సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్‌లోని ఆరు జోన్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

[మార్చు]
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 24 నుంచి 28, 30 (పాక్షికం). ఈ నియోజకవర్గంలో మారేడ్ పల్లి, తిరుమల గిరి, బొల్లారం, సిక్కు గ్రామం, లోతు కుంట, కార్ఖానా, బేగంపేట, రాష్ట్రపతి రోడ్డు మండలాలు ఉన్నాయి.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1]

(ఉప ఎన్నిక)

71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) శ్రీ గణేష్ నారాయణన్ పు కాంగ్రెస్ 53651 టీ.ఎన్. వంశా తిలక్ పు బీజేపీ 40445
2023[2] 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) లాస్య నందిత స్త్రీ బీఆర్ఎస్ 59057 శ్రీ గణేష్ నారాయణన్ పు బీజేపీ 41888
2018 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న పు టిఆర్ఎస్[3] 65797 సర్వే సత్యనారాయణ పు కాంగ్రెస్ 28234
2014 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న పు టీడీపీ 44693 గజ్జెల నాగేశ్ పు టిఆర్ఎస్ 41418
2009 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) పి.శంకరరావు పు కాంగ్రెస్ 36853 జి. సాయన్న పు టీడీపీ 32670
2004 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న పు టీడీపీ 89684 రావుల అంజయ్య పు టిఆర్ఎస్ 74652
1999 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న పు టీడీపీ 95227 డి.బి. దేవేందర్ పు కాంగ్రెస్ 65286
1994 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) జి. సాయన్న పు టీడీపీ 47603 డి. నర్సింగ్ రావు పు కాంగ్రెస్ 43967
1989 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) డి.నర్సింగ్ రావు పు కాంగ్రెస్ 55703 ఎన్.ఏ. కృష్ణ పు టీడీపీ 32904
1985 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) సర్వే సత్యనారాయణ పు టీడీపీ 35427 బి. మచ్చేందర్ రావు పు కాంగ్రెస్ 28521
1983 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) ఎన్.ఏ. కృష్ణ పు స్వతంత్ర 25847 బి. మచ్చేందర్ రావు పు కాంగ్రెస్ 16808
1978 211 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) బి. మచ్చేందర్ రావు[4] పు జనతా పార్టీ 15946 ముత్తు స్వామి పు కాంగ్రెస్ 15580
1972 215 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) వీ. మంకమ్మ[5][6] పు కాంగ్రెస్ 18891 బి.ఎం. నర్సింహా పు ఎస్.టి.ఎస్ 11187
1967 215 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) వీ. ఆర్. రావు పు కాంగ్రెస్ 22643 బి.దేవరాజన్ పు స్వతంత్ర 11558
1962 218 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) బి. వీ. గురుమూర్తి పు కాంగ్రెస్ 18209 పి. జగన్నాధన్ పు స్వతంత్ర 7970
1957 21 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) బి. వీ. గురుమూర్తి పు కాంగ్రెస్ 17578 పి. జగన్నాధన్ పు పి.ఎస్.పి 7572

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జి.శాయన్న పోటీ చేస్తున్నాడు.[7]

2024 ఉప ఎన్నిక

[మార్చు]

2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించగా, ఖాళీ అయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి మే 13న నిర్వహిస్తామని  సీఈసీ ప్రకటించారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. [8] సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది.ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఘనవిజయం సాధించారు.ఆయన తన సమీప ప్రత్యర్థి,భారతీయ జనతా పార్టీ నేత వంశీచంద్ తిలక్ పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి దివంగత ఎమ్మల్యే లాస్యనందిత సోదరి, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తే నివేదిత మూడో స్థానంలో నిలచింది.గత ఎన్నికల్లో లాస్యనందిత 59,057 ఓట్లతో విజయం సాధించగా ఇప్పుడు నివేదత కు 34,462 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు లో అడుగు పెట్టింది. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 స్థానాలను భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది.మిగతా వాటిలో ఏడు మజ్లిస్ ఒకటి భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరాయి.కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయింది.[9]

తెలంగాణ శాసనసభ ఉప ఎన్నిక, 2024 : సికింద్రాబాద్ కంటోన్మెంట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ శ్రీ గణేష్ నారాయణన్ 53,651 40.86%
బీజేపీ TN వంశీచంద్ తిలక్ 40,445 30.8%
బీఆర్ఎస్ జి నివేదిత సాయన్న 34,462 26.25%
నోటా పైవేవీ లేవు 969 0.74%
మెజారిటీ 13,206 17.10%
పోలింగ్ శాతం 1,31,294 98.65% 0

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Cantonment Assembly Bye Election". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. Eenadu (16 November 2023). "7 దశాబ్దాలు 10 మందే వనితలు". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  6. Eenadu (5 November 2023). "56 ఏళ్లలో ఒక్కసారే మహిళా ప్రాతినిధ్యం". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  7. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  8. V6 Velugu (16 March 2024). "మే13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. IANS (2024-06-05). "Congress wrests Secunderabad Cantonment Assembly seat from BRS". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-06-08.