Jump to content

అందరికీ మొనగాడు

వికీపీడియా నుండి
(అందరికి మొనగాడు నుండి దారిమార్పు చెందింది)
అందరికీ మొనగాడు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
భారతి,
ముక్కామల,
ప్రభాకర రెడ్డి,
రాజబాబు,
విజయలలిత,
జ్యోతిలక్ష్మి,
గుమ్మడి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ పద్మావతీ పిక్చర్స్
భాష తెలుగు

అందరికీ మొనగాడు 1971, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు సినిమా. ఎం.మల్లికార్జునరావు స్వీయదర్శకత్వంలో శ్రీ పద్మావతీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] ఘట్టమనేని కృష్ణ, భారతి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[2]

  1. అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. ఒక పనిమీద వచ్చాను వచ్చిన పనినే మరిచాను నీమగసిరి రవ్వంత చూసి నా మనసు పూర్తిగా ఇచ్చాను - ఎల్.ఆర్.ఈశ్వరి
  3. ఓ కమ్మనిదొకటి దాచాను ఇమ్మన్నది నీకు ఇస్తాను చక్కనివాడా మక్కువతీరా ఉక్కిరి బిక్కిరి చేస్తాను - ఎల్.ఆర్.ఈశ్వరి
  4. దారంట పోయేదానా నీవెంట నేను రానా నా జంట నీవై నీ పంట నేనై పొదరింట నిను దోచుకోనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. బింకంలోని పెంకితనం నాదే నాదే నా పొంకంలోని వెచ్చదనం నీదే నీదే- ఎల్.ఆర్.ఈశ్వరి

కథాసంగ్రహం

[మార్చు]

డాక్టర్ రాజా అనే సైంటిస్టు తయారు చేస్తున్న అమూల్యమైన పరిశోధనా పత్రాలను స్వాయత్తం చేసుకోవాలని సర్దార్ అనే దేశద్రోహి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాజా వద్ద సెక్రెటరీగా పనిచేస్తున్న విమల అనే అమ్మాయి ఆ దేశద్రోహుల ముఠా చేతుల్లో చిక్కి రాజా పరిశోధనల ఫార్ములాను అందజేసి వారి చేతుల్లోనే బలై పోయింది. ఆ దేశద్రోహుల ముఠాను కనిపెట్టి వారిని మట్టుపెట్టడానికి కేంద్ర అపరాధ పరిశోధక శాఖ గోపి అనే గూఢచారి 116 ను నియమిస్తుంది. గోపి విమల చెల్లెలు లీలను రాజా వద్ద సెక్రెటరీగా నియమించి తద్వారా ఆ ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈలోగా వారిద్దరూ ప్రేమలో పడతారు. క్షణక్షణానికీ ప్రాణాపాయ ఘటనలను ఎదుర్కొంటారు. వారిద్దరూ సర్దార్‌ను, అతని ముఠాను ఎలా ఎదుర్కొన్నారన్నదే మిగిలిన సినిమా.[3][4]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Andhariki Monagadu (M. Mallikarjun Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 14 January 2023.
  2. ఈశ్వర్ (13 February 1971). Andhariki Monagadu (1971)-Song_Booklet (1 ed.). p. 8. Retrieved 14 January 2023.
  3. సంపాదకుడు (21 February 1971). "చిత్ర సమీక్ష:అందరికీ మొనగాడు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 14 జనవరి 2023. Retrieved 14 January 2023.
  4. వీరా (21 February 1971). "చిత్రసమీక్ష: అందరికీ మొనగాడు" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original (PDF) on 14 జనవరి 2023. Retrieved 14 January 2023.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)