రాంవీర్ సింగ్ బిధూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంవీర్ సింగ్ బిధూరి
రాంవీర్ సింగ్ బిధూరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
24 ఫిబ్రవరి 2020
ముందు విజేందర్ గుప్తా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2020 – ప్రతుతం
ముందు నారాయణ్ దత్ శర్మ
నియోజకవర్గం బదర్‌పూర్
పదవీ కాలం
డిసెంబర్ 2013 – నవంబర్ 2014
ముందు రామ్ సింగ్ నేతాజీ
తరువాత నారాయణ్ దత్ శర్మ
నియోజకవర్గం బదర్‌పూర్
పదవీ కాలం
డిసెంబర్ 2003 – డిసెంబర్ 2008
ముందు రామ్ సింగ్ నేతాజీ
తరువాత రామ్ సింగ్ నేతాజీ
నియోజకవర్గం బదర్‌పూర్
పదవీ కాలం
డిసెంబర్ 1993 – డిసెంబర్ 1998
తరువాత రామ్ సింగ్ నేతాజీ
నియోజకవర్గం బదర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-12-04) 1952 డిసెంబరు 4 (వయసు 71)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ

ఎన్‌సీపీ (2008 వరకు) జనతాదళ్

నివాసం తుగ్లకాబాద్, న్యూఢిల్లీ, 110044
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ (1973)
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రామ్‌వీర్ సింగ్ బిధూరి (జననం 4 డిసెంబర్ 1952) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 24 ఫిబ్రవరి 2020 నుండి ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

రాంవీర్ సింగ్ బిధూరి 4 డిసెంబర్ 1952న ఢిల్లీలోని తుగ్లకాబాద్ గ్రామంలో జన్మించాడు.ఆయన 1973లో ఢిల్లీ యూనివర్శిటీలోని దేశబంధు గుప్తా కాలేజీలో బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రాంవీర్ సింగ్ బిధురి 1970లో ఢిల్లీ యూనివర్సిటీలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో చేరడం ద్వారా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత జనతాదళ్ పార్టీలో చేరి 1981 నుండి 1985 వరకు హర్యానా వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1993లో బదర్‌పూర్ నియోజకవర్గం నుండి జనతాదళ్ టిక్కెట్‌పై పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రాంవీర్ సింగ్ 2003లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాంవీర్ సింగ్  2012లో భారతీయ జనతా పార్టీలో చేరి 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2013లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2015లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత 2020లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 24 ఫిబ్రవరి 2020 నుండి ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తున్నాడు.

రాంవీర్ సింగ్ బిధూరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[3][4]

నిర్వహించిన పదవులు[మార్చు]

# నుండి కు స్థానం
01 1981 1985 హర్యానా వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
02 1993 1998 ఢిల్లీ మొదటి శాసనసభ సభ్యుడు
03 2003 2008 ఢిల్లీ మూడవ శాసనసభ సభ్యుడు
05 2013 2014 ఢిల్లీ ఐదవ శాసనసభ సభ్యుడు
06 2020 ప్రస్తుతం ఢిల్లీ ఏడవ శాసనసభ సభ్యుడు
07 2020 ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు

మూలాలు[మార్చు]

  1. The Indian Express (24 February 2020). "Ramvir Bidhuri to be Leader of Opposition in Delhi Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  2. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  3. TV9 Bharatvarsh (2024). "Ramveer Singh Bidhuri BJP Candidate Profile: Delhi Ramveer Singh Bidhuri" (in హిందీ). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The New Indian Express (3 March 2024). "A mix of young and experienced BJP faces" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.