తుమ్మ
స్వరూపం
(అకేసియా నుండి దారిమార్పు చెందింది)
తుమ్మ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | Acacieae
|
Genus: | అకేసియా Philip Miller
|
జాతులు | |
About 1,300; see List of Acacia species |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని అకేసియా (Acacia) ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.
రకాలు
[మార్చు]- అకేసియా అరాబికా - నల్ల తుమ్మ
- అకేసియా ల్యూకోఫ్లియా - తెల్ల తుమ్మ
- అకేసియా మెలనోజైలాన్ - ఆస్ట్రేలియా తుమ్మ
- అకేసియా ఫార్నెసియాన - నాగ తుమ్మ
- అకేసియా కెటచ్యు - కాచు
- అకేసియా కాన్ సిన్నా - సీకాయ
- అకేషియా అరికులిఫోర్మిస్
పెరిగే ప్రదేశాలు
[మార్చు]ఇది ప్రాథమికంగా పాకిస్థాన్, లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారతదేశంలో ఎక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖ్యంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
ఉపయోగాలు
[మార్చు]- తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు, జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
- కొన్ని జాతుల మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి.
- తుమ్మ చెట్టు నుండి జిగురు లభిస్తుంది.
- తుమ్మ ఆకులు జీలకర్ర, వాము కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
- రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
- దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
- తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన టాన్సిల్స్ నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
- బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
- లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
- ఎండిన తుమ్మ చెట్టు కంపలను కంచెగా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.
చిత్రమాలిక
[మార్చు]-
Acacia drepanolobium
-
Acacia sp.
సూచికలు
[మార్చు]Look up తుమ్మ in Wiktionary, the free dictionary.