అంకణము (భూమి కొలత)
స్వరూపం
అంకణము అనేది భూవైశాల్యాన్ని కొలవడానికి వాడే ఒక దేశీయ ప్రమాణం (ఎకరం లాగా). ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరూ, తిరుపతీ ప్రాంతాల్లో, అలాగే కర్ణాటకలోని అనేకల్ (Anekal ), బెంగళూరు ప్రాంతాలలో వాడబడుతుంది. ఈ కొలతతో భూమి వెలను తేలిగ్గా అంచనా వెయ్యగలగడము బహుశ దీని వాడకానికి కారణమయ్యుండొచ్చు .
వ్యుత్పత్తీ, నిఘంటు నిర్వచనాలు
[మార్చు]అంకణము అనే పదము అడుగు/అంగ పదాల నుండి వచ్చింది.
- రెవ్. ఫెర్డినాండ్ కిట్టెల్ (Ferdinand kittel ) తన కన్నడ-ఆంగ్ల నిఘంటువులో అంకణాన్ని రెండు స్తంభాల మధ్యన లేదా దూలాల మధ్య ఉండే చోటుగా నిర్వచించారు.[1]
- కిట్టెల్ నిఘంటువును మూలముగా చూపుతూ బ్రౌణ్య నిఘంటువులో కూడా ఇదే అర్థము ఇవ్వబడింది. అదనంగా దీని ఆంగ్ల సమానార్థకముగా intercolumniation ఇవ్వబడింది.[2]
- హిందూ ఆలయ నిర్మాణ శాస్త్రములో అంకణమును అనేది రెండు స్తంభాల మధ్య దూరంగా, అలాగే స్తంభానికీ మరొక (గోడకూ) మధ్య దూరంగా చెప్పబడింది. కనుక ఇది ఒక కచ్చితమైన ప్రమాణము కాదు
ఇతర కొలమానాలతో పోలిక
[మార్చు]నెల్లూరూ, ఇతర ప్రాంతాల్లో ఒక అంకణము అంటే 72 sq ft (6.7 మీ2). తిరుపతిలో మాత్రము ఒక అంకణము అంటే 36 sq ft (3.3 మీ2). దీన్నే తిరుపతి అంకణము అని కూడా అంటారు.
1 ఎకరం = 100 సెంట్లు = 0.405 హెక్టార్లు = 605 అంకణాలు
1 సెంటు = 6.05 అంకణాలు = 48 చ.గజాలు
1 అంకణము = 8 చదరపు. గజాలు = 72 చదరపు. అడుగులు
1 తిరుపతి అంకణము = 4 చ.గజాలు = 36 చ. అడుగులు (తిరుపతిలో)
1 చదరపు. గజము= 9 చదరపు. అడుగులు.