Jump to content

అచ్చి కృష్ణాచారి

వికీపీడియా నుండి

అచ్చి కృష్ణాచారి (ఏ.కె.చారిగా సుపరిచితులు) ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్ర్య సమరయోధుడు.[1] అతను తొలి తరం వైద్య నిపుణుడు, లక్షన్నర శస్త్ర చికిత్సలు చేసిన ఘనుడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను ఏప్రిల్ 21, 1930న జన్మించారు. అతను తండ్రి ప్రముఖ ఆగమశాస్త్ర పండితుడైన ఎ.నరసింహాచారి. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు.

వృత్తి

[మార్చు]

అతను ధూల్‌పేట్ ప్రాంతంలో వైద్య వృత్తిని ఆరంభించారు. గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. కర్నూల్ మెడికల్ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్‌గా, గాంధీ ఆస్పత్రిలో సర్జరీ విభాగం హెచ్‌వోడీగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి 1983లో గాంధీ ఆస్పత్రిలో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అతను వైద్య సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతినిధిగా రష్యా, యూకే, యూఎస్‌ఏలలో కూడా పర్యటించారు.

మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు వంటి ప్రముఖులకు అతను శస్త్రచికిత్సలు చేశారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులెందరికో ఆయున స్వస్థత చేకూర్చారు. వరంగల్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లోని తండాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి తరలి వస్తారు. రోగుల నుంచి ఆయున నావుమాత్రపు ఫీజు తీసుకునేవారు. "పేద వాళ్లం. పైసలు ఇచ్చుకోలేం" అని చెబితే చాలు, రూపాయిు తీసుకోకుండా సర్జరీ చేసిన సందర్భాలు వేలకు వేలు ఉన్నాయి.[2]

పురస్కారాలు

[మార్చు]
  • 1990ల పే శాస్త్ర మెుమోరియల్‌ ఒరేషన్‌ అవార్డు
  • 1991లో డాక్టర్‌ ఎంసీోషి మెమోరియుల్‌ ఒరేషన్‌ అవార్డు,
  • 1992లో డాక్టర్‌ ఆరాస్తు మెమోరియయుల్‌ ఒరేషన్‌ అవార్డులు

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చారి తండ్రి ఆగమశాస్త్ర పండితుడు. ఏకే చారి మాత్రం తన పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దారు. ముుగ్గురు కుమాూరులు పాండురంగాచారి, వెూహనాచారి, శోభన్‌బాబు డాక్టర్లే.[3] ముుగ్గురు కోడళ్లలో ఇద్దరు డాక్టర్లు. ఆయ మేనల్లుళ్లూ వైద్యులే.

మరణం

[మార్చు]

అతను కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. మే 18 2016 ఉదయం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. అతనుకు భార్య (శ్రీదేవి) ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ప్రముఖ వైద్యుడు ఏకే చారి కన్నుమూత Sakshi | Updated: May 19, 2016
  2. 2.0 2.1 "మనసున్న వైద్యుడు ఏకే చారి ఇకలేరు 19-05-2016". Archived from the original on 2016-05-22. Retrieved 2016-05-21.
  3. Dr.A.K.Chary May 19, 2016, timesofindia.indiatimes

ఇతర లింకులు

[మార్చు]