Jump to content

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం

వికీపీడియా నుండి
స్త్రీ హింసను వ్యతిరేకిస్తూ గ్రాఫిటీ, మెక్సికో
మెక్సికో డౌన్ టౌన్ లో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం నాడు గ్రాఫిటీ

నేటి సమాజములో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయము, విద్యాపరముగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మన్యూనతా భావానికిలోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము(ఆంగ్లం: International Day for the Elimination of Violence against Women)గా పాటించాలని ఈ తీర్మానము (తీర్మానము 54/134) సారాంశము [1]

చరిత్ర

[మార్చు]

చారుత్రాత్మకంగా ఈ దినాన్ని 1960 లో డొమైన్ రిపబ్లిక్ లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ యొక్క హత్య ఆధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం జరిగింది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో (1930–1961) చే 1981 లో అజ్ఞాపించబడినవి.[1] ఉద్యమకారులు నవంబరు 25 న స్త్రీ హింసా వ్యతిరేకత గూర్చి అవగాహన కల్పించుటకు నిర్ణయించారు; 1999 డిసెంబరు 17 న ఈ దినాన్ని అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.[1]

ఐక్యరాజ్య సమితి అంతర పార్లమెంట్ సమాఖ్య అన్ని ప్రభుతాలను, అంతర్జాతీయ సంస్థలకు, ఎన్.జి.ఒ లకు ఆ రోజున అంతర్జాతీయ కార్యక్రమంగా మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించింది.[2] ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఫర్ వుమెన్ (UNIFEM ఈ దినాన్ని ప్రతి సంవత్సరం పరిశీలించి కొన్ని సలహాలను యితర సంస్థలకు యివ్వడం జరుగుతుంది.[ఆధారం చూపాలి]

2012 లో ఈ దినాన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి మూన్ సందేశంతో ప్రారంభించబడింది.

Millions of women and girls around the world are assaulted, beaten, raped, mutilated or even murdered in what constitutes appalling violations of their human rights. [...] We must fundamentally challenge the culture of discrimination that allows violence to continue. On this International Day, I call on all governments to make good on their pledges to end all forms of violence against women and girls in all parts of the world, and I urge all people to support this important goal.[3]

మహిళలపై హింసా కార్యకలాపాల డాటా

[మార్చు]

ఆస్ట్రేలియా

[మార్చు]

2013 లో అస్ట్రేలియా లోని "The Conversation" ఆన్‌లైన్ మీడియాలో ఒక ఆర్టికల్ "Ending violence against women is good for everyone" విడుదలైనది. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రసారంకాబడింది. ఈ ప్రసారంలో సాధారణ అస్ట్రేలియన్ నమ్మకం ప్రకారం ఆస్ట్రేలియన్ మహిళలు యితర దేశాల కంటే తక్కువ రక్షింపబడుతున్నారని. ఆస్ట్రేలియా లోని "ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్" ప్రకారం "ఆస్ట్రేలియా లోని ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు జీవితంలో ఒకసారైనా హింసకు గురవుతూ ఉన్నారు.23 శాతం నుండి 28 శాతం మహిళలు లైంగిక హింస లేదా భావోద్వేగ హాని కలిగియున్నారని తెలుస్తుంది. [4] ఈ గణాంకాలను 2005 లో ప్రచురింబబడిన "Personal Safety Survey Australia" ఆధారంగా తీసుకోబడింది.[5]

మానవ హక్కుల దినోత్సవం

[మార్చు]

The date of the International Day for the Elimination of Violence Against Women also marks the start of the "16 Days of Activism" that precedes Human Rights Day on December 10 each year.

యివి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "International Day for the Elimination of Violence against Women". United Nations. United Nations. 2013. Retrieved 21 March 2013.
  2. "HOW PARLIAMENTS CAN AND MUST PROMOTE EFF ECTIVE WAYS OF COMBATING VIOLENCE AGAINST WOMEN IN ALL FIELD" (PDF). The 114 th Assembly of the Inter -Parliamentary Union,. IPU. Retrieved 25 November 2012.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  3. "Secretary-General's Message for 2012". United Nations. United Nations. 2013. Retrieved 21 March 2013.
  4. Murray, Linda (2013-03-08). "Ending violence against women is good for everyone". The Conversation. The Conversation Media Group. Retrieved 10 March 2013.{{cite web}}: CS1 maint: date and year (link)
  5. Australian Bureau of Statistics (2006). "Personal Safety Survey Australia" (PDF). Australian Bureau of Statistics. Commonwealth of Australia. Retrieved 10 March 2013.

యితర లింకులు

[మార్చు]