పోరిక బలరాం నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోరిక బలరాం నాయక్
పోరిక బలరాం నాయక్

పదవీ కాలం
జూన్ 2009, – మే 2014, రెండో సారి 2024 నుండి ప్రస్తుతము
ముందు సీతారాం నాయక్
తరువాత మాలోత్ కవిత
నియోజకవర్గం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-06) 1964 జూన్ 6 (వయసు 60)
మదనపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి తిరుపతమ్మ
జూలై 17,1986 (వివాహం)
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం బంజారాహిల్స్, హైదరాబాద్
పూర్వ విద్యార్థి బి.ఏ. ఆంధ్రా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
వృత్తి సామాజిక వేత్త, రాజకీయ నాయకులు,
మతం హిందూ

పోరిక బలరాం నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, 15,18వ పార్లమెంటు సభ్యుడు.[1] భారత జాతీయ కాంగ్రెస్ తరపున మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

బలరాం నాయక్ 1964, జూన్ 6న లక్ష్మణ్ నాయక్, లక్ష్మి (గ్రామీణ బంజారా కుటుంబం) దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, ములుగు మండలం లోని మదనపల్లి లో జన్మించాడు. హైదరాబాద్ లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. చేశాడు.[4]

వివాహం

[మార్చు]

1986, జూలై 17న తిరుపతమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

వృత్తి జీవితం

[మార్చు]

బలరాం నాయక్ 2009 లో రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు, పోలీసు కానిస్టేబుల్ గా పనిచేశాడు. అటుతడువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు పోటిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై 68.957 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] లేబర్ కమిటీ సభ్యులుగా ఉన్నాడు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమించడ్డాడు.

2024లో మహబూబాబాద్ (ఎస్టీ) లోక్ సభ నియోజక వర్గం నుండి 18 వ లోక్ సభకు పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాలోత్ కవిత పై 344,214 ఓట్ల మెజారిటితో గెలుపొందాడు.[7]

సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన వ్యక్తుల సంక్షేమ అభ్యున్నతికి కృషి చేశాడు. వృద్ధులకు, జబ్బుపడిన వ్యక్తులకు ఆశ్రయం అందించడానికి వృద్ధాశ్రమ ఏర్పాటు వంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. http://news.outlookindia.com/item.aspx?707674[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-04. Retrieved 2017-02-23.
  3. Bharat, E. T. V. (2024-06-04). "ఉమ్మడి వరంగల్​లో కాంగ్రెస్ జయకేతనం - భారీ మెజారిటీతో గెలుపొందిన కడియం కావ్య, బలరాం నాయక్​ - WARANGAL LOK SABHA POLL RESULT 2024". ETV Bharat News. Retrieved 2024-06-04. {{cite web}}: zero width space character in |title= at position 14 (help)
  4. "Members : Lok Sabha (Naik, Shri Porika Balram)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-30. Retrieved 2021-12-30.
  5. 5.0 5.1 "Fifteenth Lok Sabha Members Bioprofile - Balram, Shri Porika Naik". Archived from the original on 2010-08-20. Retrieved 2017-02-19.
  6. "Mahabubabad Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-12-30.
  7. "Mahabubabad, Telangana Lok Sabha Election Results 2024 Live Updates: Balram Naik Porika of INC has a promising lead as votes are counted". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.