విండోస్ చిట్కాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ విండోస్ వాడేటపుడు చిన్న చిన్న చిట్కాలు వాడితే పని తేలికవుతుంది.

మైక్రోసాఫ్ట్ లోగో (2012)

చిట్కాలు

[మార్చు]
  • అప్పుడప్పుడు ఏదైనా విండోను close చేద్దామనుకొంటే అది మొరాయిస్తూ ఉంటుంది కదా, అప్పుడు ctrl+alt+delete ఈ మూడు buttun లను ఒకేసారి నొక్కండి. అప్పుడు మీకు మానిటర్ మీద Windows Task Manager కనబడుతుంది. మీరు ఏ విండోను close చేయాలని అనుకొంటున్నారో అందులో select చేసుకుని End అనే బటన్ నొక్కండి.
  • చాలా విండోలు ఓపెన్ అయిఉన్నపుడు మీరు Desktop నేరుగాకు వెళ్ళాలంటే Windows key+D అక్షరాన్ని నొక్కండి.
  • అన్ని విండోలు ఒకేసారి Minimise చేయాలనుకొంటే Windows key+M అక్షరాన్ని నొక్కండి.
  • కంప్యూటర్ లో అనేక విండోలు ఓపెన్ అయ్యి ఉంటే ఒక దానిని మాత్రమే ఓపెన్ చెయ్యటానికి alt+tab కీని నొక్కండి.
  • CMOS బ్యాటరీ లేకపోతే మామూలు కన్నా విండోస్ బూటింగ్ స్లో అవుతుంది. BIOS OS కి ట్రాన్స్ ఫర్ అయ్యే సమయం ఎక్కువవుతుంది.
  • DDR2 రామ్ స్లాట్ ఉన్న మదర్‍బోర్డ్ లలో 1GB సామర్ధ్యం కలిగిన మెమరీ మాడ్యూల్‍ని వాడడం ద్వారా పెర్‍ఫార్మెన్స్ బాగుంటుంది.
  • ఎలాంటి స్క్రీన్‍సేవర్‍ని ఉపయోగించకుండా LCD మోనిటర్‍ని నిరంతరం ఆన్ చేసి ఖాళీగా ఉంచితే 50% వరకూ బ్రైట్‍నెస్ తగ్గుతుంది.
  • ఏ కారణం వల్లయినా సిడిరామ్ డ్రైవ్ డోర్ బయటకు రానట్లయితే దానిపై ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ హోల్‌లో పిన్‌తో గుచ్చండి.
  • Desktop.scf అనే ఫైల్ డిలీట్ చెయ్యబడినప్పుడు Quick Launch Barపై Show Desktop ఆప్షన్ సైతం మాయమవుతుంది.
  • NVROM cleared by jumper అనే మెసేజ్ బూటింగ్ సమయంలో కనిపిస్తుంటే CMOS జంపర్ సరిగ్గా పెట్టలేదని అర్ధమన్నమాట.
  • మానిటర్ రవాణాలో కదిలినప్పుడు, కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే "Out-of-Sync" అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
  • USB డివైజ్‌లను కొన్నప్పుడు మొదట డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేస్తూ డివైజ్‌ని కనెక్ట్ చెయ్యమని అడిగినప్పుడు మాత్రమే కనెక్ట్ చేయండి.
  • కంప్యూటర్ ద్వారా బార్‌కోడ్‌లను రీడ్ చెయడానికి తప్పనిసరిగా Barcode Reader అనే హార్డ్‌వేర్ పరికరం మన వద్ద ఉండాలి.
  • Dos Command ప్రాప్ట్‌లో Windows డైరెక్టరీలో ఉండగా scanreg/backup అనే కమాండ్‌ని ఉపయోగించి విండోస్ రిజిస్ట్రీని బ్యాకప్ తీయవచ్చు
  • ఆప్టికల్ మౌస్‌లలో క్రింది భాగంలో ఉండే సెన్సార్ టేబుల్, మౌస్ పాడ్ వంటి వాటి ఉపరితలాన్ని గుర్తించడం ద్వారా మౌస్ మూమెంట్‌ని నిర్ణయించుకుంటుంది.
  • పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉన్న RAR ఫైళ్ళని Advanced RAR Password Recovery సాప్ట్ వేర్ తో రికవర్ చేసుకోవచ్చు.
  • screensaverకి పాస్‌వర్డ్‌ని సెట్ చేసి మర్చిపోయినట్టైతే విండోస్ రిజిస్త్ట్రీ ద్వారా పాస్‌వర్డ్‌ని తొలగించే అవకాశం ఉంటుంది.