అక్షయ పాత్ర ఫౌండేషన్
స్వరూపం
స్థాపన | 2000 |
---|---|
రకం | లాభాపేక్ష లేని సంస్థ |
కార్యస్థానం |
|
ఉత్పాదనs | మధ్యాహ్న భోజనం |
రాబడి |
|
జాలగూడు | http://www.akshayapatra.org/ https://foodforeducation.org |
అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశంలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండి, దానిని నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని పాఠశాలలకు అందజేస్తుంది. ఇది 2000లో ప్రారంభించబడింది. పిల్లలు ఆకలితో చదువుకు దూరమవకుండా నిరోధించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం.[1]
లక్ష్యాలు
[మార్చు]- తరగతి గదిలో ఆకలి బాధలను తొలగించడం.
- పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరగడం.
- సమాజంలో కుల విభేదాలను తొలగించడం.
- పౌష్టికాహారం అందించడం.
- మహిళా సాధికారత.
- ఆకలి కారణంగా భారతదేశంలో విద్యను తిరస్కరించకూడదు.
- 2020 నాటికి 50 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడం.hunger[2]
మధ్యాహ్న భోజన పథకం
[మార్చు]భారత ప్రభుత్వం విద్యాభివృద్ధికి, తరగతి గది ఆకలి నిర్మూలనకు రెండు ప్రధాన కార్యక్రమాలను రూపొందించింది.
- అందరికీ విద్య
- మధ్యాహ్న భోజన పథకం (MDMS)
అక్షయ ఫౌండేషన్ పది రాష్ట్రాల్లోని 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు, 14 రాష్ట్రాల్లోని పది లక్షల మంది విద్యార్థులకు వ్యక్తిగతంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఇది, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలో 22 కేంద్రీకృత ఆధునిక పరిశుభ్రమైన వంటశాలలను కలిగి ఉంది.[3][4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ Mid Day Meal Scheme
- ↑ "classroom hunger". Archived from the original on 15 అక్టోబరు 2014. Retrieved 24 మార్చి 2014.
- ↑ "Schools prefer midday meals supplied by Akshaya Patra".
- ↑ "meals provided were prepared scientifically and with required nutritional value".
- ↑ "Government plans Saturday upgrade for midday meals".
- ↑ "food prepared by Akshaya Patra has been found to be the HIGHEST QUALITY FOOD and prepared in the CLEANEST environment among all midday meal providers in India".
- ↑ "Revamp quality of mid-day meals by relooking at the nutrient intake". Archived from the original on 2016-06-10. Retrieved 2022-01-01.