Jump to content

అజయ్ మంకెనపల్లి

వికీపీడియా నుండి
అజయ్ మంకెనపల్లి
జననం21 మే
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల, సినిమా నటుడు
తల్లిదండ్రులుధనకోటి, వెంకట నరసమ్మ

అజయ్ మంకెనపల్లి రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి మధ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి, అర్థ శతాబ్దం,ఆకాశవాణి మొదలైన చిత్రాలలో నటించాడు.[1]

రంగస్థల ప్రస్థానం

[మార్చు]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవంలో పాల్గొని షార్ట్ ఫిలింను రూపొందించినందుకు 2018, జూన్ 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అజయ్ మంకెనపల్లికి ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న మామిడి హరికృష్ణ, వి.ఎన్. ఆదిత్య, శ్రీగుహ.

అజయ్ క్రియేటివ్‌ థియేటర్‌ అనే సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాడు.[2] తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజయ్ మంకెనపల్లి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాలలు శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించి, ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు , బెస్ట్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నాడు. షేక్‌స్ఫియర్‌ నాటకాన్ని తెలుగులో నాటకీకరించి ప్రదర్శించాడు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన దాదాపు పది సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించాడు.

తన క్రియేటివ్‌ థియేటర్‌[3] ద్వారా నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యువతి యువకులను నటులుగా తయారుచేస్తున్నాడు. నటన అంటే కేవలం అనుకరణ కాదని, అందులో జీవించడం ద్వారానే సహజంగా నటించగలరు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి అజయ్. అదే తన క్రియేటివ్‌ థియేటర్‌ వర్క్‌ షాప్‌ ద్వారా కొత్త నటులకు నేర్పుతున్నాడు. తన కంటూ ఒక సిలబస్‌ రూపొందించుకొని తనదైన ప్రత్యేక ముద్రను నాటక రంగంలో కనబరుస్తున్నాడు. క్రియేటివ్‌ థియేటర్‌ ఇప్పటి వరకు మూడు వర్క్‌ షాప్‌లు నిర్వహించింది. క్రియేటివ్‌ థియేటర్‌ తయారుచేసిన నటులతోనే ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్‌ రచించిన అసమర్ధుడు[4][5]నాటకం అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో నాటకం రూపొందించాడు. అది ఇప్పటికే రెండు సార్లు రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది. మెర్సీ రాసిన మరో నాటికం త్రిపుర శపథం కూడా అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో జనవరి 5న ప్రదర్శించబడింది.

నటించినవి

[మార్చు]

నాటకాలు:

  1. గాడ్‌ మంకీ డెవిల్‌
  2. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
  3. ఆలోచన, 7 మార్పు
  4. పలనాటి యుద్ధం
  5. నిశ్శబ్దం
  6. జ్యోతిరావు పూలే
  7. నాయకురాలు
  8. బతుకమ్మ
  9. రజాకార్‌
  10. నోటు భారతం
  11. జయ జయహే తెలంగాణ
  12. గొల్ల రామవ్వ
  13. స్వక్షేత్రం
  14. గాలి గోపురం
  15. కాగితం పులి
  16. గబ్బర్‌ సింగ్‌
  17. జంబుద్వీపం
  18. లోకా సమస్తా సుఖినోభవంతు

దర్శకత్వం వహించిన నాటకాలు

[మార్చు]
  1. అసమర్ధుడు
  2. త్రిపుర శపథం
  3. గొల్ల రామవ్వ
  4. గాడ్‌ మంకీ డెవిల్‌
  5. ఏ మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌
  6. నానాజాతి సమితి
  7. ఆలోచన
  8. మార్పు

నటించిన సినిమాలు

[మార్చు]

బహుమతులు

[మార్చు]
  1. తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం 2021-2022
  2. జాతీయ రఘుబాబు నాటకోత్సవాల్లలో గొల్ల రామవ్వ నాటకానికి గాను ఉత్తమ నాయకుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌
  3. యూత్‌ అవార్డు 2021
  4. సింగిడి యంగ్‌ డిస్టింగ్విష్డ్‌ అవార్డ్స్‌
సింగిడి అవార్డు అందుకుంటూ

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (2 January 2022). "యువ నాటక మార్గ దర్శకుడు". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 12 January 2022.
  2. NavaTelangana (26 March 2023). "నాటకానికి యువ శోభ". Archived from the original on 1 April 2023. Retrieved 1 April 2023.
  3. "యువ నాటక మార్గ దర్శకుడు | జోష్". m.navatelangana.com. Retrieved 2022-01-05.
  4. "Higher footfall, more plays: Theatre is picking up in Hyderabad after COVID-19 gap". The News Minute (in ఇంగ్లీష్). 2021-10-21. Retrieved 2022-01-05.
  5. ""అసమర్థుడు" నాటక ప్రదర్శన -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-08. Retrieved 2022-01-05.