యముడు 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యముడు 3
దర్శకత్వంహరి
రచనహరి
నిర్మాతశివకుమార్ మల్కాపురం
తారాగణంసూర్య
అనుష్క
శ్రుతి హాసన్
రాధిక శరత్‌కుమార్
ఛాయాగ్రహణంప్రియన్
కూర్పువి.టి.విజయన్
సంగీతంహారిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
సురక్ష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా
విడుదల తేదీ
2017 ఫిబ్రవరి 9 (2017-02-09)
సినిమా నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

యముడు 3 2017లో విడుదలైన తెలుగు సినిమా. సింగం 3 పేరుతో తమిళంలో జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించగా సూర్య, అనుష్క, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై శివకుమార్ మల్కాపురం 2017 ఫిబ్రవరి 9న విడుదల చేశాడు.

కర్ణాటకకు చెందిన పోలీస్ కమిషనర్ దారుణ హత్యకు గురవుతాడు. దీనిని పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసింహం(సూర్య)ను డిప్యూటేషన్ మీద అక్కడికి రప్పించుకుంటాడు హోం మినిస్టర్(శరత్ బాబు). అక్కడకు చేరుకున్న నరసింహం, కమీషనర్‌ను చంపింది మధుసూదన్ రెడ్డి (శరత్ సక్సేనా) ఈ గ్యాంగ్ వెనక ఆస్ట్రేలియాలో ఉండే విఠల్ (అనూప్ సింగ్) హస్తం ఉందని తెలుసుకొని పట్టుకోవడానికి ఆస్ట్రేలియాకు బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న నరసింహకు కొన్ని ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాడు. అసలు అనూప్ కమీషనర్‌ను చంపడానికి గల కారణాలు ఏంటి? నరసింహ ఈ మిషన్‌ను పూర్తి చేయగలిగాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సురక్ష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా
  • నిర్మాత: మల్కాపురం శివకుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
  • సంగీతం: హరీష్ జయరాజ్
  • సినిమాటోగ్రఫీ: వి.టి.విజయన్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (9 February 2017). "'సింగం-3' రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=యముడు_3&oldid=3627979" నుండి వెలికితీశారు