అఖౌరీ సిన్హా
అఖౌరీ సిన్హా భారత-అమెరికా శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలోని జెనిటిక్స్, సెల్ బయాలజీ విభాగం ప్రొఫెసర్. ఇతను జంతు జనాభాకు సంబంధించి కీలక వివరాలు సేకరించడంతోపాటు అనేక పరిశోధనలు చేసాడు. అంటార్కిటికాలో ఓ పర్వతానికి ఈయన పేరు పెట్టి ఇతనిని అమెరికా అరుదైన గౌరవంతో సత్కరించింది. 1971-72లో ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా 990 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెడుతూ అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా కమిటీ, అమెరికా జియలాజికల్ సర్వేలు నిర్ణయం తీసుకున్నాయి. బెల్లింగ్షాసెన్, అమండ్సెన్ సముద్ర ప్రాంతాల్లో సీల్స్, వేల్స్, పక్షుల జనాభాపై అధ్యయనం చేసిన బృందంలో అఖౌరీ సిన్హా సభ్యుడు కావడంతో అంటార్కిటికాలోని ఓ పర్వతానికి ఈయన పేరు పెట్టి సత్కరించారు.
విద్య
[మార్చు]- 1954లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ.
- 1956లో పాట్నా యూనివర్సిటీ నుంచి జువాలజీలో ఎంఎస్సీ.
ఉపాధ్యాయునిగా
[మార్చు]1956 నుంచి 1961 జూలై వరకు రాంచీ కాలేజీలో జువాలజీ అధ్యాపకునిగా పనిచేసిన ఈయన తరువాత అమెరికా వెళ్లి మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని జన్యుశాస్త్రం, కణ జీవశాస్త్రం, వృద్ధి విభాగంలో ఆచార్యుడిగా ఉన్నారు.
అంటార్కిటికా పరిశోధన బృందంలో
[మార్చు]1972, 1974లో దాదాపు 22 వారాలపాటు జరిగిన అంటార్కిటికా పరిశోధనల్లో అఖౌరీ సిన్హా పాలుపంచుకున్నారు. ఈ బృందం అంటార్కిటికాలోని బెల్లింగ్స్హాసెన్, అమండ్సేన్ సముద్రాల్లో సీల్, తిమింగలం, పక్షుల సంఖ్యపై పరిశోధన నిర్వహించింది. ఈ బృందంలో సభ్యుడిగా సిన్హా చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా "మెక్డొనాల్డ్ హైట్స్" దక్షిణ భాగంలో ఉన్న 990 మీటర్ల ఎత్తయిన ఓ పర్వతమునకు "మౌంట్ సిన్హా" అని అమెరికా జియలాజికల్ సర్వే, అంటార్కిటిక్ పేర్ల సలహా సంఘం నామకరణం చేశాయి.
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 02-07-2014
- ఈనాడు దినపత్రిక - 02-07-2014