Jump to content

అజయ్ వర్మ అల్లూరి

వికీపీడియా నుండి
అజయ్ వర్మ అల్లూరి
జననంఅజయ్ వర్మ అల్లూరి
1996 సెప్టెంబర్ 07
భారతదేశం సింధనూరు, కర్ణాటక
నివాస ప్రాంతంసింధనూరు, కర్ణాటక
వృత్తికవి, అనువాదకుడు,
సాహితీవేత్త
తండ్రిఅల్లూరి కొండరాజు
తల్లిరాణి

కర్నాటకలోని రాయచూరు జల్లా సింధనూరు తాలూకాకు చెందిన అజయ్ వర్మ అల్లూరి కన్నడంలో కవితలు, కథలు రాస్తూ సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. ‘గగనసింధు’ (కవితా సంపుటి), ‘డయానా మర’(స్పానిశ్ కవయిత్రి అలెహాంద్రా పిజార్నిక్ కవితల కన్నడ అనువాదం), ‘విముక్తె’ (ఓల్గా గారి ‘విముక్త’ కథల కన్నడ అనువాదం), ‘కలల కన్నీటి పాట’ (విభా కన్నడ కవితల తెలుగు అనువాదం) వీరి ప్రచురిత పుస్తకాలు. తమ రచనలకు ద.రా.బేంద్రె కవితా పురస్కారం, అ.న.కృ కథా పురస్కారం, ప్రహ్లాద అగసనకట్టె కథా పురస్కారం, కువెంపు భాషా భారతి అనువాద పురస్కారం అందుకున్నారు. గత మూడేళ్ళ నుండి అనువాద రంగంలో సీరియస్‌గా కృషిచేస్తున్న అజయ్ హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (తులనాత్మక సాహిత్యం) చదువుతున్నారు.