టెంట్ డైరక్టరు: దాసరి కృష్ణారావు
- నేపథ్యగానం: వంగపండు ప్రసాదరావు, పి.సుశీల, వందేమాతరం శ్రీనివాస్, లలితా సాగరి
- మాటలు: కె.బి.ఆనంద్
- పాటలు: వంగపండు ప్రసాదరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- ఛాయాగ్రహణం: ఎస్.వెంకట్
- కూర్పు: ఎ.జోసెఫ్
- సంగీతం విద్యాసాగర్
పాటలు
[మార్చు]- ఇంద్రవల్లి కొండల్లో.....: వందేమాతరం శ్రీనివాస్
- ఆగదు...: వందేమాతరం శ్రీనివాస్
- అడవితల్లి....: వందేమాతరం శ్రీనివాస్
- తూరుబిల్లి ....: వందేమాతరం శ్రీనివాస్
- ఏడవబోకయ్య....: వందేమాతరం శ్రీనివాస్
- అమాసి చీకతి ...: కె.జె.జేసుదాసు
- రండిరో...: వందేమాతరం శ్రీనివాస్
- తూరుపు దిక్కున....: వందేమాతరం శ్రీనివాస్
- ఆరిపోయింది....:మాలతి, వంగపండు ప్రసాదరావు
- పొట్టకూటికి ...: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- గంగమ్మ గుండెల్లో ...:విజయ్ యేసుదాస్
మూలాలు
[మార్చు]- ↑ "Adavi Dhivitilu (1990)". Indiancine.ma. Retrieved 2020-08-05.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అడవి దివిటీలు
- "ADAVI DIVITEELU | TELUGU FULL MOVIE | R NARAYANA MURTHU | TELUGU CINEMA ZONE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-05.