అక్షరాభ్యాసం
అక్షరాభ్యాసం | |
---|---|
యితర పేర్లు | విద్యారంభం లేదా అక్షరారంభం |
జరుపుకొనేవారు | హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు |
రకం | భారతదేశం, సంస్కృతి |
2024 లో జరిగిన తేది | 14 ఫిబ్రవరి (బుధవారం) |
ఉత్సవాలు | అక్షర అభ్యాసం, ఓం రాయటం, సరస్వతీ దేవి పూజ |
అక్షరాభ్యాసం లేదా విద్యారంభం లేదా అక్షరారంభం అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వచ్చే వసంతపంచమి నాడు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యాదీక్ష ఇవ్వబడుతుంది, తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడు. ఈ ఆచారంలో సరస్వతీ దేవి పూజ చేస్తారు.[1]
వివరణ, పద్దతి
[మార్చు]ఈ కార్యక్రమం కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని హిందూ కుటుంబాలలో సర్వసాధారణంగా జరుపుతారు. అక్షరం అంటే నశించనిది (వర్ణమాల) అని, అభ్యాసం అంటే నేర్చుకోవడం అని అర్థం. వాటిని నేర్చుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం. ఈ వేడుకను తల్లి లేదా తండ్రి లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో పురోహితుని ద్వారా పిల్లల కుడి చేతితో బిడ్డను తన ఒడిలో ఉంచుకుని, పంచాక్షరీ మంత్రంతో పాటు ఓంను వ్రాస్తూ అక్షరం దిద్దిస్తారు.[2]
బాసరలో
[మార్చు]ఓం చిహ్నాన్ని బీజాక్షరిగా వ్యవహరిస్తారు (సంస్కృతంలో బీజ అంటే మూలం). తెలంగాణలోని బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో ఇటువంటి వేడుకలు పెద్ద సంఖ్యలో జరుగుతాయి.[3][4]
శిశు మందిరాల్లో
[మార్చు]దేశ వ్యాప్తంగా విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని సామూహిక అక్షరాభ్యాసాలు పేరుతో ప్రతి సంవత్సరం వసంతపంచమి నాడు నిర్వహించి, పిల్లలకు అక్షర పరిచయం చేస్తారు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Shopping month is here". The Hindu. 2009-07-13. Archived from the original on 17 July 2009. Retrieved 6 February 2012.
- ↑ P. Ram Mohan (2008-02-12). "Devotees put to hardship at Basar". The Hindu. Archived from the original on 16 February 2008. Retrieved 6 February 2012.
- ↑ "`Aksharabhyasam' launched". The Hindu. 2007-01-24. Archived from the original on 21 January 2008. Retrieved 6 February 2012.
- ↑ "Pilgrims throng Basar on Vasantha Panchami". The Times of India. Archived from the original on 16 July 2012. Retrieved 6 February 2012.
- ↑ "ఘనంగా వసంత పంచమి". sakshi.com news telangana. Archived from the original on 2018-01-23. Retrieved 2018-01-23.
- ↑ "శిశుమందిర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం". telugu.getlokalapp.com. 2021-02-16. Archived from the original on 2022-01-31. Retrieved 2021-02-16.