ఎన్.నవీన్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.నవీన్ కుమార్ రెడ్డి
ఎన్.నవీన్ కుమార్ రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 జూన్ 2024 - 4 జనవరి 2028
నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 నుండి 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1983
మొదల్లగూడ, నందిగామ మండలం,రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం[1]
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకట్రామ్ రెడ్డి, శోభా రెడ్డి
జీవిత భాగస్వామి లక్ష్మి
వృత్తి రాజకీయ నాయకుడు

నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నవీన్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో మహబూబ్​నగర్​ జిల్లా కొత్తూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జెడ్పిటీగా గెలిచి 2014 నుండి 2019 వరకు మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి షాద్‌నగర్ నియోజకవర్గం టికెట్ ఆశించి దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నిలక సంఘం ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేయగా బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌రెడ్డిని 2024 మార్చి 28న జరిగిన మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.[3][4]

ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోలవగా  జూన్ 2న జరిగిన ఓట్ల లెక్కింపులో అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించగా, మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్‌కు 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. దింతో బీఆర్ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. Ceo-Telangana (2024). "N. Naveen Kumar Reddy Affidavit" (PDF). Archived from the original (PDF) on 1 April 2024. Retrieved 1 April 2024.
  2. EENADU (3 June 2024). "మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానం భారాసదే". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
  3. Eenadu (8 March 2024). "మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  4. The Hindu (7 March 2024). "Naveen Kumar Reddy is BRS candidate for MLC elections" (in Indian English). Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  5. EENADU (2 June 2024). "మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
  6. Andhrajyothy (2 June 2024). "మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
  7. EENADU (3 June 2024). "స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్‌కుమార్‌ రెడ్డి". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.