గొట్టిపాటి రవి కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొట్టిపాటి రవి కుమార్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - ప్రస్తుతం
ముందు కరణం బలరామకృష్ణమూర్తి
నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 నవంబర్ 1974
పోతురాజుగండి, అద్దంకి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు శేషగిరి రావు

గొట్టిపాటి రవి కుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

గొట్టిపాటి రవికుమార్ 10 నవంబర్ 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలో జన్మించాడు. ఆయన గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి, తావనగిరిలో బి.ఐ.ఈ.టి. కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం[మార్చు]

గొట్టిపాటి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 13,806 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన 2009లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి పై, 2014లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా,[2] 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3] గొట్టిపాటి రవి కుమార్ 2024లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిపై  24890 ఓట్ల మెజార్టీతో ఐదో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

ఎన్నికలలో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ ఫలితం
2004 మార్టూరు గొట్టిపాటి రవి కుమార్‌ కాంగ్రెస్ పార్టీ గొట్టిపాటి నర్సయ్య తె.దే.పా గెలుపు
2009 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ కాంగ్రెస్ పార్టీ కరణం బలరామకృష్ణమూర్తి తె.దే.పా గెలుపు
2014 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ వై.కా.పా కరణం వెంకటేష్ తె.దే.పా గెలుపు
2019 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ తె.దే.పా బాచిన చెంచుగరటయ్య వై.కా.పా గెలుపు
2024 అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ తె.దే.పా పాణెం చినహనిమిరెడ్డి వై.కా.పా గెలుపు

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 March 2019). "మళ్ళీ అదే రిపీట్‌ అవుద్ది..!". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  4. Andhrajyothy (5 June 2024). "ఐదో సారి గొట్టిపాటి విజయదుందుభి". Retrieved 5 June 2024.
  5. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Addanki". Retrieved 5 June 2024.