అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Swami_Prabhupada.jpg/225px-Swami_Prabhupada.jpg)
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (International Society for Krishna Consciousness) లేదా ఇస్కాన్ (ISKCON), దీనికి హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు.[1] ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను భక్తి యోగములను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు ఉన్నాయి.
ముఖ్య ఉద్దేశ్యాలు
[మార్చు]1966లో ఇస్కాన్ స్థాపించినపుడు, శ్రీల ప్రభుపాద, 7 ముఖ్య ఉద్దేశ్యాలను ప్రకటించాడు.[2]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Rath_Yatra.jpg/225px-Rath_Yatra.jpg)
- ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం. ప్రజలలో ధార్మిక చింతనను అలవర్చడం. ప్రపంచంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం.
- కృష్ణ తత్వాన్ని, భగవద్గీత ప్రవచనాలనూ శ్రీమద్‌భాగవతాన్ని ప్రచారం చేయడం.
- కృష్ణ భక్తులను పెంచడం. వీరిని ఒక వేదికపై తీసుకురావడం, మానవతావాదాన్ని పెంచడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం.
- సంకీర్తనా ఉద్యమాన్ని ప్రోత్సహించడం, సామూహిక కీర్తనలు చేపట్టడం, తద్వారా చైతన్యమహాప్రభు బోధనలను అమలు పరచడం.
- భక్తుల కొరకు, ఆధ్యాత్మిక భవనాలను నిర్మించడం.
- భక్తులను, సభ్యులను దరిచేర్చి, సాత్విక జీవన చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం.
- పై ఉద్దేశ్యాలను జనబాహుళ్యంలోకి తీసుకు వెళ్ళుటకు, పత్రికలను ప్రచురించడం, గ్రంథాలను రచించడం.
నాలుగు జీవన సూత్రాలు
[మార్చు]శ్రీల ప్రభుపాదుడు, నాలుగు జీవన సూత్రాలను సూచించాడు.[3] ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూలాలు:
- సాత్విక ఆహారపు అలవాట్లు అలవర్చడం, మాంసాహారాన్ని త్యజించడం.
- వ్యభిచరించరాదు.
- జూదము ఆడరాదు.
- మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించరాదు.
నాలుగు ధర్మ పాదాలు
[మార్చు]ధర్మము యొక్క నాలుగు పాదాలు:[3]
- దయ, కరుణ
- తపస్సు, స్వీయ నిగ్రహం, ధ్యానం.
- సత్యం, సత్యసంధత.
- స్వీయ ప్రచ్ఛాళన (శుచి శుభ్రత) శరీరం ఆత్మల పరిశుద్ధత.
ఇస్కాన్ కృష్ణదేవాలయాలు
[మార్చు]ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తున్నది. అధునాత, సంప్రదాయ శైలుల మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణతో ఆ ఊళ్ళలో భక్తులకు, పర్యాటకులకు సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతున్నాయి.
ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Iskon_Temple.jpg/250px-Iskon_Temple.jpg)
బెంగుళూరులోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.[4] మధు పండిట్ దాస్ గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో 1990 - 1997సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా 1997 మే 31న ప్రారంభమయినది.
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.[5] ఈ గుడి బెంగుళూరులో రాజాజీనగర్ అనే ప్రాంతములో ఉంది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
ఇస్కాన్ దేవాలయం, హైదరాబాదు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/b/b8/Iskconhyd.jpg/220px-Iskconhyd.jpg)
హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే వీధిలో ఉంది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయము (G.P.O.) నకు చేరువలో ఉంది.[6] ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డిగారు దానం చేశారు.
ఇస్కాన్ దేవాలయం, విశాఖపట్నం
[మార్చు]విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లో ఇస్కాన్ దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవతలు రాధాకృష్ణులు.
ఇస్కాన్ దేవాలయం ఢిల్లీ
[మార్చు]ఇస్కాన్ దేవాలయం ఋషీకేశ్
[మార్చు]ఇస్కాన్ దేవాలయం, రాజమండ్రి
[మార్చు]ఇస్కాన్ దేవాలయం, తిరుపతి
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/ac/TIRUPATHI_ISCON.jpg/150px-TIRUPATHI_ISCON.jpg)
తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉంది. ఇక్కడ ఈ ఆలయము హరేకృష్ణ ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందముగా తీర్చి దిద్దారు. ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.
ఇస్కాన్ దేవాలయం, ముంబై
[మార్చు]ఇక్కడ ఇస్కాన్ దేవాలయములు రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి జూహూ ప్రాంతములో సముద్ర తీరమునకు దగ్గరలో. మరొక దేవాలయము గిర్‌గావ్ సముద్ర తీరము దగ్గర (మరైన్ డ్రైవ్‌కు దగ్గరలో). ముంబాయి లోకల్ రైల్వే స్టేషన్లలో ఇస్కాన్ కార్యకర్తలు వారు ప్రచురించిన కృష్ణ సాహిత్యాన్ని అమ్ముతూ తరచూ కనిపిస్తూ ఉంటారు.
దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలు
[మార్చు]- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాయాపూర్ లో చంద్రోదయ దేవాలయం
- త్రిపురా రాష్ట్రంలోని అగర్తలలోని బనమాలీపుర్‌లో ఉన్న శ్రీ శ్రీ రాధాగోవింద మందిర్.
- గుజరాత్ లోని అహమ్మదాబాద్‌లో సర్ఖేజ్ గాంధీ నగర్ హైవే భోపాల్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌లో కాశీరంజ్ నగర్ బాలుఅఘత్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా వేణుమాధవ మందిర్.
- మహారాష్ట్ర లోని అమరావతి లోని సరస్వతీ నగర్ రతి నగర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- మహారాష్ట్ర లోని సంగ్లి జిల్లాలోని హరేకృష్ణా గ్రామ్‌లోని ఇస్కాన్ టెంపుల్.
- మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని సిడ్కో వద్ద ఇస్కాన్ ఔరంగాబాద్ టెంపుల్.
- కర్నాటక లోని బెంగుళూరు లోని శ్రీపురమ్, శేషాద్రి పురమ్ వద్ద ఉన్న ఇస్కాన్ జగన్నాధ్ మందిరమ్.
- మహారాష్ట్ర లోని బీడ్ లోని స్వాతి మాలి ఛౌక్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- కర్నాటక లోని బెల్‌గమ్ శుక్రవార పేట్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- ఒడిషా లోని భద్రక్ లోని కౌంష్ భద్రక్ వద్ద ఉన్న గురు గోపాల్ మందిర్.
- రాజస్థాన్ భరత్‌పుర్ లోని జీవన్ నిర్మన్ సంస్థాన్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- ఒడిషా లోని భువనేశ్వర్ ఐ ఆర్ సి వద్ద ఉన్న శ్రీకృష్ణ బలరామ్ టెంపుల్ ఇస్కాన్.
- మహారాష్ట్ర లోని బొంబాయి లోని హరే కృష్ణా అండ్ జుహూ రోడ్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
- ఒడిషా లోని బరంపూర్ లోని గంజమ్ లోని హరే కృష్ణా టెంపుల్.
- పశ్చిమ బెంగాల్ లోని కొలకత్తాలో 3సి ఆల్బర్ట్ రోడ్ మింటో పార్క్ వెనుక బిర్లా ఉన్నత పాఠశాల వెనుక ఉన్న శ్రీ శ్రీ రధా గోవింద మందిర్.
- మహారాష్ట్ర గాడ్ చిరోలి జిల్లా లోని ఇస్కాన్ టెంపుల్.
- పంజాబ్ రాష్ట్రం లోని ఛంఢీఘర్ లోని దక్షిణ మార్గ్ సెక్టర్ 36-బి లోఉన్న హరే కృష్ణా ధామ్.
- తమిళ నాడు లోని చెన్నై లోని చోళింగ నల్లూరు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న భక్తి వేదాంత స్వామి రోడ్ అక్కరైలో ఉన్న హరే కృష్ణా లాండ్.
- తమిళనాడు కోయంబత్తూరు హరేకృష్ణా రోడ్ సి ఐ టి కాలేజ్ ఎదురుగా శ్రీ జగన్నాధ్ మందిర్ ఇస్కాన్.
- మహారాష్ట్ర ఉత్తర్ కసాడే అల్కాట్ రోడ్ న్యూ జకనక వద్ద ఉన్న భక్తి వేదాంత్ మార్గ్ వద్ద ఉన్న హరేకృష్ణా లాండ్ 1ఇస్కాన్ సోలాపుర్.
- గుజరత్ జామ్‌నగర్ జిల్లా దేవి భవన్ రోడ్ ద్వారకథామ వద్ద ఉన్న స్కాణ్ టెంపుల్.
- గుజరాత్ ద్వారకలో దేవీ భవన్ రోడ్ భారతీయ భవన్ వద్ద ఉన్న ఇస్కాన్ రోడ్.
- గుజరాత్ గంగాపుర్ సూరత్-బర్దోలి రోడ్ వద్ద భక్తి వేదాంత రాజవిద్యాలయ.
- ఉత్తరప్రదేశ్ ఘాజియా బాద్ హరే కృష్ణ మార్గంలో ఉన్న రాజ్ నగర్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్.
- ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఉన్న ఇస్కాన్.
- అస్సామ్ రాష్ట్రం గౌహతి ఉలూబారి చరాలి వద్ద ఉన్న ఇస్కాన్.
- ఆంధ్రప్రదేశ్ హనుమకొండ నీలాడీ రోడ్ కపువాదా వద్ద ఉన్న ఇస్కాన్.
- ఉత్తరాంచల్ హరిద్వార్ నయీ బస్తీ, మహదేవ్ నగర్ భిమ్‌గోడా వద్ద ఉన్న శ్రీల ప్రభుపాద ఆశ్రమ్.
- ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నాంపల్లీ స్టేషను రోడ్ లో అబిడ్స్ పుల్లారెడ్డి స్వీటధౌస్ ఎదురుగా ఉన్న
ఇస్కాన్ విశేషాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Gibson 2002, p. 4
- ↑ Satsvarupa, Dasa goswamy, Srila Prabhupada Lilamrta Vol 1, BBT, p. 408, ISBN 0892133570
- ↑ 3.0 3.1 "The Four Legs of Dharma". Archived from the original on 2009-08-11. Retrieved 2008-12-26.
- ↑ ఇస్కాన్ బెంగళూరు చరిత్ర, వివరణ మొదటి పేజీ Archived 2008-12-21 at the Wayback Machine
- ↑ ఇస్కాన్ బెంగళూరు చరిత్ర, వివరణ మూడవ పేజీ Archived 2009-01-05 at the Wayback Machine
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-20. Retrieved 2008-12-26.