Jump to content

అఖిలేష్ ప్రసాద్ సింగ్

వికీపీడియా నుండి
డా. అఖిలేష్ ప్రసాద్ సింగ్
అఖిలేష్ ప్రసాద్ సింగ్


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
నియోజకవర్గం బీహార్

బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 డిసెంబర్ 2022
ముందు మదన్ మోహన్ ఝా

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 ఏప్రిల్ 2018
ముందు అలీ అన్వార్, జనతా దళ్ (యునైటెడ్)

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004-2009
నియోజకవర్గం మోతీహరి

వ్యక్తిగత వివరాలు

జననం (1962-01-05) 1962 జనవరి 5 (వయసు 63)
జెహానాబాద్, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం అర్వాల్, బీహార్, భారతదేశం
మూలం https://loksabhaph.nic.in/Members/memberbioprofile.aspx?mpsno=4152&lastls=14

అఖిలేష్ ప్రసాద్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుండి మోతీహరి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా, 2018[1], 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీహార్ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అఖిలేష్ అర్వాల్ అర్వాల్ జిల్లాకు చెందినవాడు. ఆయన 2004లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో అర్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలివారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2000 నుంచి 2004 వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోతీహరి నియోజకవర్గం నుండి రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై లాలూ ప్రసాద్‌తో విభేదాల అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరి 2004 నుండి 2009 వరకు వ్యవసాయ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

అఖిలేష్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్వి చంపారన్ శాసనసభ నియోజకవర్గం నుండి[3] ఆ తరువాత 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తరారి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2018లో బీహార్ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] అఖిలేష్ ప్రసాద్ సింగ్ 2022లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడై[5], 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీహార్ నుండి కాంగ్రెస్ తరపున రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. Uniindia News (15 March 2018). "Six including Ravi Shankar Prasad elected to Rajya Sabha unopposed". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  2. Andhrajyothy (14 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
  3. India Today (20 April 2009). "Akhilesh Prasad Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  4. ThePrint (29 April 2022). "Cong MP Akhilesh Prasad Singh appointed as Chairman of Parliamentary standing committee on Subordinate Legislation". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  5. The Times of India (6 December 2022). "Akhilesh Prasad Singh is new Bihar Congress chief". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.