అప్పడం
అప్పడం ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని భారతదేశం, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
కావలసిన పదార్థాలు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA_%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg/220px-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA_%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/41/%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg/250px-%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg)
అప్పడాలను రకరకాలైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది మినప పిండి. మినప పిండిని మిరియాల పొడి,, ఉప్పుతో కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు కలిసి చపాతీ పిండి కలిపినట్లుగా నెమ్మదిగా కలుపుతారు. ఇలా తయారైన మిశ్రమాన్ని గుండ్రంగా, పలుచటి పొరల్లాగా రుద్ది, ఎండబెడతారు. ఎండబెట్టిన తరువాత భద్ర పరుస్తారు. మినప పిండే కాకుండా ఇందులో బియ్యప్పిండి, ఎండబెట్టిన పనస తొనలు, సగ్గుబియ్యం లాంటి వాటిని కూడా వాడుతుంటారు. మిరియాలు, మిరప పొడి, ఇంగువ, జీలకర్ర, నువ్వులు లాంటివి ఫ్లేవర్ కోసం వాడతారు.
వ్యాపారం
[మార్చు]భారతదేశంలో అప్పడాల తయారీ వ్యాపారంలో అనేకమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.[1] మహిళలు సొంతంగా,, బృందాలుగా ఏర్పడి అప్పడాలు, పచ్చళ్ళు, ఇతర చిరుతిళ్ళు తయారు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో ఇదొకటి.
మూలాలు
[మార్చు]- ↑ World Bank. "Empowering Women in Urban India: Shri Mahila Griha Udyog Lijjat Papad" (.pdf). Empowerment Case Studies. World Bank. Retrieved 2012-09-23.