Jump to content

అక్కపల్లె

అక్షాంశ రేఖాంశాలు: 15°25′7.428″N 79°8′2.364″E / 15.41873000°N 79.13399000°E / 15.41873000; 79.13399000
వికీపీడియా నుండి
అక్కపల్లె
గ్రామం
పటం
అక్కపల్లె is located in ఆంధ్రప్రదేశ్
అక్కపల్లె
అక్కపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°25′7.428″N 79°8′2.364″E / 15.41873000°N 79.13399000°E / 15.41873000; 79.13399000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంబేస్తవారిపేట
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

అక్కపల్లె ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దేవాలయాలు

[మార్చు]

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నూతన జీవధ్వజ ప్రతిష్ఠ సందర్భంగా, 2014,జూన్-5, గురువారం నాడు, విశేషపూజలు నిర్వహించారు. విష్వక్సేన, పంచగవ్యాదిపూజలు, ధ్వజస్థంభానికి మంగళహారతి, విశేషపూజలు నిర్వహించారు. శుక్రవారం నాడు విశేషపూజలు నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, కలశస్థాపన, మూర్తిహోమాలు, పంచామృతాభిషేకాలు, అర్చనలు, హోమం నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం చేసారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. శనివారం నాడు స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. యంత్రస్థాపన, ధ్వజప్రతిష్ఠ చేసారు. స్వామివారికి విశేషపూజలు చేసారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]