Jump to content

అక్షాంశం

వికీపీడియా నుండి

భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. వీటిలో ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్యరేఖ అని పేరు. భూమధ్యరేఖను 00 అక్షాంశం అని అంటారు. భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్ధభాగాలుగా విభజిస్తుంది. భూమధ్యరేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్థగోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు. భూమధ్యరేఖ సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలు అక్షాంశాలు.[1]

అక్షాంశ రేఖలన్నింటిలోకి భూమధ్య రేఖ వృత్తం అతిపెద్దది. ఈ ప్రాంతంలో భూమి చుట్టుకొలత 40,075 కి.మీ. ఉంటుంది. మిగతావన్నీ పోనుపోను తగ్గి ధృవాల వద్ద బిందువుగా ఏర్పడతాయి. ఒక అక్షాంశం విలువ భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగాగాని, దక్షిణంగాగాని ఆ అక్షాంశంపైగల బిందువుల నుంచి భూకేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖకు, భూమధ్యరేఖా తలానికి మధ్య ఉన్న కోణానికి సమానం. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని ఉత్తర అక్షాంశాలని అంటారు. దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని దక్షిణ అక్షాంశాలని అంటారు.[2]

వివిధ అక్షాంశాలు

[మార్చు]
డిసెంబర్ అయనాంతం వద్ద భూమి ధోరణి.

భూమధ్యరేఖకు ఇరువైపుల నాలుగు ముఖ్యమైన అక్షాంశాలున్నాయి.

ఆర్కిటిక్ వలయం 66° 34′ (66.57°) N
కర్కాటక రేఖ 23° 26′ (23.43°) N
మకర రేఖ 23° 26′ (23.43°) S
అంటార్కిటిక్ వలయం 66° 34′ (66.57°) S
  • అక్షాంశాలన్నీ ఊహారేఖలు. ఇవి మొత్తం 0 అక్షాంశమైన భూమధ్యరేఖను కలుపుకొని 181 ఉన్నాయి.
  • అక్షాంశానికి, అక్షాంశానికి మధ్య దూరం 111 కి.మీ. ఉంటుంది.
  • 00 అక్షాంశం వద్ద పగటికాలం 12 గంటలుంటుంది. ఈ పగటికాలం అక్షాంశాన్ని, రుతువులను బట్టి మారుతూ ఉంటుంది.
  • అక్షాంశాలను డిగ్రీలు (0), నిమిషాలు (′), సెకండ్ల(′′)గా సూచిస్తారు.
  • అక్షాంశాల్ని ఇంగ్లిష్‌లో లాటిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం.
  • లాటిట్యూడ్ అనే పదం లాటిన్ అనే పదం లాటిట్యూడో అనే పదం నుంచి వచ్చింది.
  • అన్ని అక్షాంశాల్లో భూమధ్యరేఖ అతి పొడవైంది. రెండువైపులా అంటే ఉత్తర, దక్షిణ వైపులకు వెళ్లేకొద్దీ ఈ అక్షాంశాలు చిన్నవిగా కనిపిస్తాయి.
  • అక్షాంశానికి, మరొక అక్షాంశానికి మధ్యదూరం 111 కి.మీ.

మూలాలు

[మార్చు]
  1. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "అక్షాంశాలు - రేఖాంశాలు". pratibha.eenadu.net. Retrieved 2021-07-29.
  2. https://itpd.ncert.gov.in/pluginfile.php/1226731/mod_page/content/2/module%20-12%20final%2851219%29.pdf

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అక్షాంశం&oldid=3847875" నుండి వెలికితీశారు